Home /News /andhra-pradesh /

EAST GODAVARI THAT IS THE CM JAGAN HUMANITY ONCE AGAIN HE STOPS HIS CONVEY AND HELP POOR WOMEN NGS GNT

AP CM Jagan: సీఎం ఔదార్యం.. జనం మధ్య నుంచి మహిళ అరుపులు.. వెంటనే స్పందించి త‌ల్లి స‌మ‌స్యకు ప‌రిష్కారం

సీఎం జగన్ మానవత్వం

సీఎం జగన్ మానవత్వం

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు.. కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో జనం మధ్య నుంచి ఓ మహిళ అరుపులు వినింపించాయి.. దీంతో స్వయంగా అక్కడికి వెళ్లి.. ఆ తల్లి సమస్య తెలుసుకొని.. వెంటనే పరిష్కారం చూపించారు.. ఇంతకీ ఏమైంది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. తాజాగా కాకినాడ జిల్లా (kakinada district) లోని తుని (Tuni)లో తన పర్యటన సందర్భంగా.. మరోసారి తన మంచిమనుసును చాటుకున్నారు. తాను కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో.. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లి ఆవేదన అయనను కదిలించింది. సాధారణంగా సీఎం లేదా మంత్రులు అలా కాన్వాయ్ లో వెళ్తుంటే జనాలు గుమి గూడి ఉంటే అరుపులు సహజం... వాటిని పెద్దగా పట్టించుకోకుండా వారంతా తమ కాన్వాయ్ లో వెళ్లి పోతుంటారు. కానీ జనం మధ్య నుంచి ఆ తల్లి జగన్ అన్నా జగన్ అన్నా అని ఆరుస్తూ ఉంటే..? ఆమె ఆక్రందనను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు జగన్. ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఆమె కష్టం విని తీవ్రంగా చలించిపోయారు. బిడ్డకు ఉన్న ఆరోగ్య సమస్య.. తమ ఆర్థిక పరిస్థితిని సీఎం కు ఆమె మొరపెట్టుకున్నారు. వెంటనే ఉన్నఫలంగా ఆ చిన్నోడికి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

    ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే బిడ్డకు వైద్యం చేయించేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు.. అయితే వేల మంది జనంలో ఆమెకు ముందుకు వెళ్లే అవకాశం కుదరలేదు.



    కానీ ఎలాగైనా తన సమస్యను సీఎం జగన్ కు చెప్పుకోవాలని సంకల్పించింది. ఆయన కచ్చితంగా సాయం చేస్తారనే నమ్మకంతో.. సీఎం కాన్వాయ్ వస్తున్న సమయంలో.. తన బిడ్డను ఎత్తి చూపిస్తూ గట్టిగా ఏడుస్తూ కేకలు వేసింది. అనుకోకుండా సీఎం జగన్ చూపు అటువైపు పడింది. వెంటనే కాన్వాయ్ ఆపారు. సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి ఆ మహిళను దగ్గరకు రమ్మని ఆహ్వానించారు.

    ఇదీ చదవండి : హైకోర్టు తరలింపు ప్రతిపాదనలు లేవా? కేంద్రం కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పిందంటే?

    నేరుగా తనూజను తన వద్దకు పిలిపించుకుని.. సమస్య అడిగి తెలుసుకున్నారు. తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని వివరించి ఆదుకోవాలని తనూజ కోరడంతో ఆయన వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్‌ను.. పూర్తి సమస్యను స్టడీ చేయాలి అని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆ మహిళ ఆవేదన అర్థం చేసుకున్న సీఎం.. అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో దటీజ్ సీఎం జగన్ అని కామెంట్స్ పెడుతున్నారు వైసీపీ అభిమానులు.

    ఇదీ చదవండి :మిస్ సౌత్ ఇండియాగా అంధ్రా అమ్మాయి.. ఛరిష్మా కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఇదే

    అయితే ఇలా జనం కోసం ఆయన కాన్వాయ్ ను ఆపడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఉన్నాయి. మరోవైపు తాను కాన్వాయ్ తో ఎక్కడికి వెళ్తున్నా.. మధ్యలో అంబులెన్స్ కనిపిస్తే.. వెంటనే తన కాన్వాయ్ ను ఆపీ.. అంబులెన్స్ కు దారిచ్చిన సందర్భాలు కూడా ఎన్నో చూశాం..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు