P Ramesh, News18, Kakinada
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడనే సామెత చాలా కాలం నుంచి వింటున్నాం.. అంతటి ప్రాధాన్యత కలిగిన అర్చకత్వం అనేది వారికి దేవుడిచ్చిన వరమే. ఎంత గొప్పవారైనా అర్చకుడి ముందు తలవంచాల్సిందే. అక్కడ పలికే మంత్రాలకు, మన కొలిచే దేవుడికి సంబంధం ఉన్నందునే మనకు అర్చకులంటే అంత గౌరవం. అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వంశపార్యంపర అర్చకత్వం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే వేలాది దేవాలయాల్లో (Old Temples) ఈసంస్కృతి కొనసాగుతుంది. వంతుల వారీగా అర్చకత్వం చేయడం జరుగుతుంది. కొద్ది కాలం కిందట వంశపారంపర్య అర్చకత్వం రద్దు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి వచ్చింది.
గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రతిపాదనలపై బ్రాహ్మణ సంఘాలు (Brahmin Assosiations) మండిపడ్డాయి. అక్కడి నుండి ఇది ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం తొలినాళ్లలో ఈ విధానాన్ని తెరపైకి తీసుకురావాలని చూశారు. కానీ వంశపారంపర్య అర్చకత్వానికి మద్ధతునివ్వడంతో ప్రభుత్వం (AP Government) వారికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల పరిధిలోని ఆలయాల్లో వంశపారపర్యంగా పనిచేసే అర్చకులను గుర్తించాలని గతంలో వెళ్లిన ప్రతిపాదనలకు దేవాదాయశాఖ కమిషనర్ స్పందించారు. ఈమేరకు అర్చకుల గుర్తింపునకు ఉత్తర్వులు జారీ కావడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
ఇదీ చదవండి : కన్నీరు పెడుతున్న రైతన్న.. తడిసిపోతున్న అన్నదాత కష్టం
6(b) పరిదిలోకి వచ్చే దేవాలయాల్లో పనిచేసే అర్చకుల దస్త్రాలు తొలుత పరిశీలించి నివేదిక పంపాలని దేవాదాయశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో దేవాదాయ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఉన్న డీసీ కార్యాలయాల్లో ఈమేరకు అర్చకుల దస్త్రాలను పరిశీలిస్తున్నారు. కాకినాడ డిసి కార్యాలయంలో దస్త్రాల పరిశీలన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఇక్కడ 150 అప్లికేషన్స్‌ను పరిశీలించిన అధికారులు అధికారికంగా 45 మంది అర్చకత్వం వంశపారపర్యంగా కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి : తెలుగు మహిళకు మిసెస్ ఆసియా టైటిల్.. తొలి దక్షిణ భారత మహిళగా అరుదైన గుర్తింపు
ఎంతో కాలంగా ఎదురుచూపులు
చాలా దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలు పెట్టడానికి కూడా సొమ్ములు ఉండటం లేదు. ఈప్రభావంతో అక్కడ అర్చకులు వచ్చిన దక్షిణలనే ఆదాయంగా తీసుకుంటున్నారు. ఇలా బతికే అర్చకత్వ కుటుంబాలు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి. పాతకాలం నుండి ఆచార సాంప్రదాయాలతో వస్తున్నారు. కాని రోజులు మారాయి. అంతా ఆన్లైన్ విధానం జీతాల చెల్లింపులకు, ఆలయ ఆదాయాలకు లెక్కలు చెప్పాలి. రాబడి, ఖర్చులలలో తేడాలు రాకుండా ఆడిట్ విధానాన్ని ముందస్తుగా పెట్టి , ప్రీ ఆడిట్‌ను తెరపైకి తెచ్చింది దేవాదాయశాఖ.
ఇదీ చదవండి: వైసీపీ ఎన్నికల నినాదం అదే.. కలిసి వస్తున్న మూడు రాజధానుల నిర్ణయం.. ఎంతశాత ప్రభావం
ఈనేపథ్యంలో అర్చకులకు సంబంధించి వారి వివరాలను కూడా పొందుపరిచారు. ఇక్కడ వంశపార్యంపర్య విధానంలో కూడా తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని దేవాలయాల్లో ఈవిధానం అమలుపట్ల గొడవలు జరుగుతున్నాయి. కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ ఎంతో కాలంగా ఇదే వృత్తిపై ఉన్నవారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గతంలాగే అర్చకత్వం కొనసాగింపు చేస్తూ ఆయా కుటుంబాలకు అండగా నిలవడం పట్ల బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East godavari, Local News