హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ భూముల రీసర్వేలో అవినీతి మాయ.. కొలతల మాటన చేతివాటం.. అసలు స్టోరీ ఇదే..!

ఏపీ భూముల రీసర్వేలో అవినీతి మాయ.. కొలతల మాటన చేతివాటం.. అసలు స్టోరీ ఇదే..!

భూముల రీ సర్వేతో అవినీతి

భూముల రీ సర్వేతో అవినీతి

నాడు-నేడు పేరుతో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. అలాగే సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వందేళ్ల భూముల రికార్డులను తిరగరాస్తున్నారు. అయితే అలాంటి ప‌థ‌కాల్లో కొన్నింటిలో చెప్పలేని అవినీతి బ‌య‌ట‌ప‌డుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P Ramesh, News18, Kakinada

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలో చాలా పథకాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల సంగతి కాసేపు పక్కనబెడితే. నాడు-నేడు పేరుతో అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. అలాగే సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వందేళ్ల భూముల రికార్డులను తిరగరాస్తున్నారు. అయితే అలాంటి ప‌థ‌కాల్లో కొన్నింటిలో చెప్పలేని అవినీతి బ‌య‌ట‌ప‌డుతోంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో సెట్టి నూకరాజు అనే రైతుకు చెందిన 10 ఎకరాల 4 సెంట్ల పొలానికి చెంది సర్వే చేసే విషయమై రూ 10 వేలు డిమాండు చేసి రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు విలేజ్ సర్వేయర్ నాగేశ్వర రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు భూమి రైతుకు కొలిచి త‌లెత్తే లోపాల‌ను స‌రిదిద్దేందుకు లంచాల బాట పట్టారు కొందరు ఉద్యోగులు. అలాంటి కోవ‌లోనే విలేజ్ స‌ర్వేయ‌ర్ నాగేశ్వర‌రావు అడ్డంగా బుక్ అయ్యాడు.

  ఎందుకిలా జ‌రుగుతోంది..!

  వాస్తవానికి జ‌గ‌న‌న్న భూస‌ర్వే ప‌థ‌కం ద్వారా ప‌రిపూర్ణమైన భూమి కొల‌త‌ను ఆన్‌లైన్ చేయ‌డంతో పాటు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్(LPM) ఇస్తారు. ఒక‌ప్పుడు వీటి స్థానంలో ప‌ట్టాదారు పాసుపుస్తకం మాత్రమే ఇచ్చారు. అయితే ఒకే స‌ర్వే నెంబ‌రులో చాలా మంది రైతులు ఉండేవారు. కాని LPM ద్వారా ఒక రైతుకు ఒక నెంబ‌రును కేటాయిస్తారు. గ్రామంలో భూమిఉన్న ప్రతీ రైతుకు ఒక LPM ఉంటుంది. ఈ సమయంలో కాస్త ఒక సెంటు అటుఇటుగా ఉన్నా కూడా అది కూడా కలిపి రాయమని సర్వేయర్‌ను అడుగుతుంటారు రైతులు. ఇలా రైతుల ఆశను సర్వేయర్‌లు క్యాష్‌ చేసుకుంటున్నారు.

  ఇది చదవండి: మున్సిపల్‌ ఆఫీసులో గాడిదలు.. వాటికి అక్కడేం పని..? అసలు మేటర్ ఏంటంటే..!

  ఏసీబీ టోల్‌ఫ్రీ నెం 14400తో చిక్కాడు…!

  త‌న పొలాన్ని కొల‌డానికి సర్వేయర్‌ లంచం అడుగుతున్నాడ‌ని బాధిత రైతు 14400 కి ఫోన్ చేయ‌గా ఏసీబీ అధికారులు స్పందించారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండ‌లం కాండ్రకోట సచివాలయం వద్ద ఏసీబీ అధికారులు నిఘాపెట్టారు. సర్వే ఉద్యోగి రైతు నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో మాటువేసి ప‌ట్టుకున్నారు. రీజ‌న‌ల్ ప‌రిధిలోని అడిష‌న‌ల్‌ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో గ‌త కొంత కాలంగా ఏసీబీ ప‌లువురు అధికారుల‌ను అరెస్టు చేసింది.

  కాండ్రకోట‌లో జ‌రిగిన ఏసీబీ ఆప‌రేష‌న్‌లోనూ ఆమె ద‌గ్గరుండి ప‌క్కా ప్రణాళిక‌తో స‌ర్వేయ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి చేతులు సైతం పరీక్షించగా డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు అడిషనల్ ఎస్పీ సౌజన్య చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఏ పనికయినా సిబ్బంది లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 14400కి ఫోన్ ద్వారా పిర్యాదు చేయాలని ఆమె కోరారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Local News

  ఉత్తమ కథలు