హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena: జనసేనలోకి వైసీపీ కీలక నేత.. ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్

Janasena: జనసేనలోకి వైసీపీ కీలక నేత.. ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్

జనసేన లోకి వైసీపీ కీలక నేత

జనసేన లోకి వైసీపీ కీలక నేత

Janasena: అధికార పార్టీ నుంచి వలసు మొదలవుతాయా..? ఇప్పటికే కొందరు టీడీపీవైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు కొందరు జనసేనలో చేరే ప్రయత్నాలు చస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఓ కీలక నేత పవన్ కు జై కొట్టినట్టు టాక్.

 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ రచ్చ పీక్ కు చేరుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హీట్ (Elections Heat) కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మాత్రో ఓ రేంజ్ లో ఉంటోంది. అది ఏ స్థాయిలో ఉంది అంటే.. కేబినెట్ భేటీ (Cabinte Meet) లోనే మంత్రుల తీరపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సీరియస్ అయ్యారు.. ప్రతిపక్షాల విమర్శలను సరిగ్గా తిప్పి కొట్టకపోతే.. మంత్రి పదవులపై వేటు వేస్తాను అని హెచ్చరించారు అంటే.. ఏపీలో రాజకీయ వేడి ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజక వర్గాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందులో కోనసీమ జిల్లాలో రాజకీయాలు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ వర్సెస్ ప్రతిపక్ష టీడీపీ ఫైట్ ఉంటే.. కొనసీమలో మాత్రం వైసీపీ వెర్సస్ జనసేన అన్న చందంగా సాగుతున్నాయి.

  అందులోనూ రాజోలు నియోజకవర్గంలో రాజకీయాలు మారింత ఆసక్తి పెంచుతున్నాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని.. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అభ్యర్ధికి విజయాన్ని అందించిన ఏకైక నియోజక వర్గం రాజోలు. కానీ జనసేన పార్టీలో గెలిచి అధికార వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.

  అందుకే స్థానిక ఎమ్మెల్యేపై జానసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వైసీపీ రాపాకకు ప్రాధాన్యం పెరగడంతో.. ఆ పార్టీ నేతలు పక్కదారి పడుతున్నారు. ఇప్పికే కీలక నేతలు కొందరు పక్కా పార్టీల్లోకి చేరగా.. ఇప్పుడు మరో వికెట్ డౌన్ అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.. ఆ నేతకు రాజోలులో మంచి పట్టు ఉందని.. వైసీపికి చెందిన బలమైన కేడర్ అంతా ఆయన వెంటే ఉందనే ప్రచారం ఉంది. ఆయన ఎవరో కాదు.. వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయిన బొంతు రాజేశ్వరావు.. తనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ.. అధికారపార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారని సమాచారం.

  ఇదీ చదవండి : కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు.. అది చంద్రబాబు కుట్రే అంటూ ఆరోపణ

  బొంతు రాజేశ్వరరావు ఈ నెల 15 వ తేదీన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నిజం చేస్తూ.. ఆ ప్రచారం నిజం అనేలా.. అందుకు ఆయన తీరు కూడా కారణం అవుతోంది. ఇటీవల బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు వేడుక్కి.. జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. బొంతు రాజేశ్వరరావు పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేశారు.

  ఇదీ చదవండి: నగరికి దూరమయ్యారా..? ఏపీకి బైబై చెప్పారా..? దివ్యావాణి బీజేపీలో చేరుతారా..? ఆమె ప్లాన్ ఏంటి..?

  ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. గత ఎన్నికల్లో జనసేన చేతిలో ఓడిన బొంతు రాజేశ్వర రావు.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కలిశారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు ఓటమి పాలనయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు.. ఇప్పుడు పవన్ తో భేటీ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఆయన ఈ నెల 15న పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. మరి పవన్ తో భేటీలో ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు