హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kakinada: కాకినాడలో జైభీమ్‌ సినిమా సీన్‌ రిపీట్‌..! పోలీసులే చేశారా..?

Kakinada: కాకినాడలో జైభీమ్‌ సినిమా సీన్‌ రిపీట్‌..! పోలీసులే చేశారా..?

కాకినాడ

కాకినాడ జిల్లాలో లాకప్ డెత్ కలకలం

కాకినాడ జిల్లా (Kakinada District) చేబ్రోలులో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. రిమాండ్‌లో ఉన్న క‌ల్లుగీత కార్మికుడు బొంతు వెంక‌ట‌ర‌మ‌ణ‌ మృతికి పిఠాపురం సిఐ వైఆర్.‌కే శ్రీనివాస్ కొట్టిన దెబ్బలే కార‌ణ‌మంటూ బీసీ సంఘాలు చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్తత‌కు దారి తీసింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P Ramesh, News18, Kakinada

  కాకినాడ జిల్లా (Kakinada District) చేబ్రోలులో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. రిమాండ్‌లో ఉన్న క‌ల్లుగీత కార్మికుడు బొంతు వెంక‌ట‌ర‌మ‌ణ‌ మృతికి పిఠాపురం సిఐ వైఆర్.‌కే శ్రీనివాస్ కొట్టిన దెబ్బలే కార‌ణ‌మంటూ బీసీ సంఘాలు చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్తత‌కు దారి తీసింది. చేబ్రోలులో రెండు రోజుల పాటు సాగిన ఆందోళ‌న వివాదాస్పదమైంది. నిర‌న‌స‌నకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. కాకినాడ జిల్లా అడిష‌న‌ల్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, ప‌లువురు సిఐలు ఆందోళ‌న కారుల‌కు న‌చ్చజెప్పారు. ఈ స‌మ‌యంలో పోలీసులు ఆందోళ‌న చేస్తున్న బీసీ నాయకుల‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు త‌మ‌ను విచ‌క్షణ ర‌హితంగా కొట్టార‌ని వారు ఆరోపించారు. ఈ స‌మ‌యంలో అక్కడ జ‌రిగిన తోపులాట‌లో ప‌లువురు కింద ప‌డిపోయి కొంత మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని ప్రయ‌త్నించిన పోలీసులు విఫ‌ల‌మ‌య్యారు.

  త‌మ నాయ‌కుడు పెద్దింటి వెంట‌కేశ్వర‌రావును పోలీసులు వ‌దిలితేనే తాము ఆసుప‌త్రికి వెళ‌తామ‌ని బాధితులు డిమాండ్ చేశారు. కోపోద్రేకులైన నిర‌స‌న కారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు త‌మ‌ను చంపేస్తున్నార‌ని, బీసీల‌ను అణ‌గ‌దొక్కేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ సంఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లి బాధితుల‌కు మ‌ద్దతు తెలిపారు.

  ఇది చదవండి: దసరా వస్తే చాలు అందరి చూపు అటువైపే.. తలలు పగిలి రక్తం కారాల్సిందే..!

  అస‌లేం జ‌రిగిందంటే..!

  బొంతు ర‌మ‌ణ అనే వ్యక్తిపై గ‌తంలో ఉన్న కేసుల‌ను, కొత్తగా పెట్టిన కేసుల‌ను ఆధారంగా చేసుకుని పీడీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. గ‌త మూడు నెల‌ల కింద‌ట అత‌డిని అరెస్టు చేశారు. ఆ స‌మ‌యంలో కొంత మంది పోలీసులు చేబ్రోలులోని ర‌మ‌ణ ఇంటికి వ‌చ్చి అరెస్టు చేసి తీసుకెళ్లిన‌ట్లు ర‌మ‌ణ భార్య వీర‌మ‌ణి చెబుతోంది.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  అయితే అరెస్టు చేసిన త‌ర్వాత కొద్దిరోజులు గొల్లప్రోలు, పిఠాపురం రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌కు తిప్పి విప‌రీత‌మైన దెబ్బలు కొట్టి ర‌మ‌ణను చిత్రహింస‌ల‌కు గురి చేసార‌ని బాధితురాలు ఆరోపిస్తోంది. వెంట‌నే తాను, త‌న పిల్లలతో క‌లిసి కొంత మందిని వెంట పెట్టుకుని వెళ్లేస‌రికి అక్కడ బొంతు ర‌మ‌ణ పోలీసుల ఆధీనంలో ఉన్నాడ‌ని, అయితే త‌మ వ‌ద్ద లేడ‌ని చెప్పిన పోలీసులు రెండు రోజుల త‌ర్వాత జైలుకు త‌ర‌లించార‌ని ఆరోపిస్తోంది.

  పోలీసులు త‌మ స‌మ‌క్షంలో ఉన్నప్పుడు కొట్టిన దెబ్బల వ‌ల్ల అతని కీడ్నీలు పాడ‌య్యాయ‌ని , అప్పటి నుండి త‌న భ‌ర్త ఆరోగ్యం పాడై జైలు నుండి ఆసుప‌త్రికి వ‌చ్చి శ‌వ‌మైయ్యాడ‌ని బోరున విల‌పిస్తోంది. త‌న భ‌ర్తను పోలీసులే హ‌త్య చేసార‌ని ఆరోపిస్తుంది మృతుడి వెంక‌ట‌ర‌మ‌ణ కుటుంబం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Local News

  ఉత్తమ కథలు