ఫొణి తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఉండటం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎన్నికల నిబంధనావళి నుంచీ మినహాయింపు ఇవ్వాలని కోరిన ఏపీ సీఎం చంద్రబాబు వినతిపై సానుకూలంగా స్పందించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటూ... తూర్పు గోదావరి జిల్లాకు ఎన్నికల నిబంధనావళి నుంచీ మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం అధికారికంగా సహాయ చర్యలు చేపట్టేందుకు పూర్తి అవకాశాలు లభించాయి. అంతే కాదు... అవసరమైతే విధాన పరమైన నిర్ణయాలు కూడా తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 11నే ముగిశాయి. అందువల్ల అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, లేకపోయినా పెద్దగా నష్టం ఉండదని ఈసీ భావించినట్లు తెలిసింది. అదే సమయంలో ఇది వరకు వచ్చిన హుద్ హుద్, తిత్లీ తుఫాన్లను ఎదుర్కొనే విషయంలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేసింది. అందువల్ల కనీసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిబంధనలు సడలిస్తే, దాని వల్ల బాధిత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఈసీ భావించినట్లు తెలిసింది. అందుకే తుఫాను ప్రభావిత జిల్లాల్లో మెరుగైన సహాయ చర్యల్ని కోరుకుంటూ... నిబంధనలు సడలించింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే... ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. కార్యకలాపాలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (AP చీఫ్ సెక్రెటరీ) చూసుకోవాల్సి ఉండేది. ఇది ఇబ్బందికర పరిణామమే. మొత్తం భారమంతా సీఎస్‌పై పడితే కష్టమేనని భావించిన ఈసీ... ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ఒకరకంగా ఇది టీడీపీకి కూడా కలిసొచ్చే నిర్ణయమనే చెప్పాలి. సీఎస్ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో... అధికార పగ్గాలు ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం టీడీపీ నేతలకు హర్షదాయకమే.
ఇవి కూడా చదవండి :
బీజేపీ - టీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరుగుతోందా... మే 23 తర్వాత కొత్త రాజకీయం తెరపైకి వస్తుందా...
గిన్నీస్‌బుక్ ఎక్కిన క్రికెటర్ అరెస్ట్... ట్రూకాలర్ యాప్‌తో లక్షలు కాజేస్తూ...
సీసీ కెమెరాను కొట్టేసి... మరో సీసీ కెమెరాకు దొరికిన దొంగ...
ఎయిర్‌హోస్టెస్ చేతులు తడుముతూ వెధవ్వేషాలు... బుక్కైన హైదరాబాద్ వ్యాపారి