హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగవేత..సుజనాకు ఈడీ సమన్లు

బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగవేత..సుజనాకు ఈడీ సమన్లు

సుజనాచౌదరి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొట్టారని.. ఆయన సంస్థల్లో పనిచేస్తున్నఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి.

  కేంద్ర మాజీమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. బ్యాంకులకు అప్పు ఎగవేత కేసులో సుజనాకు సమన్లు జారీచేసిన ఈడీ..ఈ నెల 27న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. శనివారం హైదరాబాద్, ఢిల్లీలోని సుజనా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. 6 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు రూ.5,700 కోట్లు పైగా ఎగవేసాయని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.

  సుజనాచౌదరి 120కిపైగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొట్టారని.. ఆయన సంస్థల్లో పనిచేస్తున్నఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి. గంగా స్టీల్ ఎంటర్ ప్రైజెస్, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే... కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు సమాచారం . ఈ ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

  గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేశారు. అప్పట్లో పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు , ఫైల్స్ , కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. చాలావరకు నిధులను డొల్లకంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల ఫొరెన్సిక్ ఆడిటింగ్‌లోనూ ఈ విషయం తేలినట్లు సమాచారం. మూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ కేసుల విచారణ కీలక దశకు చేరుకుంది. గత రెండు రోజులగా సుజనాకు సంబంధించిన కంపెనీల్లో, సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

  First published:

  Tags: Andhra Pradesh, Enforcement Directorate, Sujana Chowdary, TDP

  ఉత్తమ కథలు