Home /News /andhra-pradesh /

EAST GODAVARI YCP MLC ANANTA UDAYA BHASKAR ARRESTED IN HIS DRIVER MURDER CASE IN KAKINADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Breaking: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం..

ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)

ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు( MLC Ananta Babu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (YCP MLC Anantababu)  డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్  చేసినట్లు తెలుస్తోంది.  ఆదివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ (Kakinada) లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు తరలించినట్లు   వార్తలు వస్తున్నాయి. అనంతబాబు అరెస్ట్ పై డీఐజీ పాలరాజు మీడియాకు వివరించే అవకాశముంది. కేసు నుంచి తప్పించుకునేందుకు అనంతబాబు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ (CM YS Jagan) కూడా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించడంతో అనంతబాబు ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం ఆదేశాలతోనే అనంతబాబుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

    హత్య కేసుకు సంబంధించి అనంతబాబు అనుచరులు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్లు ఎమ్మెల్సీ అనుచరులు చెప్పినట్లు  వార్తలు వస్తున్నాయి.  అనుచరులను విచారించే క్రమంలోనే అరెస్ట్ ఆలస్యమైందన్న ప్రచారం జరుగుతోంది.

    ఇది చదవండి: అమ్మఒడిపై కీలక అప్ డేట్.. ఈసారి వచ్చేది రూ.13వేలే.! కారణం ఇదే..!


    ఇదిలా ఉంటే అనంతబాబు అంశంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంపచోడవరం ప్రాంతంలో అనంతబాబు రౌడీయిజం చేస్తున్నారని.. ఆయన చెప్పిందే అక్కడ చట్టమంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అక్కడ ఎమ్మెల్యేగా గెలవాలన్న అనంతబాబు సపోర్ట్ ఉంటే చాలని.. ఆయన చెప్పిన వాళ్లే ఎమ్మెల్యేలైనా, ఇతర ఎన్నికల్లో అయినా గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న అనంత ఉదయభాస్కర్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మీడియా ముందు పెద్దగా కనిపించరు ఎమ్మెల్సీ.. ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తుంటారు.

    ఇది చదవండి: ఏపీలో సంక్షేమ పథకాలకు కొత్త రూల్..,పెన్షన్, రేషన్ కార్డుదారులకు అలర్ట్


    ఇదిలా ఉంటే అనంతబాబు గురించిన రహస్యాలు తెలిసుకున్నందుకే సుబ్రహ్మణ్యంను హత్య చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఐదేళ్లపాటు డ్రైవర్ గా పనిచేసిన యువకుడ్ని దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాయి. కేవలం రూ.20వేలు అప్పు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి హత్య చేసేంత వరకు వెళ్తారన్న అనుమానాలు రేకెత్తాయి. బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పినా.. దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అనంతబాబు చుట్టూ ఉచ్చుబిగిసింది.

    ఇది చదవండి: మారువేషంలో ప్రజల్లోకి మంత్రి, ఎమ్మెల్యే.. పబ్లిక్ రియాక్షన్ ఇదే.. పరువు తీసిన ప్రయోగం..?


    అసలేం జరిగింది..?

    ఈనెల 20న రాత్రి 7.30కి అనంతబాబు అనుచరుడు మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు చనిపోయాడని చెప్పారు. ఆస్పత్రి నుంచి ఇంటికి ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ తీసుకు వచ్చారు. నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే ఉన్నారని తెలిపారు. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ. ఆ తర్వాత 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యకు అక్రమ సంబంధమే ప్రధాన కారణం అయి ఉంటుందనే అనుమానాలు పెరుగుతున్నాయి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kakinada, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు