P Ramesh, News18, Kakinada
హీరోలపై అభిమానం అంటే ఆషామాషి కాదు. నేటి కాలంలో హీరోలపై అభిమానమంటే అదిపెద్ద గొప్ప కాదు. కానీ పాత తరం నటులకు అభిమానులు కాదు. గొప్ప భక్తులు నేటికి ఉన్నారంటే అతిశయోక్తి కాదనేది నిజం. ఎందుకంటే ఎన్టీ రామారావు (NTR Rama Rao) ను కూడా చిత్రాలలో బంధించి నేటికి పూజలు చేసే వారెందరో ఉన్నారు. దీనికి కారణం నాటికాలంలో శ్రీకృష్ణ, అర్జునుడు, శ్రీరాముడు వంటి పాత్రలతో మెప్పించారు ఎన్టీఆర్ (NTR). అదే కోవకు చెందిన వారిలో రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju), సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) కూడా ఉన్నారు. వారి పై ఉన్న అభిమానులైతే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లో కోకొల్లలనే చెప్పాలి.
గత కొద్ది కాలం కిందట రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి చెందడం మనకు తెలిసిందే. అదే సమయంలో కొత్త పేటకు చెందిన శిల్పి వడియార్ ఫైబర్‌తో కృష్ణంరాజు విగ్రహాన్ని కృష్ణంరాజు కుటుంబసభ్యుల కోరిక మేరకు తయారు చేశారు. ఆసమయంలో ఆ విగ్రహానికి భలే క్రేజ్ వచ్చింది. అలాగే కాకినాడ జిల్లాలోని పిఠాపురానికి చెందిన కాగితాల కృష్ణ అనే శిల్పి మనవడైన కాగితాల కృష్ణ అనే యువశిల్పి రెబల్ స్టార్ నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేసి వావ్ అనిపించాడు. ఇలా శిల్పాలు తయారు చేసి తమ అభిమాన నటుడికి నివాళులర్పించడంతో కోనసీమ, గోదావరి జిల్లాల అభిమానం మించిన అభిమానం మరోకటి లేదు. తాజాగా కోనసీమ జిల్లా (Konaseema District) ముమ్మిడివరం మండలం గాడిలంక నుండి వచ్చిన అభిమాని మాధవరావు తనకున్న కళానైపుణ్యంతో కృష్ణ విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరుస్తున్నారు.
ఇటీవల కాలంలో సూపర్ కృష్ణ కూడా మృతి చెందారు. ఆయన నటనకు ఫిదా అవ్వని వారంటూ లేరనేది చెప్పాలి. అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ ఒదిగిపోయారు. నేటికి ఆయనను అల్లూరి సీతారామరాజుగానే చూస్తారు. తెలుగులో కలర్ సినిమాను తీసుకొచ్చిన ఘనుడు. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు ధీటుగా దూసుకొచ్చిన పాతకాలపు నటుల్లో కృష్ణ ఒకరు అనే చెప్పాలి. అందానికి అందం, మంచి చాయ కలిగిన కృష్ణ కు ఉన్న అభిమానులు నేటికి ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన మృతిచెందన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కృష్ణ అభిమానులు కన్నీళ్లతో కృష్ణకు నివాళులర్పించారు.
ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కృష్ణ కు అభిమానులు మరింత ఎక్కవ. ఎందుకంటే గోదావరి ప్రాంతంతోపాటు, ఏజెన్సీ ప్రాంతాలతో నటుడు కృష్ణకు అవినావభావ సంబంధం ముడి పడి ఉందనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం ఆయనకు తెలుగులోనూ, అందులో కోనసీమ, గోదావరి జిల్లాలో ఉన్న ముడి పడి ఉన్న బంధమే కారణం. గతంలో ఇక్కడకు వచ్చినప్పుడల్లా గోదావరి తీర ప్రాంతాన్ని సందర్శించనిదే కృష్ణ తిరుగు ప్రయాణం ఉండేది కాదని చెబుతుంటారు. అంతటి అభిమానం ఉన్న నటుడికి విగ్రహాలేంటి ఏకంగా దేవాలయాలే నిర్మిచేటంత అభిమానాన్ని చూపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Super Star Krishna