Home /News /andhra-pradesh /

EAST GODAVARI WIFE KILLED HUSBAND AFTER SHE HAVING EXTRAMARITAL AFFAIR IN KONASEEMA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN KKD NJ

East Godavari: ప్రేమగా మజ్జిగ ఇచ్చి భర్తను చంపేసింది.. మూడు నెలల తర్వాత ఊహించని ట్విస్ట్..!

కోనసీమలో భర్తను చంపిన భార్య

కోనసీమలో భర్తను చంపిన భార్య

Shocking: ఏమండి మ‌జ్జిగ తాగండి అంటూ ప్రేమగా ఇచ్చింది.. మజ్జిగ తాగి పడుకున్నాడు. కానీ, తెల్లారేస‌రికి భ‌ర్త మృతి చెందాడు. దీంతో భార్య గుండలవిసేలా విలపించింది. సీన్‌ కట్‌ చేస్తే, మూడునెలల తర్వాత అసలు విషయం తెలిసి అందరూ ఖంగుతిన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Amalapuram, India
    P.Ramesh, News18, Kakinada ఏమండి మ‌జ్జిగ తాగండి అంటూ ప్రేమగా ఇచ్చింది.. మజ్జిగ తాగి పడుకున్నాడు. కానీ, తెల్లారేస‌రికి భ‌ర్త మృతి చెందాడు. దీంతో భార్య గుండలవిసేలా విలపించింది. సీన్‌ కట్‌ చేస్తే, మూడునెలల తర్వాత అసలు విషయం తెలిసి అందరూ ఖంగుతిన్నారు. భార్య భ‌ర్తల అనుబంధ‌మంటే ప‌ది కాలాల‌పాటు సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటారు. కానీ నేటి స‌మాజంలో అందుకు విరుద్దమైన వార్తలు రోజుకొక‌టి బ‌య‌ట‌కొస్తున్నాయి. కొన్నిచోట్ల భ‌ర్తల వేధింపులైతే మ‌రికొన్నిచోట్ల భార్యలు న‌ర‌కం చూపిస్తున్నారు. అక్రమ సంబంధాల ఉచ్చులో పడి బంగారంలాంటి సంసారాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. ఇలాంటి క‌థే ఒకటి డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా (Konaseema District) లో చోటు చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. సంఘ‌ట‌న జ‌రిగిన 3 నెల‌ల త‌ర్వాత ఈ ఘ‌ట‌న‌లో జ‌రిగిన ప‌రిణామాలు చూసి పోలీసులు సైతం షాకయ్యారు. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివ‌రాల ప్రకారం..కోన‌సీమ జిల్లాలోని కె.గంగవరం మండలంలో బాలాంత్రం గ్రామానికి చెందిన కోలా సుబ్బారావు, కాజులూరు మండ‌లం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన స‌త్య వెంక‌ట‌ల‌క్ష్మీల‌కు 2009లో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్దరు సంతానం. వీరి జీవితం అంతా సాఫీగానే సాగిపోతుంది. అయితే ఈ ఏడాది జూన్ 1వ తేదిన స‌త్య వెంక‌ట‌ల‌క్ష్మీ త‌న భ‌ర్తకు నిద్రమాత్రలు క‌లిపిన మ‌జ్జిగ‌ను ఇచ్చింది. ఈ ప్రభావంతో భ‌ర్త నిద్రలోనే చనిపోయాడు. తెల్లవారేస‌రికి త‌న భ‌ర్తకు గుండె పోటు వ‌చ్చింద‌ని న‌మ్మబ‌లికింది. సుబ్బారావు తోబుట్టువులు, బంధువులు నిజమనే అనుకున్నారు. ద‌హ‌న సంస్కారాలు, అంతిమ కార్యక్రమాల‌ను నిర్వహించేశారు.

    ఇది చదవండి: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..?

    ఆ త‌ర్వాత నుండే అస‌లు క‌థ మొద‌లైంది..! భ‌ర్త చ‌నిపోయిన మూడు నెల‌ల‌కే స‌త్యవెంక‌ట‌ల‌క్ష్మీ ప్రవ‌ర్తన‌లో పూర్తిగా మార్పు వ‌చ్చింది. ఓ వ్యక్తితో చ‌నువుగా ఉండ‌టాన్ని ఆమె భ‌ర్త బంధువులు గ‌మ‌నించారు. ఆమె ఇంటికి వచ్చే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన ఉసిరి శ్రీనివాస్‌గా గుర్తించారు. అస‌లు వీరిద్దరికి ప‌రిచ‌యం ఎలా అనేదానిపై కూపీ లాగారు. అప్పుడే కుటుంబ‌స‌భ్యులు ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌కొచ్చాయి. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట లక్ష్మికి గతంలోనే అదే ప్రాంతానికి చెందిన ఉసిరి శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం ఉంద‌ని తేలింది. బాధితులు పోలీసుల‌ను ఆశ్రయించారు. భ‌ర్తకు ఈ విష‌యం తెలిసిపోతుంద‌న్న భ‌యంతో ముందుగానే ప్రణాళిక‌తో మ‌జ్జిగ‌లో నిద్రమాత్రలు క‌లిపి అత‌డిని పక్కాప్రణాళిక‌తో హ‌త్య చేసిన‌ట్లు వెంక‌ట‌ల‌క్ష్మీ పోలీసు విచార‌ణ‌లో నిజాలు బయటపెట్టేసింది. ప్రియుడి మోజులో ప‌డి ప‌చ్చని సంసారాన్ని పొగొట్టుకున్న స‌త్యవెంక‌ట‌ల‌క్ష్మీ ప్లానింగ్‌కు అంతా షాక్ అయ్యారు. భ‌ర్తకు మజ్జిగ‌లో నిద్ర మాత్రలు క‌లిపి ఇచ్చి అత‌డ్ని చంపేయ‌డంతో పాటు, ప్రియుడి స‌హాకారం తీసుకున్నందుకు ఇద్దరిపైనా హ‌త్య కేసు న‌మోదు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Extramarital affairs, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు