మనిషి పుట్టుక, చావు అనేవి ఎవరి చేతుల్లో ఉండవు. బిడ్డ పుట్టేటప్పుడు తల్లిదండ్రుల ఆనందానికి అంతే ఉండదు. ఈ కాలంలో మగ, ఆడ అనే తేడా కూడా పెద్దగా చూపడం లేదనే చెప్పాలి. అందుకే ఆడపిల్ల పుట్టినా ఒకప్పటిలాగా ఎవ్వరూ భయపడటం లేదు. సమాజంలో అమ్మాయిల కొరత ఏర్పడిందన్న సమాచారంతో ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక పథకాలు పెడుతున్నాయి. అందుకే తల్లిదండ్రులకు వారు భారమనేది పాత మాట.
అయితే కొంత మంది పిల్లల్లో చిన్నప్పటి నుండి అనారోగ్య సమస్యలు వారి జీవితాలతో మాత్రం ఆటలాడుతున్నాయి. యుక్త వయస్సు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండాల్సిన వారికి లోపాలే శాపాలవుతున్నాయి. కొంత మందికి శరీరాకృతిలో తేడాలుంటే, మరికొంత మంది హార్మోన్స్ బ్యాలెన్స్, దీర్ఘకాలిక వ్యాధుల తాకిడి మరింత కుంగదీస్తోంది. ఇలాంటి కోణంలోనే ఓ యువతికి వివాహామైన హార్మోన్స్ ప్రభావం తన జీవితంతో ఆటలాడింది. ఇంతకీ ఆమె ఏం చేసింది.
అనారోగ్యం కారణంగా చనిపోతానని మెస్సేజ్ పెట్టి ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మహిళను ఏలూరులో గుర్తించి పిఠాపురం పోలీసులు కేవలం రెండు గంటల్లోపే ఇంటికి చేర్చారు. పోలీసులు కథనం ప్రకారం పిఠాపురం మండలం కందరాడకు చెందిన 25 సంవత్సరాల వివాహిత తన తల్లిదండ్రులు వద్దే వుంటోంది. ఆమెకు గత ఏడాది మేలోనే వివాహం జరిగింది. అయినప్పటి తల్లిదండ్రుల వద్దే వుంటోంది. కాకినాడలోని తన తండ్రి మెడికల్ షాపులో సహాయం చేస్తూ ఉంది.
ఈ క్రమంలో ఆమె హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఆమె రాలేదు. దీనిపై తల్లిదండ్రులు కంగారు పడి ఆమెను వెతికినా ఫలితం లేదు. ఈలోగా ఆమె తండ్రి సెల్ ఫోన్ నకు మెస్సేజ్ వచ్చింది. తనను హార్మోన్స్. ఇన్ బ్యాలెన్స్ సమస్య ఇబ్బంది పెడుతోందని చనిపోవడానికి వెళ్తున్నానంటూ యువతి పెట్టిన మెసేజ్ తో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆమెకు కాల్ చేసినా స్పందన రాకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే విషయాన్ని బంధువులకు, స్నేహితులకు చెప్పి యువతి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈనేపథ్యంలో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పిఠాపురం రూరల్ పోలీసులు సాంకేతిక సహాయంతో మహిళ హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. పిఠాపురం రూరల్ ఎస్ఐ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఏలూరు సీఐ దుర్గాప్రసాద్ సహాకారంతో ఏలూరు టోల్ ప్లాజా వద్ద బస్సును ఆపి మహిళను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదంతా కేవలం రెండు గంటల్లోపే జరిగిపోయింది. ఈ కేసును అత్యంత చాకచక్యంగా పరిష్కరించిన పిఠాపురం రూరల్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News