హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: కొడుకు చనిపోయిన రెండు రోజుల తర్వాత మొబైల్ కు షాకింగ్ మెసేజ్.. పాపం అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు..

Shocking: కొడుకు చనిపోయిన రెండు రోజుల తర్వాత మొబైల్ కు షాకింగ్ మెసేజ్.. పాపం అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు..

మృతుడు సతీష్ (ఫైల్)

మృతుడు సతీష్ (ఫైల్)

అతని పేరు కోనా సతీష్. ఈనెల 24 తేదీన భీమవరం వద్ద రైల్ క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిది తూర్పు గోదావరి జిల్లా (East Godavari) కడియం తండ్రి పులా వ్యాపారి తల్లి గృహిణి సతీష్ పీజీ పూర్తి చేశాడు. ఐతే తమ కుమారుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వాళ్లకు తెలియదు. కానీ 26వ తేదీన కుమారుడి ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ తిన్నారు.

ఇంకా చదవండి ...

Anna Raghu, News18, Amaravati

అతని పేరు కోనా సతీష్. ఈనెల 24 తేదీన భీమవరం వద్ద రైల్ క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari) కడియం తండ్రి పులా వ్యాపారి తల్లి గృహిణి సతీష్ పీజీ పూర్తి చేశాడు. ఐతే తమ కుమారుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వాళ్లకు తెలియదు. కానీ 26వ తేదీన కుమారుడి ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ తిన్నారు. సతీష్ ఫోటో ని మార్ఫ్ చేసి నగ్నచిత్రంగా మర్చి తమ బాకీ తీర్చాలని మెసేజ్ లు పంపుతున్నారు. తమ అప్పు తీర్చకపోతే సతీష్ నగ్న చిత్రాలు సతీష్ కాంటాక్ట్స్ అందరికి పంపుతామని సందేశాలు వస్తున్నాయి. అసలే కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

మృదుస్వభావి అయిన సతీష్ పీజీ పూర్తిచేసి తన తల్లితండ్రులకు భారం కాకూడదని చదువుకోసం ఓ ఆన్లైన్ యాప్ లలో ఋణం పొందాడు. సకాలంలో చెల్లించకపోవడంతో యాప్ నిర్వహకులు ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు అతడ్ని బెదిరంపులకు గురిచేయడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపారు. విషయం తెలిసిన సతీష్ మానసిక క్షోభకు గురయ్యాడు. సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన సతీష్.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.


ఇది చదవండి: పిన్నిస్ ఉంటే చాలు..? ఎలాంటి బైక్ తాళమైన తుస్సే..? వీళ్లది మాములు టాలెంట్ కాదు..!


ఫైనాన్స్ లో వస్తువు, రుణం తీసుకున్న వారికి సంబంధం లేని వ్యక్తులకు ఫోన్లు చేసి ఫలానా వ్యక్తి మా దగ్గర లోన్ తీసుకున్నాడని.. తిరిగి చెల్లించలేదని మీరు హామీ ఉన్నారుగనుక అతడితో మాట్లాడించండి అంటూ దూషించడం, బెదిరించడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు పచ్చిబూతులు తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించడం, వినకపోతే ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్న బాధితులు తీవ్రంగా కుమిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆన్లైన్ యాప్ ఋణం ఎలా ఇస్తారు..? ఏం చేస్తారు?:

రుణం మంజూరు చేయడానికని సదరు వ్యక్తుల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంటి అడ్రస్, వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ ఎకౌంట్ డిటెయిల్స్ కూడా సేకరిస్తున్నారు. వీటితో పాటు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి తెలియకుండానే అతని మొబైల్లోని పర్సనల్ డేటాని దొంగిలిస్తారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే ఆ తర్వాత రెచ్చిపోతారు. బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ లు పంపిస్తారు. అంతేకాదు ఫోటోలు మార్ఫింగ్ చేసి కాంటాక్ట్ లిస్టులోని వారికి పంపుతారు. అదే మహిళలైతే ముందు మెత్తగా మాట్లాడి ఆ తర్వాత ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలో అవమానభారం, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Crime news, East Godavari Dist

ఉత్తమ కథలు