Viral Video: అద్భుతం అంటే ఇదేనేమో.. నిజంగా బాహుబలి అనే పదానికి అసైలన అర్థం కూడా.. ఎందుకంటే ఈ అరటి గెలను ఒక్కసారి చూడడం అసాధ్యం.. నెమ్మది నెమ్మదిగా పైకి ఎత్తుతూ చూస్తే కాని మొదలు నుంచి చిగురు వరకు కనిపించే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు ఎవరూ ఇంత పెద్ద అరటి గెలను చూసి ఉండే అవకాశం లేదేమో.. సాధారణంగా అరటి గెల అంటే మూడు అడుగులు పెద్దది అయితే ఐదు అడుగులు ఉంటుందేమో.. అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని అరుదైనదని చెబుతారు.. కానీ ఈ అరటి గెల మరింత ప్రత్యేకం. కోనసీమ జిల్లా (Konaseema District) మల్కిపురం మండలం (Malikipuram Mandal) దిండి(Dindi) గ్రామంలో దర్శనమిస్తున్నఈ బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దిండి గ్రామ సర్పంచ్ (Dindi Village President) ముదునూరి శ్రీనివాస్ రాజు (Madunuri Srinivasaraju) పెరట్లో ఓ అరటి గెల చూసిన వారంతా కళ్లు ఆర్పడం లేదు. చూసిన వారంతా ఇలాంటి అరటి గెలను చూడడం ఇదే మొదటి సారి.. అసలు ఇంత పెద్దది ఎలా పెరిగింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా ఆ అరటి గెల దగ్గర ఫోజులు ఇస్తూ సెల్ఫీలు దిగుతున్నారు.. వీడియోలో తీసి సోషల్ మీడియా (Social Media) లో పోస్తు చేస్తున్నారు. ఎందుకు ఇది అంత ప్రత్యేకమో తెలుసా..?
ఏడు అడుగులకుపైగా పొడవున్న ఆ గెలకు 80 హస్తాలు ఉన్నాయి అంటే నమ్మతారా..? అది కూడా 3,000 కాయలు ఉన్నాయి. దీంతో ఈ క్రేజీ అరటి గెలను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. గెల చుట్టూ ఇక్కడా గ్యాప్ లేకుండా అరటి కాయలతో విరగకాసింది. దీంతో ఈ అరటి గెలకు బాహుబలి బనానా అని పేరు పెట్టారు. అరటి గెల భారీగా పెరగటంతో బరువుకు చెట్టు విరగకుండా గెడలు సపోర్ట్‌గా పెట్టారు.
Very Rare Banana || 7 feet hight || 3000 bananas || 80 plus Banana wins ... https://t.co/VDUqfuYyZW via @YouTube #banana #BananaRepublic #Viral #ViralVideo #Konaseema
— nagesh paina (@PainaNagesh) July 20, 2022
కేవలం పొడుగు.. భారీగా కాయలు విషయంలోనే కాదు ఇంకా ఎన్నో పత్యేకతలు ఉన్నాయి దీనికి. ఇది సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకం అరటని.. మలేషియా నుంచి పిలకను ప్రత్యేకంగా తెప్పించినట్లు ముదునూరి శ్రీనివాసరాజు చెబుతున్నారు. అంతే కాదు దీని రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటున్నారు. వీటితో పాటు పలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని బాహుబలి బనానాఅంటున్నారు.
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లోనే ఓ రైతు పొలంలో పండిన అరటి గెల చాలా ప్రత్యేకంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో ఏడు అడుగులు పెరిగిన అరటి గెల అందర్నీ ఆశ్చర్య పరిచింది. యు కొత్తపల్లి గ్రామానికి చెందిన అనాలా సదర్శన్ అనే వ్యక్తి పెరట్లో కాసిన ఈ అమృతపాణి రకపు అరటి గెల.. బాహుబలి అరటి గెలగా గుర్తింపు పొంది.. అందర్నీ ఆకట్టుకుంది.
Rare Banana Tree || ఇలాంటి అరటి గెలను ఎప్పుడైనా చూశారా.. దీని ప్రత్యేకత ... https://t.co/xCKt15nK8L via @YouTube #ViralVideo #Viral #banana
— nagesh paina (@PainaNagesh) July 20, 2022
నిలువెల్లా పొడువుగా నిలబెట్టి ఇద్దరు మనుషులు పట్టుకున్నా మోయలేనంత పెద్దవిగా ఉండేది ఈ అరటి గెల. అయితే ఆ గెలకు 37 హస్తాలు, సుమారు 600 కాయలతో రికార్డు సృష్టించే విధంగా అందర్నీ ఆకట్టుకుంది. సాధారణంగా అయితే అరటి గెల మూడు నుంచి మహా పెద్దది అయితే 5 అడుగులు వరకు ఉంటుందేమో.. కానీ ఇది ఏడు అడుగులు.. 37 హస్తాలు.. 600 కాయలతో రికార్డు క్రియేట్ చేస్తే.. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు చేస్తూ.. 80 హస్తాలు.. 3 వేల కాయలతో బాహుబలి బాబును అంటూ రికార్డు బద్దలు కొట్టింది సింగపూర్ ఆల్మండ్ కర్పూరం రకం అరటి గెల.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Viral Video