P Ramesh, News18, Kakinada
కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి. ఓడలు బళ్లు, బళ్లు ఓడలవుతున్నాయి. అయితే ఇంత మార్పులో కూడా ఎక్కడో ఒక చోట ఓ వింత జరగడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లో జరుగుతున్న ఇటీవల వింతలు, విచిత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. జిల్లాలో రోజుకొక వింత ఏదోక మూల జరుగుతూనే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న కొన్ని వింతలకైతే సమాధానం కూడా దొరకడం లేదు. దేవుడమ్మల పేరుతో ఒక సంస్కృతి నడుస్తుంది. మరోకపక్క చేత బడులు, కాలజ్ఞానం వంటి ఆచారం కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఎవరూ ఉహించని కొన్ని సంఘటనలు చూసి షాక్ తింటున్నారు జనం. ఇలాంటి వింత ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇటీవల కూనవరంలో కుమారస్వామి గుడెం వద్ద ఓ మద్ది చెట్టు నుండి నీరు ఉబికి రావడంతో అక్కడ ప్రజల్ని ఆశ్చర్యపరచింది.
పశువులను మేపేందుకు వెళ్లిన వారు ఓ చెట్టు బెరడును తొలగించడంతో అందులో నుండి నీరు దారాళంగా వచ్చింది. ఆ చెట్టులో కొళాయిపైపు ఏమైనా ఉందా అనేంతలా నీరు రావడంతో, అక్కడే ఉన్న పరిసరవాసులు వింతను చూసేందుకు వెళ్లారు. అలాంటి మద్ది చెట్టను కొన్నింటి బెరడులు తొలగించినప్పటికీ ఎటువంటి నీరు రాలేదు. కేవలం ఒక చెట్టు నుండి నీరు రావడంతో అక్కడ వాసులు ఇదేదో దేవత మహిమలా వారు చెబుతున్నారు. సుమారు గంటపాటు నీరు ఉబికి వచ్చిందని అక్కడి పశువుల కాపరులు చెప్పారు.
సాధారణం చెట్ల నుండి పాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల బెరడుల నుంచి పాలు రావడం సర్వసాధరణం. కొన్ని కల్లుగీత చెట్టు ఉంటాయి. అయితే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా వాటి పెరుగుదలకు నీటిని పీల్చుకుంటాయి. ఈ ప్రభావంతో వాటి నుండి కాయలు కాసి, పండ్లుగా తయారవుతాయి. శాస్త్రీయంగా ఇది సాధారణ ప్రక్రియ. అయితే పాలు కారడం కూడా వీటి పెరుగుదలలో ఒక భాగమనే చెప్పాలి.
అయితే నీరు రావడం అంటే మాత్రం ఆశ్చకర్యంగా ఉందని బయో విశ్లేషకులు చెబుతున్నారు. అయితే చెట్టులో కూడా గ్యాస్ ఫామై, అందులో ఉన్న పాలు పలుచగా రావడం వల్ల వాటినే నీరుగా భ్రమించి ఉంటారని అంటున్నారు మరికొంత మంది నిపుణులు. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న వింతలు మాత్రం శాస్త్రవేత్తలను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.