P Ramesh, News18, Kakinada
సాగరమాల ప్రాజెక్టు (Coastal Corridor) పేరు చెబితే చాలు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంగా పేరుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పథకానికి సంబంధించి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే అదే పథకంలో తాజా రూ.100 కోట్లతో యాంకరేజి పోర్టుకు మాత్రం శంకుస్థాపన జరిగింది. కాకినాడ (Kakinada) పేరు చెబితే చాలు ఫిషింగ్ హార్బర్, కాకినాడ పోర్టు విశాఖపట్నం (Visakhapatnam) తర్వాత అదే స్థాయిలో పేరున్న నగరం కాకినాడ. ప్రస్తుతం అభివృద్ధి మధ్య అటూ ఇటూ కొట్టాడుతుంది. కాకినాడ కార్పోరేషన్‌కు సంబంధించి అంతా అభివృద్ధి పథమే అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంపైనే దాదాపుగా ఆధారపడింది. స్మార్ట్ సిటీ పేరుతో కొన్ని వందల కోట్లు వచ్చిపడ్డాయి. ఆ తర్వాతే కాకినాడ కళగా మారింది. అయితే వ్యాపారపరంగా పేరున్న కాకినాడకు మాత్రం కాకినాడ పోర్టు చాలా ఆధారం.
కొత్తగా ఇప్పుడు యాంకరేజి పోర్టు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం సాగరమాల ప్రాజెక్టు నుండే వంద కోట్లు కేటాయించినట్లు ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి చెబుతున్నారు. కాకినాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ నగరంలో ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోర్టు అభివృద్ధిని వివరిచారు వక్తలు.
ప్రైవేటుతో పోటీ పడేనా..!
ప్రస్తుతానికి రూ.100 కోట్ల నిధులతో ప్రారంభమయ్యే యాంకరేజి పోర్టు అభివృద్ధి చెందితే, ఈ పోర్టు ప్రైవేటు పోర్టులకు పోటీ ఇస్తుందా అనేది ప్రశ్నార్‌ోకం. మరోపక్క రూ.3 వేల కోట్లతో కొత్తగా కాకినాడలో మరో పోర్టు వస్తుందని కాకినాడ ఎంపీ గీత చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. నిజంగా అనుకున్న సమయానికి మాత్రం ఈపోర్టు పనులు ప్రారంభమైతే కాకినాడ దశ తిరిగిపోతుంది. అయితే సాగరమాల ప్రాజెక్టులో ఇవన్ని ముడిపెడితే మాత్రం సాద్యం ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటి వరకూ సాగరమాల ప్రాజెక్టు సంబంధించి భూసేకర జరగలేదు. అయితే అదే పథకం కింద యాంకరేజి పోర్టు పనులకు మాత్రం శంకుస్థాపన చేశారు.
జెట్టీల ఏర్పాటు, డ్రెజ్జింగ్ నిర్మాణపనులు, రహదారల అభివృద్ధి ఈప్రాజెక్టులో ముఖ్య భాగం. అంచనాల బాగానే ఉన్నా, కాకినాడ సెజలో ప్రారంభమయ్యే పోర్టు నిర్మాణంతో ఇవన్ని ముడిపడి ఉన్నాయి. ఈమొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వమే కీలకం. సాగరమాల ప్రాజెక్టును దారిలో పెడితే తప్పితే ఇవన్ని కేవలం నీటి మూటలే అనేది జగమెరిగిన సత్యం. రానున్న కాలంలో దాదాపుగా ఉమ్మడి తూర్పుగోదావరి అభివృద్ధి కూడా సాగరమాలపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kakinada, Local News