హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

East Godavari: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

East Godavari: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

పర్యాటకులను

పర్యాటకులను కట్టిపడేస్తున్న గోదావరి అందాలు

గోదావ‌రి (Godavari) పేరు చెబితే చాలు ట‌క్కున గుర్తొచ్చేది పచ్చని కోక కట్టుకున్న కోన‌సీమ (Konaseema), కొబ్బరి తోటలు, పచ్చని పైరు, గోదారి పుల‌స‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ప్రత్యేకతలుంటాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P.Ramesh, News18, Kakinada

  గోదావ‌రి (Godavari) పేరు చెబితే చాలు ట‌క్కున గుర్తొచ్చేది పచ్చని కోక కట్టుకున్న కోన‌సీమ (Konaseema), కొబ్బరి తోటలు, పచ్చని పైరు, గోదారి పుల‌స‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ప్రత్యేకతలుంటాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న గోదారి ఒడ్డు నుంచి అలా వెళుతూ కోన‌సీమ అందాలనును వీక్షిస్తే ఆ ఆనంద‌ం వర్ణనాతీతం. అలాంటి న‌ది ప‌క్కన నిల‌బడి ఫోటోలు దిగుతూ, సంద‌డి చేస్తుంటే ఆ ఫీలింగ్‌ వేరేలేవల్‌లో ఉంటుంది. నిత్యం గోదారి ఒడ్డున ఎక్కువ‌గా గోదారి తీర వాసులు, ప‌రిస‌ర ప్రాంతాల ప‌ర్యాట‌కలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. ఇటీవ‌ల గోదారమ్మ పరవళ్లు చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు గోదావరికి చేరుకుంటున్నారు. గ‌త రెండు వారాలుగా సాయంత్రం అయితే చాలు ప‌ర్యాట‌కుల‌తో గోదావ‌రి పుల‌కించిపోతుంది.

  ద‌వ‌ళేశ్వరం బ్యారేజ్ (Dhawaleswaram Barrage)‌ వ‌ద్ద నిల్చుని ఫోటోలు తీసుకోవ‌డం, సెల్ఫీల స‌ర‌దా, స్నేహితుల‌తో ముచ్చట్లు, ఇక ప్రేమికులైతే చ‌ల్లగాలికి అలా ఊహాల లోకంలో తేలిపోవ‌డం లాంటి దృశ్యాలు క‌నిపిస్తుంటాయి. బ్యారేజ్ వద్ద యువ‌త సంద‌డి అంతాఇంతా కాదు. ముఖ్యంగా గోదావ‌రి ప‌ర‌వ‌ళ్లు క‌నిపించేలా వీడియోల‌ను తీసుకుని సోషల్‌ మీడియలో పోస్ట్ చేసుకుంటున్నారు.

  ఇది చదవండి: విశాఖలో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌కు యమ క్రేజ్‌...! తినేందుకు క్యూ కడుతున్న నగరవాసులు..!

  గోదావ‌రి ఒడ్డు ప‌క్కన ముఖ్యంగా పుష్కర‌ఘాట్ పార్కు, మ‌రోక‌టి ద‌వ‌ళేశ్వరం బ్యారేజి ద‌గ్గర ఉన్న పార్కు. ఈ పార్కులు ఎంతో ఆహ్లాద‌కరంగా ఉంటాయి. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు స‌ర‌ద‌గా చ‌ల్లని గాలి పీలుస్తూ గోదావ‌రి న‌ది ప్రవాహం చూస్తు పార్కులు న‌డుస్తుంటారు. కొంత మంది త‌మ స్నేహితులతో ఇక్కడే బ‌ర్త్‌డే పార్టీలు చేసుకుంటుంటారు.

  ఇది చదవండి: ఈ కోటను చూస్తే మైమరచిపోవాల్సిందే...! అంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైందంటే..!

  పార్కుకు వచ్చే వాళ్ల కోసం కావల్సినన్ని తినుబండారాలు అక్కడ దొరుకుతాయి. ఇటీవల పర్యాటకుల సంఖ్య పెరగటంతో చిరుతిన్న వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగింది. ఐస్‌క్రిమ్‌, జొన్నపోత్తులు, మసాలా, డ్రింక్స్‌.. ఇలా ఎన్నో రకాల వెరైటీ స్ట్రీట్‌ ఫుడ్‌లను ఎంజాయ్‌ చేయోచ్చు.

  ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

  స‌ర‌ద‌గా ప‌డ‌వ ప్రయాణం..

  ఇక్కడ ప‌డ‌వ ప్రయాణం చేసే వెసులుబాటు కూడా ఉంది. ఇక్కడే అనుభ‌వ‌జ్ఞులైన డ్రైవ‌ర్లతో బోటు షీకారు ఉంటుంది. టిక్కెట్టు ధర రూ.100 నుండి రూ.150, రూ.200 వ‌ర‌కూ ఉంటుంది. బోటు ర‌కాన్ని బ‌ట్టి ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది. గోదావ‌రిలో ఇటు ఒడ్డు నుండి అటు ఒడ్డుకు తీసుకెళ్లి తీసుకొస్తారు. ఇంజ‌న్ బోట్లు, చిన్నపాటి మెరైన్ బోట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

  నోరూరించే చేపలెన్నో..!

  ఇక్కడ మాంస ప్రియుల‌కు నోరూరించే చేపలు దొరుకుతాయి. నచ్చిన చేపలు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు దొరుకుతాయి. అన్ని ర‌కాల చేప‌ల‌ను ఇక్కడ విక్రయిస్తారు. కాస్త వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌డితే మత్య్సకారుల వలలో ఎక్కువగా చేప‌లు ప‌డుతుంటాయి. వాటిని వెంటనే అక్కడే పర్యాటకులకు అమ్ముతారు. ముక్కలుగా చేసి ఇచ్చేందుకు రూ.50 నుండి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. పుల‌స కావాలంటే మాత్రం కాస్త ఎక్కువ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News

  ఉత్తమ కథలు