హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఊరంతా జాతర సందడిలో ఉంది..! ఒక్కసారిగా యువకుడి కేకలు.. వెళ్లి చూసేసరికి..!

ఊరంతా జాతర సందడిలో ఉంది..! ఒక్కసారిగా యువకుడి కేకలు.. వెళ్లి చూసేసరికి..!

జాతరలో యువకుడిపై దాడి

జాతరలో యువకుడిపై దాడి

Kakinada: ఆ ఊళ్లో మేళ తాళాల న‌డుమ జాత‌ర వెలిగిపోతుంది. స‌రిగా స‌మ‌యం రాత్రి 12 కావోస్తోంది. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా జాత‌ర‌లో పెద్ద పెద్ద కేక‌లు, చంపేసారు బాబోయ్ అంటూ ఓ యువ‌కుడి అరుపులతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.

 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P. Ramesh, News18, Kakinada

  అమ్మవారి శ‌ర‌న్నవ‌రాత్రి మ‌హోత్సవాలు ఒక‌ప‌క్క, అదే స‌మ‌యంలో అక్కడి గ్రామ దేవ‌త‌గా కొలిచే పైడిత‌ల్లి అమ్మవారి జాత‌ర మ‌రోప‌క్క. అంద‌రూ సంద‌డిలో మునిగితేలిపోతున్నారు. పసుపు, కుంకుమ‌ల‌తో అమ్మవారికి హార‌తులు ప‌ట్టేస్తున్నారు. మేళ తాళాల న‌డుమ జాత‌ర వెలిగిపోతుంది. స‌రిగా స‌మ‌యం రాత్రి 12 కావోస్తోంది. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా జాత‌ర‌లో పెద్ద పెద్ద కేక‌లు, చంపేసారు బాబోయ్ అంటూ ఓ యువ‌కుడి అరుపులతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. సీన్ క‌ట్ చేస్తే పొట్టలో దిగిపోయిన క‌త్తిగాట్లు, ర‌క్తపు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న యువ‌కుడు జాతరలో ఉన్న జనాలకు క‌నిపించాడు. వెంట‌నే అత‌డ్ని స్థానికులు కాకినాడ (Kakinada) ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ సంఘ‌ట‌న కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది.

  మంగాయ‌మ్మరావు పేట‌కు సంబంధించి జ‌రిగిన పైడిత‌ల్లి అమ్మవారి జాత‌ర‌కు వ‌చ్చిన యువ‌కులు ఘర్షణ పడ్డారు. ఇందులో పిఠాపురం ర‌థాల‌పేట‌కు చెందిన స‌న్ని అనే యువ‌కుడిని కొంత మంది క‌త్తుల‌తో పొడిచారు. అత‌డికి తీవ్ర ర‌క్తపు గాయాలు కావ‌డంతో స్పందించిన జాత‌ర‌లోని వారు అంబులెన్స్ ద్వారా కాకినాడ ప్రభుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి మరిన్ని వివరాలు సేకరించారు.

  ఇది చదవండి: వీళ్లు మారరు..! ఎన్ని ఫైన్‌లు వేసినా వీళ్లు ఇంతే..! కళ్లు కనిపించడం లేదా..?

  ఈ దాడి ఘటన‌పై న‌వీన్‌కుమార్‌, అజ్జు, రాజుయాద‌వ్ అనే ముగ్గురు యువ‌కుల‌పై హ‌త్యాయ‌త్నం (IPC 307) కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ర్షణ‌లో పాల్గొన్న మ‌రి కొంత మంది పేర్లను క్షత‌గాత్రుడు సన్ని ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేస్తున్నారు. క‌త్తిపోట్లకు గురైన స‌న్నీకి ఆప‌రేష‌న్ చేయ‌డంతో ప్రస్తుతం అత‌డు కాకినాడ ప్రభుత్వ ఆసుప్రతిలో ఐసీయూలో ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

  చెల‌రేగిపోతున్న యువ‌కులు

  యువ‌కులు చెడు అల‌వాట్లకు బానిస‌ల‌వుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఠాలుగా త‌యారై రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారు. త‌ల్లిదండ్రుల‌ను సైతం ఎదిరించే స్థాయికి చేరుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఈ త‌ర‌హా యువ‌కులు ముఠాలుగా త‌యారై నేర ప్రవృత్తికి పాల్పడుతున్నారు. ఎక్కువ‌గా పిఠాపురం, కాకినాడ‌, సామ‌ర్లకోట‌, క‌త్తిపూడి ప్రాంతాల్లో ఈ త‌ర‌హా ముఠాలు పెరిగి ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News