ఏపీలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, ఎన్నారై హాస్పిటల్ లో రెండో రోజు ఈడీ (Enforcement Directorate) రైడ్స్ ముగిశాయి. నిన్న ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సోదాలు జరిగాయి. సుమారు 9 గంటలకు పైగా ఈ సోదాలు జరగగా నేడు మరో 4 గంటల పాటు సోదాలు జరిగాయి. కాగా ఈ రైడ్స్ లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ (Enforcement Directorate) అధికారులు సోదాలు చేశారు. ఇక ఈ దర్యాప్తులో భాగంగా డాక్టర్లను కూడా అధికారులు విచారించారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి రూ.25 కోట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. MBBS, పీజీ సీట్ల ఫీజులు దారి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు.
విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో..
విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్ లో భాగంగా అధికారులు అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలువురిని ప్రశ్నిస్తున్నారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాగా అమెరికాలో వైద్యురాలుగా ఉన్న అక్కినేని మణి విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ను ప్రారంభించారు. కాగా గతంలో మణి ఎన్నారై ఆసుపత్రిలో డైరెక్టర్ గా వ్యహరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది.
గుంటూరులోని ఎన్నారై ఆసుపత్రిలో ఈడీ (Enforcement Directorate) అధికారులు రైడ్స్ చేపట్టారు. అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. కరోనా సమయంలో జరిగిన అవకతవకలు, అలాగే యాజమాన్య కోటా సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలతో దాడులు చేస్తున్నారు. ఇక మ్యానువల్ రశీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని తెలుస్తుంది. ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ (Enforcement Directorate) అధికారులు రైడ్స్ చేపట్టారు. MBBS సీట్ల కేటాయింపులో అలాగే బిల్డింగ్ నిర్మాణం విషయంలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో నిమ్మగడ్డ ఉపేంద్ర నాథ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాస రావు, నళిని మోహన్ రావు పై కేసులు నమోదు అయ్యాయి. ఇక నిమ్మగడ్డ ఉపేంద్ర నాథ్ ఇళ్లలో కూడా ఈడీ రైడ్స్ జరిగాయి. పోలీస్ కేసు ఆధారంగా ఈ రైడ్స్ జరిగినట్టు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Enforcement Directorate