హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సాఫ్ట్ వేర్ జాబ్.. మంచి జీతం.. కానీ యువకుడి సమస్య అదే.. అందరూ చూస్తుండగానే ఘోరం

సాఫ్ట్ వేర్ జాబ్.. మంచి జీతం.. కానీ యువకుడి సమస్య అదే.. అందరూ చూస్తుండగానే ఘోరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంజ‌నీరింగ్ చ‌దివాడు..చదువు అయిపోయిన వెంటనే మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేరాడు. ఐదంకెల జీతం.. జీవితం స‌జావుగానే సాగుతుంది. కాని అత‌డి జీవితంలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాలు చివ‌ర‌కు అత‌డి ప్రాణాల‌నే తీశాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

P. Ramesh, News18, Kakinada

ఇంజ‌నీరింగ్ చ‌దివాడు.. చదువు అయిపోయిన వెంటనే మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేరాడు. ఐదంకెల జీతం.. జీవితం స‌జావుగానే సాగుతుంది. కాని అత‌డి జీవితంలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాలు చివ‌ర‌కు అత‌డి ప్రాణాల‌నే తీశాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ (Kakinada) కొండ‌య్యపాలానికి చెందిన 25 ఏళ్ల అనంత్‌సాయి ఇంజ‌నీరింగ్ (Engineering) పూర్తి చేశాడు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించాడు. అంతా బాగానే ఉన్న స‌మ‌యంలో అనూహ్యంగా అత‌డు పారిపోయాడు. ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కాకినాడలోని ఓ హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నాడు. జీతం కింద వచ్చేడబ్బు ఖర్చయిపోయిందో.. లేక ఉద్యోగంలో ఏమైనా సమస్యలు వచ్చాయో తెలియదుగానీ.. అతడి దగ్గర చిల్లగవ్వ కూడా లేకుండా పోయింది.

తన పరిస్థితిపై ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేకపోయాడు. కనీసం స్నేహితులు, బంధువులకు కూడా సమాచారం అందించలేదు. దీంతో హోటల్ బిల్లు కోసం నిర్వాహకులు గట్టిగా నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. ఓ వైపు హోటల్ బిల్లులు చెల్లించలేకపోవడం, మరోవైపు ఇంట్లో గొడవలు.. అదే సమయంలో ఉద్యం కూడా పోవడంతో తీవ్ర ఒత్తిడికిగురయ్యాడు. దీంతో అందరూ చూస్తుండగానే మూడంతస్తుల భవనంపై నుంచి దూసేశాడు. వెంటనే హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఇది చదవండి: పెళ్లి చూపుల్లో ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయింది.. చేతి నిండా గాజులు వేసుకొని అంతపని చేసింది

అవివాహితుడైన అనంతసాయి తీసుకున్న ఈనిర్ణయానికి అత‌డి కుటుంబ స‌భ్యలు సైతం షాక్‌కు గుర‌య్యారు. కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడని.., కోపం తగ్గాక ఇంటికి వస్తాడులే అనుకుంటే ఇలా చేసుకున్నాడేంటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనంతసాయి ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసి అత‌డి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆర్థిక క‌ష్టాలే అతన్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చాయని..ఆ ఒత్తిడితోనే ఇలా చేశాడ‌ని అత‌డి సన్నిహితులు చెబుతున్నారు.

ఇది చదవండి: లక్కీ డ్రాలో కారు గెలిచారంటే ఎగిరి గంతేసింది..! కట్ చేస్తే ట్విస్ట్ అదిరిపోయింది..!

అనాలోచిత నిర్ణయాలు.. చిధ్రమ‌వుతున్న జీవితాలు..!

ప్రస్తుత కాలంలో కొంత మంది తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో జీవితాలు చిధ్రమ‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఈ ఒత్తిడి ప్రభావం సాఫ్ట్ వేర్‌ ఉద్యోగుల‌పై ఎక్కువగా ప‌డింద‌ని నిపుణులు అంటున్నారు. జీతాలకు త‌గ్గట్టుగా ఉండ‌కుండా కొంత మంది అద‌న‌పు ఖ‌ర్చులు, స్నేహితుల‌తో క‌లిసి విప‌రీత‌మైన ఖ‌ర్చులు చేస్తూ అప్పుల‌ పాలవుతున్నారు. ఈ నేప‌థ్యంలో క్రెడిట్ కార్డుల ప్రభావం కూడా ఉంద‌ని అంటున్నారు మాన‌సిక నిపుణులు. వ‌య‌స్సు త‌క్కువ కావ‌డం, అనుభ‌వ‌లేమిత‌నం వంటి అంశాల‌తో కొంత మంది ఆత్మహ‌త్యల‌కు పాల్పడుతున్నార‌ని… దీనిపై ముందుగా అలాంటి ఆలోచనలు వచ్చిన వారికి కౌన్సిలింగ్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kakinada, Local News

ఉత్తమ కథలు