Home /News /andhra-pradesh /

EIGHT SECRETARIAT EMPLOYEES ON ESI SCAM IN ANDHRA PRADESH BN

ఈఎస్ఐ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సచివాలయంలో పనిచేసే ఎనిమిది మంది ఉద్యోగులు ఈ స్కామ్ వ్యవహారానికి సహకరించినట్టుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో తేల్చింది. అయితే ఆ సచివాలయ ఉద్యోగులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా సమాచారం.

    ఈఎస్ఐ స్కామ్.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉద్యోగుల నుంచి మాజీ మంత్రుల వరకు ఈ స్కామ్ ఓ కుదుపు కుదిపింది. ఈ ఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ప్రస్తుతం కేసు ఏసీబీ చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో స్కామ్‌పై అవినీతి నిరోధక శాఖ అధికారులు వేగం పెంచారు. తాజాగా ఈ స్కామ్‌లో కొందరు సచివాలయం ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. సచివాలయంలో పనిచేసే ఎనిమిది మంది ఉద్యోగులు ఈ స్కామ్ వ్యవహారానికి సహకరించినట్టుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో తేల్చింది. అయితే ఆ సచివాలయ ఉద్యోగులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా సమాచారం. వారి ఫోన్లను సైతం స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సదరు ఉద్యోగులను కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇదిలావుంటే.. ఆ సచివాలయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు నోట్ ఫైల్ పంపకుండానే ప్రక్రియ ముందుకు వెళ్లేలా చేయడంలో వారు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు భయపడి పారిపోయి ఉండొచ్చని సమాచారం.
    First published:

    Tags: ACB, Andhra Pradesh, Esi scam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు