హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

East Godavari: ఆ ఇద్ద‌రూ జంపింగ్ జ‌పాంగ్‌లే.. రాజోలులో సీన్ రివ‌ర్స్ ..!

East Godavari: ఆ ఇద్ద‌రూ జంపింగ్ జ‌పాంగ్‌లే.. రాజోలులో సీన్ రివ‌ర్స్ ..!

రాజోలులో జనసేన-వైసీపీ పొలిటికల్ ఫైట్

రాజోలులో జనసేన-వైసీపీ పొలిటికల్ ఫైట్

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శత్రువులు ఉండ‌ర‌నేది పాత మాట‌. కాని ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం రోజుకో మార్పు క‌నిపిస్తోంది. అది కోన‌సీమ జిల్లా (Konaseema District) లో మ‌రీ ఎక్కువైంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Amalapuram, India

  P.Ramesh, News18, Kakinada

  రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శత్రువులు ఉండ‌ర‌నేది పాత మాట‌. కాని ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం రోజుకో మార్పు క‌నిపిస్తోంది. అది కోన‌సీమ జిల్లా (Konaseema District) లో మ‌రీ ఎక్కువైంది. ఈ రోజు పార్టీ ప్ర‌ధాన మీటింగ్‌లో మాట్లాడిన వ్య‌క్తి తెల్లారేస‌రికి ప‌క్క పార్టీలో జంపింగ్ అవుతున్నారు. ప‌దవి ఉన్న లేకున్న భ‌విష్య‌త్తే మ‌న‌కు ముఖ్యంగా స్కెచ్‌లు వేసేసుకుంటున్నారు. డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ కోనసీమ జిల్లా రాజ‌కీయాలంటే కాస్త ఆస‌క్తికరంగా ఉంటాయి. అందులో ప్ర‌స్తుతం అంద‌రికి హాట్ టాపిక్‌గా మారింది రాజోలు నియోజ‌క‌వ‌ర్గం (Razole constituency). ఎందుకంటే జ‌న‌సేన పార్టీ (Janasena Party) అధినేత ప‌వ‌న్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓట‌మిపాల‌య్యాడు. కానీ అదే పార్టీ నుండి రాజోలు ఎమ్మెల్యేగా రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలుపొంది జ‌నసేన‌లో నేనొక్క‌డినే ఎమ్మెల్యేన‌నిపించుకున్నాడు. ఇదంతా మొద‌ట్లో పెద్ద హ‌డావుడే అయ్యింది. కొంత కాలం త‌ర్వాత మొత్తం అక్క‌డ ప‌ద్ధతే మారిపోయింది.

  రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి పాల‌న త‌ర్వాత సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. ఈ ప్ర‌భావంతో జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యాడు. ఇంకేముంది ఉన్న ఒక్క ఎమ్యెల్యే కూడా జంపింగ్ జ‌పాంగ్‌. వైసీపీ అన్ని కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ ప్ర‌భావం రాజోలులో జ‌న‌సైనికులపై ప‌డింది. అక్క‌డి నుండి మొద‌లైన ర‌ణ‌రంగంతో జ‌న‌సేన ఎమ్మెల్యే జ‌న‌సేన‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు.

  ఇది చదవండి: ఏపీలో పాదయాత్ర చేస్తే అధికారం వస్తుంది..! మరి అమరావతికి రాజధాని వస్తుందా..?

  జ‌న‌సేన‌లో ఓట‌మి పాల‌య్యినప్ప‌టికీ వైసీపీ అధికారంలో ఉండ‌టంతో ఇన్‌ఛార్జి బొంతు రాజేశ్వ‌ర‌రావుకి తిరుగులేదు. ఎప్పుడైతే జ‌న‌సేన నుండి రాపాక వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యాడో రాజేశ్వ‌ర‌రావు వ‌ర్గం జీర్ణించుకోలేక‌పోయింది. ఒక ప‌క్క వైసీపీ మ‌ద్ధ‌తుతో జ‌న‌సేన ఎమ్మెల్యే పెత్త‌నం, మ‌రోపక్క వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న రాజేశ్వ‌ర‌రావు హ‌డావుడితో ఒకే ఒర‌లో రెండు క‌త్తులన్న‌ట్టుగా సీన్ మారిపోయింది. అయితే ఇక్క‌డ అధికంగా రాపాక వ‌రప్ర‌సాద్‌కే వైసీపీ అనుకూలంగా ఉండ‌టంతో బొంతు పాచిక‌లు రాజోలులో పార‌లేదు.

  ఇది చదవండి: అయ్యో, గోదావరి వరద నీరంతా సముద్రం పాలే..!

  ఈ క్ర‌మంలో రాపాక పూర్తిగా జ‌గ‌న్‌వైపు వెళ్లిపోగా, వైసీపీ ఇన్‌ఛార్జి రాజేశ్వ‌ర‌రావు ఏం పాలుపోలేని స్థితికి వ‌చ్చేశారు. క‌నీసం కార్య‌క‌ర్త‌ను కూడా కాపాడుకులేని నిస్సాహాయ స్థితికి రావ‌డంతో చివ‌రికి వైసీపీకి రాజీనామా చేసి, ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్టారు. గెలిచిన పార్టీలో నుండి అధికార పార్టీ చేతిలోకి, అక్క‌డ ఓడిన వైసీపీని వ‌దిలేసి జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు రాజేశ్వ‌ర‌రావు నిర్ణ‌యించుకోవ‌డం సంచ‌ల‌న రేకెత్తించింది.

  ఈ ప్ర‌భావం అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌పై కూడా ప‌డింద‌నే చెప్పాలి. రాజేశ్వ‌ర‌రావు అనూయ‌లంద‌రూ జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర‌య్యే ప‌రిస్థితి వచ్చింది. అటు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌రప్ర‌సాద్ వ‌ర్గం వైసీపికి ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో వారంతా వీర‌య్యార‌న్న‌ట్టుగా రాజోలులో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మున్ముందు ఇక్క‌డ ఇంకెన్ని మార్పులు జ‌రుగుతాయో తెలియ‌లంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Janasena party, Local News, Ysrcp

  ఉత్తమ కథలు