హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

East Godavari: ఆ ఆలయంలో కొబ్బరికాయ కొట్టకూడదు..? ఏం చేస్తారో తెలుసా..?

East Godavari: ఆ ఆలయంలో కొబ్బరికాయ కొట్టకూడదు..? ఏం చేస్తారో తెలుసా..?

గుడిలో

గుడిలో కొబ్బరికాయే కొట్టరు..?

East Godavari: ద‌క్షిణాది రాష్ట్రాల‌లో ఒక‌టైన ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాల‌కు ప్రసిద్ధి తూర్పుగోదావ‌రి జిల్లా అనడం అతిశయోక్తి కాదు. ఈ జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒక‌టైన మ‌రో పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఉంది. స్వయంగా శ్రీపాద శ్రీవ‌ల్లభుల జ‌న్మస్థానంగా పిఠాపురానికి పేరుంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P Ramesh, News18, Kakinada

  East Godavari:  భారత దేశానికి ఆధ్యాత్మిక కేంద్రం (Devotional Center) అని కూడా పేరు ఉంది. ఎన్నో ప్రముఖల పుణ్యక్షేత్రాలు.. చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే.. తూర్పు గోదావ‌రి జిల్లా (East Godavari District) ఆలయాలకు కేరాఫ్ గా నిలుస్తోంది.. ఆ జిల్లాల్లో ఎన్నో దేవలయాలు ఉండగా.. పిఠాపురం (Pithapuram) పుణ్య క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వయంగా శ్రీపాద శ్రీవ‌ల్లభుల జ‌న్మస్థానంగా దీనికి పేరుంది. 

  మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, ఒడిస్సా, క‌ర్ణాట‌క‌కు చెందిన భ‌క్తులు ఇక్కడ‌కు నిత్యం వంద‌లాదిగా వ‌స్తుంటారు. ఇక్కడున్న శ్రీపాద శ్రీవ‌ల్లభ క్షేత్రంలో గ‌డిపి అనుభూతి పొందుతారు. మ‌రీ అలాంటి క్షేత్రంలో ఓ వింతైన సాంప్రదాయం కూడా ఉంది.

  చెట్టుకి కొబ్బరికాయ‌..!

  కొబ్బరి చెట్టు నుండి వ‌చ్చే కొబ్బరి కాయ‌లు తీసుకుని దేవుళ్లకు కొడుతుంటారు. కొంత మంది మొక్కు తీర్చుకున్నాక కొబ్బరికాయుల కొడితే, కొంత మంది మొక్కుకునే సమయంలో కొబ్బరికాయ‌లు కొడ‌తారు. అయితే శ్రీపాద శ్రీవ‌ల్లభ క్షేత్రంలో కొబ్బరికాయ‌లు కొట్టరు. ఇక్కడ ఓ చెట్టుకి క‌డ‌తారు. అదేం చెట్టు అనుకోవ‌ద్దు. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఔదంబ‌రవృక్షం.

  ఇదీ చదవండి : కాకినాడలో జైభీమ్‌ సినిమా సీన్‌ రిపీట్‌..! పోలీసులే చేశారా..?

  చెట్టుకి కొబ్బరికాయ‌లు కట్టి ప్రదిక్షణ‌లు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఒక బ‌లమైన సంక‌ల్పంతో కొబ్బరికాయ క‌డితే ఖ‌చ్చితంగా ఆ కోరిక నెర‌వేరుతుంద‌నేది భ‌క్తుల న‌మ్మకం. ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి వ‌చ్చిన భ‌క్తులు పారాయ‌ణం చేసి మ‌రీ కొబ్బరికాయ‌లు చెబ్టుకి క‌డ‌తారు.

  ఇదీ చదవండి : జగన్ ప్రత్యక్ష దైవం అంటున్న హనీ కుటుంబం.. సీఎం కోటి మంజూరు చేయడంతో వైద్యం ప్రారంభం

  కొంత‌మంది ఉద్యోగాలు రావాల‌ని, మ‌రికొంత‌మందికి పెళ్లిళ్ల కోసం, ఆరోగ్యం బాగుండాల‌ని, సంసారం స‌జావుగా సాగాల‌ని ఇలా వారి వారి కోర్కెల‌ను శ్రీపాద‌వ‌ల్లభుడికి చెప్పుకుని కొబ్బరికాయ చెట్టుకి క‌డితే ఫ‌ల‌వంత‌మై వారి సంకల్పం సిద్ధిస్తుంద‌నేది భ‌క్తులు బాగా న‌మ్ముతారు. వారి కోర్కెలు నిజ‌మైన త‌ర్వాత కూడా మ‌ర‌లా వ‌చ్చి ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవ‌డం భ‌క్తుల‌కు ప‌రిపాటిగా మారింది.

  ఇదీ చదవండి : కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు , బాలయ్య.. అమరావతికి అమ్మవారి అండ..

  ఆల‌యంలోనే అన్ని సౌక‌ర్యాలు..!

  తెలుగు రాష్ట్రాల‌తోపాటు, ఇత‌ర రాష్ట్రాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్ని ఉచితంగానే అందిస్తారు. ప్రస్తుతం దేవాధాయ‌శాఖ‌లో ఉన్న ఈ ఆల‌యానికి ఆస్తులు కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతోపాటు, విరాళాలు సేక‌ర‌ణ బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ ఉచితంగా ఇస్తారు. అయితే ముందుగా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలి. అలాగే వ‌చ్చిన భ‌క్తుల‌కు రెండు పూట్ల భోజన సౌక‌ర్యం క‌ల్పిస్తున్నారు నిర్వాహ‌కులు.

  అడ్రస్‌: వేణుగోపాలస్వామి టెంపుల్‌ స్ట్రీట్, పిఠాపురం, ఆంధ్రపదేశ్‌- 533450

  ఎలా వెళ్లాలి..?

  విశాఖ ప‌ట్నం, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు రైలు, బ‌స్సు సౌక‌ర్యం ఉంది. విమానంలో అయితే రాజ‌మండ్రి ద‌గ్గర మ‌ధుర‌పూడి విమ‌నాశ్రయం వ‌ర‌కూ వ‌చ్చి అక్కడి నుండి బ‌స్సు లేదా, ఇత‌ర వాహ‌నం ద్వారా చేరుకోవ‌చ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే వారికి పిఠాపురంలో హాల్ట్ ఉంది. మ‌రికొన్ని ఎక్స్‌ ప్రెస్‌లకైతే సామ‌ర్లకోట వ‌ర‌కూ వచ్చి అక్కడి నుండి ఆటో, వ్యాన్ ద్వారా పిఠాపురం చేరుకోవ‌చ్చు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Local News

  ఉత్తమ కథలు