P Ramesh, News18, Kakinada
భారతదేశం (India) ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. చరిత్రకు సాక్ష్యాలుగా చెప్పాలంటే భారతదేశం ప్రధానమనే చెప్పాలి. ఇక ఇక్కడ ఉన్న హిందూ దేవాలయాలు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించవు. అందుకే భారత దేశాన్ని హిందూ సాంప్రదాయ దేశంగా చెబుతారు. కోట్లాది దేవతల విగ్రహాలు ఇక్కడే కనిపిస్తుంటాయి. సుల్తానులు, ఆ తర్వాత రాజులు ఇలా కాలక్రమేణా ఆలయాల్లో కూడా మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు పంచమాధవ క్షేత్రాలలో బిందు మాధవ స్వామి (కాశీ), వేణు మాధవ స్వామి (ప్రయాగ), సేతు మాధవ స్వామి (రామేశ్వరం), సుందర మాధవ స్వామి (కేరళ), కుంతీ మాధవ స్వామి (పిఠాపురం)లో కొలువై ఉన్నాయి. ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన ఈ క్షేత్రంలో కుంతీదేవి స్వామిని పూజించడంతో ఆమె పేరున కుంతీమాధవుడిగా నామకరణం జరిగిందనేది చరిత్ర చెబుతోంది.
తూర్పు చాళుక్యుల నాటి ఆలయంగా చెప్పే ఈ క్షేత్రం సుల్తానుల కాలంలో దాడికి గురైందని, ఆ తర్వాత పిఠాపురం మహారాజా వారు ఆలయాన్ని పునరుద్దరించినట్లు చెబుతున్నారు. ప్రతీయేటా ఇక్కడ మాఘ పౌర్ణమినాడు ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే కొన్ని దివ్య క్షేత్రాలు కాలంతో పాటు మరుగున పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భక్తులు దీనిపై మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఇలాంటి క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురంలోని కుంతీమాధవ క్షేత్రం చాలా గొప్పదనే చెప్పాలి.
దేశ వ్యాప్తంగా 5 మాధవ క్షేత్రాలలో ఒకటి ఇక్కడ పిఠాపురంలో కొలువై ఉంది. కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో నేటికి ఆలయంలో పూజాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చరిత్రకారులు మాట ప్రకారం తూర్పుచాళుక్యుల కాలం నాటి ఈక్షేత్రం అతిపురాతనమైనదిగా పురావస్తుశాఖ గుర్తించింది. అన్ని బాగానే ఉన్నా ఈక్షేత్రం విశిష్టత కాపాడటంలో అంతా నిర్లక్ష్యంగా ఉన్నారనే చెప్పాలి.
ఈక్షేత్రానికి అనుసంధానమైన మాధవుని చెరువు అపరిశుభ్రతగా మారింది. ఒకప్పుడు ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించేవారు. కానీ నీటి శుభ్రత లేకపోవడం, చెరువుకి రక్షణ గోడలేకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. కాకినాడ-పిఠాపురం మెయిన్‌రోడ్డుకు అనుకుని ఉండే ఈ చెరువు ను పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న మండపంలో ఏడాదికి ఒకసారి పూజలు చేస్తారు. ఆతర్వాత మరలా ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడరు. ఇలా కాలం మారిపోతున్నా చెరువు అభివృద్ది లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఈచెరువు ఆధునికీకరణకు రూ.50 లక్షలు వెచ్చించారు. కాని అమలు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో అసలు ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Hindu Temples, Kakinada, Local News