హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: రేపు కోనసీమలో సీఎం జగన్.. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక..?

CM Jagan: రేపు కోనసీమలో సీఎం జగన్.. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక..?

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్

CM Jagan Konaseema Tour: మొన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు.. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే సీఎం రాకకోసం ముంపు ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శాశ్వత పరిష్కారం ప హామీలు ఇస్తారని ఆశిస్తున్నారు. మరి జగన్ ఏం చెప్పనున్నారు.

ఇంకా చదవండి ...

    CM Jagan Konaseema Tour:  భారీ వర్షాలు (Heavy Rains), వరదలతో గోదారమ్మ(Godavari Floods)ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నదీ (Godavari River) పరివాహక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. వానలు తెరిపిచ్చినా.. వరద తగ్గుముఖం పట్టినా..? ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వరదలతో జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జిల్లాలోని దాదాపు 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నాయి. వదర బాధితులకు అండగా నిత్యం ప్రజాపత్రినిధులు పర్యటిస్తూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు దేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించి రావడంతో అది రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కోనసీమ జిల్లా (Konaseema District)లో  రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బాధిత ప్రాంతాలను పరిశీలించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. పి. గన్నవరం మండలంలోని పలు గ్రామాలతో పాటు, లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

    తాజాగా సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పర్యటనకు తగిన ఏపాట్లు చేస్తున్నారు.  రేపు  కోనసీమ జిల్లాలోనే సీఎం ఉండి.. అన్ని ప్రాంతాలకు వెళ్లి.. స్వయంగా ముంపు బాధితులకు హామీ ఇవ్వునున్నారు. ఇప్పటికే జగన్ పర్యటనతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. 

    ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి అమలాపురం ఆర్డీవో వసంత రాయుడు హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు. కోనసీమ జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. ఆ ప్రాంతాల బాధితులను నేరుగా సీఎం జగన్ పరామర్శించనున్నారు. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో బాధితులకు జగన్ ఏం ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇదీ చదవండి : ఎత్తు మూడు అడుగులే.. కానీ కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంత స్పెషలో తెలుసా..?

    గోదావరి వరద కారణంగా లంక గ్రామాల వాసులు ఇప్పటికే వరద నీటిలోనే వుండిపోయారు. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద నదిపాయ తెగి ఇబ్బందులు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలతో పాటు లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులు సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి హామీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అలాగే శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలి కోరనున్నారు. మరి జగన్ ఎలాంటి హామీ ఇస్తారు అన్నది చూడాలి.

    ఇదీ చదవండి : భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం.. ఎందుకో తెలుసా..?

    వరద బాధితులను పరామర్శించడంతో పాటు జిల్లాలో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జగన్ తన పర్యటనలో భాగంగా అన్నంపల్లి అక్విడెక్ట్‌ ప్రాజెక్టుకు చేరుకుంటారు. వరదలకు ఈ ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని తెలుసుకుంటారని అధికారులు తెలిపారు.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Floods, East godavari

    ఉత్తమ కథలు