EAST GODAVARI YELLOW FROGS SEEN IN KONASEEMA DISTRICT AS LOCALS FEARING ABOUT NATURE DISASTERS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
Konaseema: అమ్మో పసుపు కప్పలు.. గోదావరి జిల్లాలలో భయం. భయం..! ప్రకృతి వైపరీత్యాలకి ఇది సంకేతమా..!?
కోనసీమలో పసుపురంగు కప్పలు
కోనసీమ జిల్లా (Konaseema District) లో వింత కప్పలు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో అని ఆందోళన చెందుతున్న కోనసీమ వాసులు. కోనసీమ జిల్లా అమలాపురం (Amalapuram) మండలం బండారులంక గ్రామంలోని మట్టపర్తివారి పాలెం లో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి.
కోనసీమ జిల్లా (Konaseema District) లో వింత కప్పలు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో అని ఆందోళన చెందుతున్న కోనసీమ వాసులు. కోనసీమ జిల్లా అమలాపురం (Amalapuram) మండలం బండారులంక గ్రామంలోని మట్టపర్తివారి పాలెం లో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి. గత మూడు రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపులనీటిలో పసుపురంగు కప్పలు చేరాయి. ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నరు. కోనసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే సమయంలో ఇలాంటివి ఏమైనా వస్తే తుఫానులు కానీ వరదలు కానీ సంభవించే ముందు ప్రకృతి ఇలా హెచ్చరిస్తుంది అని ఇక్కడి ప్రజల నమ్మకం. గతంలోనూ తునిగలు గుంపులు ఆకాశంలో తెరిగితే తుఫానులు వస్తోంది ఇక్కడి ప్రజలు నమ్మకం.అలాగే జరిగిన సందర్భాలు కుడా చాలానే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇలా ఎప్పుడు లేని విధంగా పసుపు రంగులో కప్పలు కనిపించడం కోనసీమ వాసులను ఎలాంటి విపత్తులు వస్తాయో అని బయపెడుతున్నాయి. అయితే ఇవి సాధారణ కప్పలేనని,వీటిని బుల్ ప్రాగ్స్ అంటారన్న పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు. ఖాకీ, ఆలివ్ కలర్లో ఉండే ఈ కప్పలు సడన్ గా ఒక్కోసారి రంగు మారతాయని ఇలా పసుపు రంగులో మారేవి మగ కప్పలేనని ఈమగ కప్పలు బ్రీడింగ్ సీజన్లో ఆడకప్పలను ఆకర్షించడానికి తమ రంగును మార్చుకుంటాయని సీజన్ ముగిసాక అవి మామూలు రంగులోకి వస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.
సాధారణంగా వర్షం పడింది అంటే చాలు మీకు ప్రతి ప్రాంతంలో కప్పలు దర్శనమిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కప్పల కి అటు వర్షానికి అవినాభావ సంబంధం ఉంది అని చెబుతూ ఉంటారు. అందుకే ఒకవేళ వర్షాలు కురవక పోయినా కూడా కప్పలను ఒక కట్టెకు కట్టి ఊరంతా ఊరేగిస్తు పూజించడం లాంటి ఘటనలు కూడా అక్కడక్కడా తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాదు కప్పలు అరిస్తే కూడా వర్షం వస్తుందని ఎంతోమంది నమ్ముతుంటారు. అది సరే గానీ ఇప్పుడు కప్పలు గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.
ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా కప్పల చూసే ఉంటారు. కప్పలు ఆకుపచ్చ కలర్ లో లేదా గోధుమ కలర్ లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వింతైన కప్పలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్థానికులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇంతకీ ఈ వింత కప్ప లు ఏ కలర్ లో ఉన్నాయో తెలుసా ఏకంగా పసుపు రంగు కలర్ లో. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం మండలం లో వెలుగులోకివచ్చింది. బండారులంక గ్రామంలో మట్టపర్తి వారి పాలెం లో అరుదైన పసుపురంగు కప్పులు కనిపించాయి. మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఇక వర్షపునీటిలో పసుపు రంగు కప్పలు వచ్చి చేరాయి.
వింతైన కప్పను చూసి స్థానికులు అందరూ కూడా భయాందోళనలో మునిగిపోతున్నారు అనే చెప్పాలి. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి కప్పలను కూడా లేదని స్థానికులు అంటున్నారు. అయితే కోనసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే సమయంలో తుఫాను సంభవించే ముందు ప్రకృతి ఇలా హెచ్చరిస్తోంది అక్కడి ప్రజలు గట్టి నమ్మకం. గతంలోనూ తూనీగల గుంపు ఆకాశంలో తిరిగితే తుఫానులు వస్తుందని అక్కడ ప్రజలు నమ్మారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా వింతైన కప్పలు కనిపిస్తుండడంతో ఎలాంటి ప్రకృతి సంక్షోభం సంభవిస్తుందో అని అక్కడి ప్రజలందరూ కూడా భయాందోళనలో మునిగిపోతున్నారు. అయితే ఇవి సాధారణ కప్పలేనని వీటిని బుల్ ఫ్రాగ్స్ అంటారని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం.!
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.