హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కాకినాడలో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కలెక్టర్ కీలక సూచనలు.. వివరాలివే..!

కాకినాడలో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కలెక్టర్ కీలక సూచనలు.. వివరాలివే..!

కాకినాడలో ట్రాఫిక్ నియంత్రణపై అధికారుల దృష్టి

కాకినాడలో ట్రాఫిక్ నియంత్రణపై అధికారుల దృష్టి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో కాకినాడ ఒకటి. పోర్టు సిటీల్లో ముఖ్యమైనది కూడా. కేంద్రంగా ఉన్న కాకినాడ నగరం (Kakinada City) లో ట్రాఫిక్ స‌మ‌స్యకు అధికారులు చెక్ పెట్టేందుకు నానా అవ‌స్థలు ప‌డుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P Ramesh, News18, Kakinada

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో కాకినాడ ఒకటి. పోర్టు సిటీల్లో ముఖ్యమైనది కూడా. కేంద్రంగా ఉన్న కాకినాడ నగరం (Kakinada City) లో ట్రాఫిక్ స‌మ‌స్యకు అధికారులు చెక్ పెట్టేందుకు నానా అవ‌స్థలు ప‌డుతున్నారు. ముఖ్యంగా కాకినాడ క‌లెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ర‌వీంధ్రనాథ్‌ బాబు తీసుకున్న నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉంటారా లేక ష‌రా మాములేనా..! కాకినాడ న‌గ‌రం పేరు చెబితే చాలు గంట‌ల కొద్ది ట్రాఫిక్ జామ్‌. సిగ్నల్ పాయింట్లు ఉన్నప్పటికీ వాహ‌న‌ర‌ద్దీ విప‌రీతంగా ఉండ‌టంతో ఉద‌యం, సాయంత్రం చెప్పలేని ట్రాఫిక్ ఇబ్బందులు. పొరపాటున ఒక వాహ‌నం ఆగిందంటే చాలు ఇక వెన‌క వ‌స్తున్న ప్రయాణికులకు న‌ర‌కం. ముఖ్యంగా ఆసుప‌త్రికి వెళ్లేవారు, ఉద్యోగులు, వృద్దులు ఇలా ప్రతీ ఒక్కరూ కాకినాడ ట్రాఫిక్ చ‌క్ర బంధంలో న‌లిగిపోతున్నారు.

  మున్సిపల్ కార్పోరేష‌న్ ‌గా వెలుగుతున్న కాకినాడ‌లో ముఖ్యంగా స‌ర్పవ‌రం ద‌గ్గర నుండి ట్రాఫిక్ జామ్ స‌మ‌స్య త‌గులుతుంది. భానుగుడి సెంట‌ర్, టూటౌన్‌, మెయిన్ రోడ్డు, కోకిలా సెంట‌ర్‌, వైఎస్సాఆర్ వార‌ధి దాటిన త‌ర్వత క‌ల్పనా సెంట‌ర్‌, మ‌ర‌లా మెజిస్ట్రేట్ వీధి, సంత చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తిగా ట్రాఫిక్ కోర‌ల్లో కాకినాడ చిక్కుకుంద‌నే చెప్పాలి.

  ఇది చదవండి: పండగ సీజన్ తో ఛార్జీల మోత మోగిస్తున్న ప్రేవేట్ ట్రావెల్స్..! ఆర్టీసీతో పోలిస్తే డబుల్ రేట్..!

  ప‌ట్టణంలో ఎక్కువ‌గా షాపింగ్ మాల్స్‌, న‌గ‌ల దుకాణాలు, సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు త‌ప్పవు. పాఠ‌శాల‌ల స‌మ‌యాల్లో అయితే ప‌ట్టణంలో ఉన్న పాఠ‌శాల‌కు సైతం రెండు గంట‌లు ముందుగా బ‌య‌లుదేరినా స‌కాలంలో వెళ్లడం క‌ష్టమ‌నే చెప్పాలి.

  ఇది చదవండి: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

  అధికారుల నిర్ణయం ఏంటంటే..!

  ప్రస్తుతం ట్రాఫిక్ చ‌క్రబంధంలో న‌లిగిపోతున్న కాకినాడ ప‌ట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గిపోవ‌డానికి క‌లెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ర‌వీంధ్రనాథ్‌బాబు, కార్పోరేష‌న్ అధికారులు క‌లిసి ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా దుకాణాల ముందు ఇష్టానుసారంగా నిలిపివేసే వాహ‌నాల‌కు చెక్ పెట్టడం, కొత్తగా నిర్మించే వాటితోపాటు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల‌కు అనుసంధానంగా పార్కింగ్ సెల్లార్లు ఏర్పాటు చేసే విధంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.

  సిగ్నల్ వ్యవ‌స్థ లోపాలు స‌రిదిద్దడం, దుకాణాల వ‌ద్ద ర్యాంపుల ఏర్పాటు, సీసీ కెమెరాల వ్యవ‌స్థ పునఃవ్యవ‌స్థీక‌ర‌ణతోపాటు, ఇరుకురోడ్లకు సంబంధించి ముందుకు వ‌చ్చి క‌డ‌తున్న క‌ట్టడాల అనుమ‌తి వంటి ప‌లు నిర్ణయాల‌ను తీసుకున్నారు. వీటిని వీలైనంత త్వర‌గా అమ‌లు చేయాల‌ని క‌లెక్టర్ సూచించారు. ప్రస్తుతం అధికారులు తీసుకున్న నిర్ణయాలు ట్రాఫిక్ స‌మ‌స్యను తొల‌గించే అవ‌కాశాలు ఉన్నప్పటికీ అవి అమ‌ల‌య్యే విధానంలో మాత్రం చాలా లోపాలున్నాయ‌ని ప‌లువ‌రు ప‌ట్టణ‌వాసులు అంటున్నారు. ముఖ్యంగా రోడ్లపైకి వ‌చ్చిన క‌ట్టడాల తొల‌గింపు విధానంలో మాత్రం రాజ‌కీయ నేత‌ల పెత్తనం ఉంటే ట్రాఫిక్ స‌మ‌స్య ష‌రా మాములే అని పెద‌వి విరుస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Local News

  ఉత్తమ కథలు