EIGHT IAS THREE IPS TRANSFERS AP GOVERNMENT RELEASE NEW GO TTD EO JAWAHAR REDDY IN KEY POSITION NGS GNT
AP Transfers: ఎనిమిది మంది ఐఏఎస్.. ముగ్గురు ఐపీఎస్ లు.. ఏపీలో భారీగా బదిలీలు.. కారణం అదేనా..?
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి (ఫైల్)
AP Transfers: టార్గెట్ 2024 దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం పరంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేసిన ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటుపై దూకుడు పెంచారు. అదే సమయంలో ఏ అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలని అనే దానిపైనా ప్రత్యేక ఫోకస్ చేశారు.
AP Transfers: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohar Reddy) 2024 ఎన్నికలపై అప్పుడే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఓ వైపు పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు.. జిల్లాల వారిగా పార్టీ పరిస్థితి.. అంతర్గత విబేధాలపై ఇప్పటికే లెక్కలు తెప్పించుకున్నట్టు టాక్.. పార్టీలో గ్రూపు తగాదాలు సద్దుమణిగేలా చేయాలని.. బాధ్యులను కూడా నియమించారు. రెండు మూడు రోజుల్లో ఆ ఇన్ ఛార్జులు రివ్యూలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో త్వరలో మంత్రివర్గ విస్తరణకు కూడా సీఎం లైన్ క్లియర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లిస్ట్ ఫైనల్ చేశారాని.. ఏ జిల్లాలో ఎవరికి పదవి ఇవ్వాలన్నదానిపై ఇప్పటికే ఫైల్ సీఎం దగ్గర ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలా పార్లీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టుని ఆయన.. ఇటు పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) చేసే దిశగా దూకుడు చూపిస్తున్నారు. ఏ జిల్లాకు ఏ అధికారులను పంపాలి అన్నదానిపైనా ఆయన ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న అధికారుల్లో చాలామందికి.. నమ్మకస్తులుగా చెప్పుకునే కొందరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా భారీగా బదిలీలపై సీఎం ఫోకస్ చేశారు...
తాజాగా ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్న కే జవహర్‌రెడ్డి (TTD EO Jawahar Reddy)ని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అదే సమయంలో ఆయన టీటీడీ ఈవోగా కూడా కొనసాగుతారని పేర్కొంది. అలాగే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్, సీసీఎల్‌గా జీ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక రవాణాశాఖ కమిషనర్‌గా ఎంటీ కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించిందింది ప్రభుత్వం. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్, క్రీడలు, యువజన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు.ఎకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారి పీ.సీతారామాంజనేయులుకు ఏపీపీఎస్సీ కార్యదర్శి నుంచి రిలీవ్ చేసింది. ఏసీబీ డీజీగా కే రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ డీజీగా రామాంజనేయులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా భరత్ బక్చిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బదిలీలు ఇక్కడితోనే ఆగే అవకాశం లేదు.. జిల్లాల విభజన పూర్తైన తరువాత.. భారీ స్థాయిలో బదిలీలు ఉంటాయనే ప్రచారం ఉంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.