P Ramesh, News18, Kakinada
ఇటీవల కాలంలో జరుగుతున్న మరణాలు చూస్తుంటే అసలే ఎప్పుడెక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. హత్యలకు కారణాలు ఉండలేదు. జీవితానికి పరిష్కారం దొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు సంబంధంలేని విషయాల్లో కూడా హత్యలు జరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా కాకినాడ జిల్లాలో జరిగింది. కాకినాడ జిల్లా (Kakinada District) తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో జరిగిన నూకాలమ్మ జాతరలో ఇరువర్గాల ఘర్షణలో తొండంగికి చెందిన నడిమిపల్లి రాము అనే యువకుడు హత్యకు గురయ్యాడు. నూకాలమ్మ తల్లి ఊరేగింపులో అనూహ్యంగా రెండు సామాజిక వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
అనంతరం కొద్ది సేపటికీ గొడవ సద్దుమణిగిందనుకునేలోపు రాము అనే యువకుడిని గుంపుగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ రాముని దగ్గర్లో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అతడు మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులు హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్‌బాబు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, పలువురు అధికారులు సంఘటన జరిగిన శృంగవృక్షం గ్రామాన్ని పరిశీలించారు. గ్రామంలో పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో దళిత యువకుడి మృతిని జీర్ణించుకోలేని ఎస్సీలు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఊరు కాని ఊరు వెళ్లి
మృతుడు రాము ఊరు తొండంగి గ్రామం. తన అమ్మమ్మ ఊరైన శృంగ వృక్షం నూకాలమ్మ జాతరకు వెళ్లాడు. అక్కడ ఎస్సీ, ఓసీ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈనేపథ్యంలో ఎస్సీలు ఒకానొక సమయంలో ఇళ్లకు పరుగులెత్తారు. అయితే తనది ఈ ఊరు కాదని, తననేమి అనరని అనుకున్నాడే ఏమో రాము తన మోటారుసైకిల్ తీసుకుని తిరిగి శృంగవృక్షం వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈనేపథ్యంలో రాముపై ఒకేసారి గుంపుగా వచ్చి దాడి చేసినట్లు రాము వర్గీయులు చెబుతున్నారు.
గ్రామంలో చిన్నపాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. గ్రామంలో రెండు సామాజిక వర్గాలు కయ్యానికి కాలు దువ్వుకోవడంతో పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఎప్పుడెం జరుగుతుందేమోనన్న ఉద్ధేశ్యంతో ముందస్తుగా గ్రామంలో పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు. మరొపక్క ఎస్సీ సామాజిక వర్గ నేతలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించడం, న్యాయం చేయాలని పట్టుబట్టడంతో గ్రామంలో పరిస్థితులు చేదాటకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకులెవరూ ఆవేశానికి లోనుకావద్దని, దోషులను ఖచ్చితంగా పట్టుకుని శిక్షిస్తామంటుని సర్థి చెబుతున్నారు. రెండు సామాజిక వర్గాలు ఇంతిలా దాడులకు పాల్పడటానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News