P Ramesh, News18, Kakinada
కాకినాడ ఎంపీ వంగా గీత (Kakinada MP Vanga Geetha). ఆపేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. చురుకుగా అందరితో కలుపుకుపోయే మనస్తత్వం గల గీత, ఇటీవల వరుసగా ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులపై పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారు. పలుమార్లు ఎల్ఐసీపై కేంద్రాన్నిప్రశిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆమె పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎల్ఐసీలో 5 శాతం వాటాపై ఆమె పలు అర్జిలు చేశారు. ఆ 5 శాతం డిజిన్వెస్ట్ చేసి ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) నుండి బయటకు రావడానికి గల కారణాలపై ఆమె ఎందుకు పట్టుబిగించారనేది పెద్ద చర్చగా మారింది. వాస్తవానికి జగన్ సర్కారులో ఎంపీలంతా కేంద్రానికి మద్ధతిచ్చే క్రమంలో ఐపీఓపై కాకినాడ ఎంపీ గీత చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతమవుతాయనేది చూడాలి.
ఎల్ఐసీలో 5 శాతం వాటాను డిజిన్వెస్ట్ చేసి, ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) తో బయటకు రావడానికి కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎల్‌ఐసిని ప్రైవేటీకరించటం లేదని, ఎల్‌ఐసిలో నియంత్రణ వాటాను కొనసాగిస్తామని ప్రభుత్వము చెబుతున్నప్పటికి ఇదీ నమ్మశక్యంగా లేదనేది వారి వాదన. గతంలో జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణకు అదే మార్గాన్ని ప్రభుత్వం అనుసరించడం కూడా జరిగింది. దీనిపై ఉద్యమం మాట పక్కన పెడితే కేంద్రం అనుకున్నదే తడువుగా చేసుకుపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో ఐపీఓ వాటాపై వైసీపీ ఎంపీ ప్రశ్నలు సందిగ్ధంగా మారాయి.
ఎల్ఐసీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కఠినతరం చేస్తున్న సమయంలో , అనేక భారతీయ కంపెనీల ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఈ నెలలో, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIS) భారతదేశం నుండి రూ.38,000 కోట్లను ఉపసంహరించుకున్నారు. దాదాపుగా 22 నెలల్లో ఇది అత్యధిక విక్రయాలు - అవుట్‌ఫ్లోలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో , ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ను నిరవధికంగా నిలిపివేసి, మార్కెట్‌లను బలోపేతం చేయడానికి చేయడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎంపీ చెప్పడం ఎల్ఐసీలో ఐపీఓ వాటాపై పెద్ద చర్చ మొదలైంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తన భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడానికి మేనేజ్‌మెంట్, సిబ్బంది, ఏజెంట్లు మరియు పాలసీదారులతో క్షుణ్ణంగా సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రపంచం లో నమ్మకమైన, లాభాలలో ఉన్న , ఉద్యోగులకు, ఏజెంట్ల కు ఉపాధి హామీ మాత్రమే కాక పాలసీ హోల్డర్స్ కు వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతుందని ఆమె ప్రత్యేకంగా చెబుతున్నారు.
దీనిపై ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కాకినాడ ఎంపీ గీత మద్ధతు పలకడం వెనుక పార్టీ ప్రభావమా.. లేక ఆమెకు వచ్చిన ఆలోచనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ నుండి ఎంపీలు అడగాల్సిన ప్రశ్నలు, అర్జీలు కేవలం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం ఎంపీ గీత ఐపీవో వాటపై అడగటం ఆయా పార్టీలోనే చర్చ మొదలైందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News