P Ramesh, News18, Kakinada
సాధారణంగా గేదెలు రోజుకి 5 నుండి 7 లేక, 8 లీటర్ల వరకూ పాలిస్తుంటాయి. కొన్ని మేలురకమైన గేదెలైతే 10 లీటర్ల వరకూ కూడా పాలివ్వడం మనం చూస్తుంటాం. అయితే కోనసీమ జిల్లా (Konaseema District) మండపేటకు చెందిన ఓ గేదె ఎన్ని లీటర్ల పాలు ఇస్తోందో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇదిగో మీరు చూస్తున్న నిఘ నిఘ లాడే గేదె ఏకంగా రోజుకి 26.59 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ గేదె రాష్ట్రస్థాయిలో పాలను ఉత్పత్తి చేసే గేదెల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మండపేటకు చెందిన సత్యనారాయణ అనే రైతు 8 ఏళ్ల క్రితం తెలంగాణాలో నిజామాబాద్ నుండి ఈ గెదేను కొనుగోలు చేశాడు. అప్పటి నుండి దాని దాణా ఖర్చు కింద రోజుకి 500 రూపాయాలు ఖర్చు చేస్తున్నాడట. మొత్తం మీద ప్రథమ స్థాయిలో ఈ గేదెను చూసేందుకు పరిసర ప్రాంతాల పాడి రైతులు క్యూ కడుతున్నారు.
ఆ గేద వయసు నాలుగేళ్లు పాలు దిగుబడి లో తన తల్లిని మించిపోయింది రోజుకు 26.59 లీటర్ల పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది. ఆ గేదె తల్లి రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాలు దిగిబడి పోటీలో రెండు సార్లు మొదటి స్థానం నిలిచింది.తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోని తల్లిని మించి రికార్డు స్థాయిలో రోజుకు 26.59 లీటర్ల పాలు దిగుబడి నమోదు చేసింది ఈ విషయాన్ని కేంద్రీయ పశువు నమోదు పథకం ప్రతినిధి రాజేశ్వరరావు నిర్ధారించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ మీరు జాతి పశు పోషణ చేస్తున్నారు. 8 ఏళ్ల క్రిందిట ఆయన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు.
ఆ గేదె గతంలో విజయవాడ మండపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు ఇప్పటివరకు ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా నాలుగు దున్నపోతులు రెండు పేయ్య దూడలు పుట్టాయని పాడి రైతు సత్యనారాయణ తెలిపారు. దున్నపోతులు రెండింటిని సేమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకెళ్లగా మరో రెండు తమ వద్ద ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలు దిగుబడి ఇస్తున్న పేయ్య ఆ రోజుల్లో పుట్టిందని వివరించారు .వీటికి దానగా రోజుకు 500 రూపాయలు ఖర్చుతో పశుగ్రాసం, మొక్కజొన్న ఉలవలు, తవుడు అందిస్తున్నామని చెబుతున్నారు పాడి రైతు.
అధికారికంగా పాలు దిగుబడి లెక్కింపు ప్రస్తుతం కేంద్రీయ పశువు నమోదు పథకం కింద మండపేట పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాలు దిగబడి ఇచ్చే పాడి పశువుల గుర్తింపు ప్రక్రియ జరుగుతుంది. కేంద్రీయ పశు నమోదు పథకం డి రాజేశ్వరరావు పశువుల వద్దకు వెళ్లి మేలు జాతి పాడి గేదెల పాల దిగుబడిని లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా సత్యనారాయణకు చెందిన గేదె ఒకరోజు 26.59 లీటర్ల పాల దిగుబడి ఇచ్చిందని రాజేశ్వరరావు తెలిపారు. రెండో ఈతలోనే ఈ స్థాయిలో దిగిబడి వస్తే ముందు ముందు మరింత పెరుగుతుందని అత్యధిక దిగుబడి నిచ్చే పాడి పశువుల వివరాలను సెమన్ సేకరణ కేంద్రాలకు పంపుతామని వీటి ద్వారా మేలు జాతి పాడి పశువులు పునరుత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజేశ్వరరావు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Buffalo, East Godavari Dist, Local News