హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking Video: చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీరు.. ఎందుకో తెలుసా..? ఎక్కడంటే..?

Shocking Video: చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీరు.. ఎందుకో తెలుసా..? ఎక్కడంటే..?

చేతి పంపునుంచి ఆగకుంగా వస్తున్న నీరు

చేతి పంపునుంచి ఆగకుంగా వస్తున్న నీరు

Shocking Video: కొన్ని సంఘటనలు నిజంగానే షాకిస్తాయి.. కొన్ని అయితే నమ్మశక్యం కాదు.. కానీ వాస్తవం.. దీంతో ఎందుకిలా జరుగుతోందని ఆసక్తిగా దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటాం.. అలాంటిదే వీడియో ఒకటి ఇప్పుడు చూడండి..

  Shocking Video: గత కొన్ని రోజులు ఏపీని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. చాలాచోట్ల కుండపోత వానలు కురిసాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరద కారణంగా.. గోదావరి నది (Godavari River) మహోగ్రరూపం దాల్చింది. అయితే ప్రస్తుతం వర్షాలు తెరిపించాయి.. గోదారమ్మ సైతం శాంతిస్తోంది. మరోవైపు ఆ వరదల ఎఫెక్ట్ మాత్రం ఇంకా తగ్గలేదు. కోనసీమ జిల్లా (Konaseema District) ఇంకా వరద ముప్పులోనే ఉంది. పలు లంక గ్రామాలు ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి వరద నీటిలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోలు, ముమ్మిడివరం గ్రామాల ప్రజలు భారీగా నష్టపోయారు. ఇప్పటి వరకు 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వరదలు ముంచెత్తినా.. చాలామంది ఇళ్లను వదలి వెళ్లలేక, పునరావాస కేంద్రాల్లో ఉండలేక అంతులేని అవేదనలో ఉన్నారు. ఇళ్ల లోకి పాములు, అపరిశుభ్ర వాతావరణంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బయటి ప్రపంచానికి రావడానికి పడవలు లేక అల్లాడుతున్నట్లు వాపోయారు. మరోవైపు పంట పొలాలు దెబ్బతినడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. వరద ఉద్ధృతి తగ్గేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇటు సీఎం జగన్ (CM Jagan) సైతం వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి సాయం అందేలా చూడాలని.. అందుకు డెడ్ లైన్ కూడా పెట్టారు సీఎం జగన్..

  ఓ వైపు వరద ప్రభావంతో ప్రజలు వణకుతుంటే.. మరోవైపు ఆసక్తికరమైన ఘటనలు కనిపిస్తున్నాయి. గోదావరి సమీప ప్రాంతాల్లో తక్కువ లోతులోనే చేతి బోర్లకు నీళ్లు అందుతాయి. ప్రస్తుతం గోదావరికి వరద భారీగా చేరడంతో.. కొన్ని గ్రామాల్లోని బోర్లలో నీళ్లు ఉప్పొంగుతున్నాయి. చేతి పంపులు కొడితేనే నీళ్లు వస్తాయి.. కానీ, ఎవరూ కొట్టకుండానే హ్యాండ్ పంపుల నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి.

  ఇది ఎక్కడంటే.. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం చింతలమెరకలో దాకే జనార్ధనరావు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న బోరు నుంచి నీళ్లు.. రెండు రోజులుగా ఇలానే ఉబికి వస్తున్నాయి. వరదల కారణంగా భూగర్భ జలాలు విస్తారంగా పెరగటంతో ఇలా నీరు పైకి వస్తుందని స్థానికులు అంటున్నారు. అలాగే గోదావరి తీరాన వున్న యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో కూడా ఇదే సీన్ కనిపించింది. ఇక్కడ రెండు, మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు.

  ఇదీ చదవండి : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు.. బాలయ్య ఎందుకు రాలేదంటే..?

  వరదలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పలు ఆసక్తికర వీడియోలు ఇంటర్‌ నెట్‌లో చేరాయి. వాటిల్లో ప్రస్తుతం ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఇలా నీళ్లు వస్తాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు చూశామంటున్నారు గోదావరి జిల్లాల ప్రజలు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, AP News, East Godavari Dist, Viral Video

  ఉత్తమ కథలు