హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నత్తలతో ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

నత్తలతో ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

X
నత్తల

నత్తల కూరతో హెల్త్ బెనిఫిట్స్

నత్త నడకన నడిచింది.., చాలు నానుడి మనం విన్నదే.. కానీ అది నత్తను తింటే ఎలాగుంటుంది. ఏంటీ నత్తను తినడమా…వినడానికే అసహ్యంగానే ఉంది. మరి ఎలా తింటారని కంగారుపడుతున్నారా? అవునండి బాబు నిజమేనండి..!

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

P Ramesh, News18, Kakinada

మన ఆరోగ్యానికి మంచి చేసే చాలా ఆహారాలు మన ముందే ఉంటాయి. కొన్నింటిని మరీ తక్కువగా చూస్తుంటాం. అలాంటి వాటిలోనే మంచి పోషకాలుంటాయి. అదే కేటగిరీకి వస్తాయి నత్తలు. సాధారణంగా నత్తలను చాలా మంది పట్టించుకోరు. వాటి వాసనను ఇష్టపడరు. కానీ వాటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంట.  ఏంటీ నత్తను తినడమా.., వినడానికే అసహ్యంగానే ఉంది. మరి ఎలా తింటారని కంగారుపడుతున్నారా? అవునండి బాబు నిజమేనండి.. వీటిని తినడం ద్వారా దగ్గు,ఆయాసం వంటి జబ్బులకు దూరంగా ఉండచ్చునని చెబుతున్నారు గోదావరి వాసులు. పాలు, గ్రుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, మాంసం.. ఇలా ప్రతిది మనిషి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి. అయితే నత్తలు కూడా ఆహారములో భాగంగానే తీసుకోవచ్చంట. నత్తలు కూడా రోగాలను నయం చేస్తున్నాయని అంటున్నారు వీటిని తరచూ తినేవాళ్లు. అందుకే దీర్ఘకాలిక రోగులు ఎక్కువగా ఆకు కూరలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.అదే సందర్భంలో ఇప్పుడు కొన్ని మాంసాహార జీవులు కూడా రోగాలకు పనిచేస్తున్నాయని ఎక్కువగా వినిపిస్తుంది.

ఇలాంటి క్రమంలోనే ఇటీవల గోదావరి జిల్లాలో వాసులు ఎక్కువగా నత్తలను ఆహారంగా తీసుకుంటున్నారు. గోదావరి మంచినీటి జలాల్లో పెరిగే ఈ నత్తాలు కేవలం నాచు చిన్న చిన్న కీటకాలు తిని బతుకుతాయి.ప్రస్తుతం వీటిని గోదావరి కాలువ గట్టు పక్కన ఎక్కువగా విక్రయిస్తున్నారు. శనగపప్పు కలిపి నత్తల కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అంట. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమంటున్నారు. నత్తలు తినడం ద్వారా ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస కోస వ్యాధులతో పాటు, మూలవ్యాధులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా లభిస్తాయని ఈ సీజన్లో వచ్చే దాదాపు అన్ని వ్యాధులకు నత్తలు చాలా ఉపయోగకరమని చెబుతున్నారు.

ఇది చదవండి: మామిడి చెట్టు నుండి నీళ్లొస్తున్నాయా.. వామ్మో ఇదేమి వింత‌..!

అతి తక్కువ ధరతో ఆరోగ్యం

అవును ఇది నిజమే, అతి తక్కువ ధరతో కేజీ 100 నుండి 200 రూపాయలు మాత్రమే పలుకుతున్నఈ నత్తలు. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగ ఉండడంతో పెద్ద ఎత్తున మాంస ప్రియులు ఎగబడుతున్నారు. అయితేఇవి తక్కువ మొత్తంలో దొరకడంతో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. వీటిని మొదట ఉప్పు పసుపుతో కడగాలట. ఆ తర్వాత మజ్జిగ వేసి శుభ్రం చేస్తే నత్తల ద్వారా వచ్చే వాసన పోయి ఆ తర్వాత వేడి నీటిలో ఉడికించి మసాలాతో వండడం ద్వారా మేక మాంసం కంటే రుచిగా ఉంటుందని నత్తల కర్రీ తిన్నవారు ప్రత్యక్షంగా వివరించారు.అతి తక్కువ డబ్బులు వెచ్చించి రుచితో పాటు ఆరోగ్యాన్ని మనం ఈ నత్తల ద్వారా తీసుకుంటున్నామని నత్తల గొప్పతనాన్ని వివరిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News

ఉత్తమ కథలు