P Ramesh, News18, Kakinada
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో క్షేత్రాల విశిష్టత కోసం ఆరా తీస్తే వామ్మో దేశంలో ఈ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్రకు నిలువుటద్దంలా ఇక్కడ దేవాలయాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి అంటే ప్రస్తుతం కాకినాడ (Kakinada), కోనసీమ (Konaseema), తూర్పు గోదావరి జిల్లాగా విడిపోయిన తర్వాత క్షేత్రాల ఉత్సవాలకు సంబంధించి మూడు జిల్లాల పరిధిలో జరిగే ఉత్సవాలుగానే దేవాదాయశాఖ పరిణమిస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రభల ఉత్సవాలతో కోనసీమ అదరగొట్టింది. మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇక్కడ జరిగే ఉత్సవాలను చాలా ఫేమస్‌గా చెబుతారు. 703 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెబుతుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. ఒకప్పుడు ప్రైవేటు సంస్థానం ఆధీనంలో ఉండే ఈ దేవాలయాన్ని గత ప్రభుత్వం దేవాదాయ శాఖలో కలిపింది. ఆస్తుల పరంగా బాగానే ఉన్న ఈ దేవాలయంలో శ్రీ పాద శ్రీవల్లభుడి వారి విగ్రహాలను దర్శనం చేసుకుంటారు.
పిఠాపురాన్ని చరిత్ర పరంగా శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థానంగా చెబుతుంటారు. మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ జరిగే ఉత్సవాలకు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ప్రాంతంలో రాఖీ పౌర్ణమి జరుగుతుంది. అదే సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే చాలా అదృష్టమని చెబుతుంటారు. నిత్యం మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటకతోపాటు, ఉత్తరాధి రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామి వారి సేవలోమునిగి తేలుతుంటారు.
ఈనెల 29వ తేది వరకూ జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామోత్సవంతోపాటు విఘ్నేశ్వరుని పూజ, పుణ్యహవాచనం, పరిషత్తు దీక్షాధారణ, ఋత్విగ్బరణులు, కలశారాధన, దేవతావాహన జరుగుతాయి. వేదపారాయణ. సూర్యనమస్కరాలు, సంపుటీకరణతో అభిషేకము, జపములు, సహస్రనామార్చన జరుగుతుంది. హోమం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వీటితోపాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు వసతి, భోజన సదుపాయం ఉంటుంది. ఈనెల 29 వ తేది వరకూ స్వామివారి పారాయణం జరుగుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ పాద చరితామృతాన్ని భక్తులు ఇక్కడ పారాయణం చేస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News