హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: కొడుకు చనిపోయిన 50 రోజులకు కోడలి ఫోన్ చూసిన మామ.. వాట్సాప్ లో విస్తుపోయే మెసేజ్‌లు..

Shocking: కొడుకు చనిపోయిన 50 రోజులకు కోడలి ఫోన్ చూసిన మామ.. వాట్సాప్ లో విస్తుపోయే మెసేజ్‌లు..

ఫైల్

ఫైల్

Kakinada Woman: ఆ పెద్దాయన కొడుకుపోయిన దుఃఖంలో ఉన్నాడు. ఆ బాధతోనే దాదాపు రెండు నెలలు గడిపేశాడు. అలా కొడుకును తలుచుకుంటూ తన ఫోన్ చూసుకున్నాడు. ఆ ఫోన్ గతంలో కోడలు వాడినది. అందులోని వాట్సాప్ మెసేజ్ లు చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఆ పెద్దాయన కొడుకుపోయిన దుఃఖంలో ఉన్నాడు. ఆ బాధతోనే దాదాపు రెండు నెలలు గడిపేశాడు. అలా కొడుకును తలుచుకుంటూ తన ఫోన్ చూసుకున్నాడు. ఆ ఫోన్ గతంలో కోడలు వాడినది. అందులోని వాట్సాప్ మెసేజ్ లు చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తన కొడుకుది సహజమరణం కాదని.. ఏదో మిస్టరీ దాగుందని అనుమానించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఊహించని నిజాలుతెలిశాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ (Kakinada) ప్రత్యేక కోర్ట్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న అక్బర్ అజాంకు మొదటి భార్య చనిపోవడంతో యానాంకు చెందిన అహ్మదున్నీసా బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఆజాం తల్లిదండ్రులు కూడా అతడితోనే కలిసి ఉంటున్నారు.

ఇదిలా ఉంటే జూన్ 23న అక్బర్ ఆజాం ఇంట్లోనే మరణించాడు. అతనిది సహజ మరణంగా భావించి.. తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. ఐతే అక్బర్ గతంలో భార్యకు కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఆమె దగ్గరున్న పాత మొబైల్ ను తండ్రికి ఇచ్చాడు. ఐతే కొడుకు చనిపోయిన దాదాపు రెండు నెలల తర్వాత తన ఫోన్ చూసుకుంటుండగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ లు బయటపడ్డాయి. కోడలు.. తమ అపార్ట్ మెంట్లోనే ఉండే రాజేష్ జైన్, కిరణ్ అనే యువకులతో మాట్లాడిన మాటలు ఫోన్లో రికార్డయ్యాయి.

ఇది చదవండి: మీకు ఓటెస్తే మాకేంటి లాభం..ఎమ్మెల్యేని దుమ్ముదులిపేసిన మహిళ..!


దీంతో ఆరా తీయగా.. అహ్మదున్నీసా బేగంకు వాళ్లిద్దరితో ఎఫైర్ ఉన్నట్లు తేలిసింది. తమ సుఖానికి అడ్డొస్తున్నాడనే కోపంతో.. జూన్ 23న అక్బర్ ఆజాంకు నిద్రమాత్రలు ఇచ్చింది. అతను నిద్రలోకి జారుకోగానే.. కిరణ్ ను పిలించింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్లకార్ క్లోరోఫామ్ తెచ్చిన కిరణ్.. అక్బర్ ఆజాం ముక్కుకు అదిమిపట్టుకున్నాడు. దీంతో అతడు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఈ మర్డర్ కు రాజేష్ జైన్ బయట నుంచి కాపలా కాశాడు. పోలీసులు అహ్మదున్నీసాతో పాటు రాజేష్, కిరణ్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించాడు. అక్రమ సంబంధం కోసమే భర్తను హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది.

ఇది చదవండి: తల్లిని చూడకూడని స్థితిలో చూసిన కొడుకు.. అవమానం తట్టుకోలేక ఎంత పనిచేశాడంటే..


గతంలో విశాఖపట్నంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆఫ్రికాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మురళీ.. తన భార్య మృదులను విశాఖలోనే ఉంచాడు. భర్త దూరంగా ఉండటంతో 18 ఏళ్ల కుర్రాడితో మృదుల ఎఫైర్ పెట్టుకుంది. భర్త సెలవు నిమిత్తం విశాఖ రావడంతో ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. కుక్కర్ మూతతో భర్త తలపై కొట్టి హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి డెడ్ బాడీని మారికవలస వంతెన కిందపడేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారు.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Kakinada

ఉత్తమ కథలు