హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ugadi 2023: ష‌డ్రుచుల అంత‌రార్థం ఏంటో తెలుసా..! ఉగాది ప్రత్యేకతలివే..!

Ugadi 2023: ష‌డ్రుచుల అంత‌రార్థం ఏంటో తెలుసా..! ఉగాది ప్రత్యేకతలివే..!

X
ఉగాది

ఉగాది షడ్రుచుల ప్రత్యేకత ఇదే

మ‌నిషి జీవితంలో లోటు పాట్లు అంటే సంతోషం, బాధ‌. ప్రేమ ఇలా అన్నిరకాల క‌ల‌యిక జీవితం. అందుకే జీవితం అంటే మ‌హ‌స‌ముద్రంతో పోలుస్తారు. అలాంటి మ‌నిషి జీవితంలో అత్యంత ప‌విత్ర‌మైన పండుగ ఉగాది (Ugadi).

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

P Ramesh, News18, Kakinada

మ‌నిషి జీవితంలో లోటు పాట్లు అంటే సంతోషం, బాధ‌. ప్రేమ ఇలా అన్నిరకాల క‌ల‌యిక జీవితం. అందుకే జీవితం అంటే మ‌హ‌స‌ముద్రంతో పోలుస్తారు. అలాంటి మ‌నిషి జీవితంలో అత్యంత ప‌విత్ర‌మైన పండుగ ఉగాది (Ugadi). యుగాది ఆరంభం కాబ‌ట్టి యుగాదిని క్ర‌మేపి ఉగాది అన్నార‌ని కొంద‌రు, తెలుగు సంవ‌త్స‌ర కాలం ప్రారంభం కాబ‌ట్టి తెలుగు సంవ‌త్స‌రాది ప్రారంభ రోజు అంటార‌ని ఇలా ర‌క ర‌కాలుగా చెబుతుంటారు. మొత్తానికి ఉగాది మాత్రం తెలుగు వారంద‌రూ చేసుకునే ప‌విత్ర పండ‌గ‌. ఉగాది రోజున తెల్ల‌వారు జామున లేచి స్నాన‌మాచ‌రించి అనంత‌రం దేవత‌ల‌కు పూజ‌లు చేశారు. ఉగాది ముందు రోజే అమ్మ‌వార్ల‌కు నైవేద్యాలు పెట్ట‌డం ఆ త‌ర్వాత రోజు వ‌చ్చే ఉగాది రోజున ప‌చ్చ‌డిని నైవ‌ద్యంగా పెట్ట‌డం హిందూ సాంప్ర‌దాయంలో మ‌నం చూస్తుంటాం.

ఉగాది రోజున దేవాల‌యాల‌కు ఎక్కువ‌గా వెళుతుంటారు. ముఖ్యంగా అక్క‌డ జ‌రిగే పంచాంగ శ్ర‌వ‌ణం వినడానికి. అంద‌రి జాత‌కాలు పంచాంగంలో పొందుప‌ర‌చి ఉంటాయి. అందుకే ఏ రాశి వారికి ఏం జ‌రుగుతుంది. ఏకాలంలో ఏం జ‌ర‌గొచ్చు. పేరు బ‌లాలు ఇలా ఓ బ‌ల‌మైన న‌మ్మ‌కంతో పంచాంగాన్ని అనుస‌రించ‌డం పూర్వ కాలం నుండి వ‌స్తుంది.

ఇది చదవండి: అమ్మ కరుణించాలంటే నిప్పుల గుండంలో దిగాల్సిందే..!

ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు ఇలా రోజంతా సంద‌డిగానే ఉంటాయి. కొత్త బ‌ట్ట‌లు వేసుకుని ప్ర‌తీ ఒక్క‌రు ఉగాది రోజున క‌ళ క‌ళ‌లాడుతూ మెరుస్తారు. ఇంటికి వ‌చ్చిన బంధువుల‌కు, స్నేహితుల‌కు ఉగాది పచ్చ‌డి ప్ర‌సాదంగా పెడ‌తారు. ముఖ్యంగా ఉగాది ప‌చ్చ‌డి త‌ప్ప‌నిస‌రిగా ఆర‌గించాల‌నేది చెబుతుంటారు. ముఖ్యంగా అందులో తీపి, పులుపు, చేదు, వ‌గ‌రు, ఉప్పు, కారం ఇలా ఆరు ర‌కాల రుచులు క‌లిపి ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. జీవితంలో ఈ ఆరు రుచులు చూడందే మ‌నిషి న‌డ‌వ‌డిక ఉండ‌ద‌నేది దీని నిగూడ అర్థం.

ముఖ్యంగా ఉగాది పండ‌గ‌లో ఆరు రుచులు సాధార‌ణ‌మైతే, అందులో ప్ర‌ధాన‌మైన‌వి నాలుగు మాత్రం మ‌నిషి నిత్య జీవితంలో ఉంటాయి. అందులో తీపి, పులుపు, కారం, చేదు ఇవి లేకుండా మ‌నిషి ఆహారం తీసుకోవ‌డం అసాధ్యం. అయితే దేవ‌తారాధ‌న చేసిన త‌ర్వాత అక్క‌డ ఉంచిన నైవేద్యం ఉగాడి ప‌చ్చ‌డి తీసుకుంటే మ‌నిషి శ‌రీరంలో కూడా మార్పులు సంభ‌వించి ఆరోగ్య ప‌రంగా మంచిద‌నేది కూడా న‌మ్మ‌కం వ‌స్తోంది.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News, Ugadi 2023

ఉత్తమ కథలు