హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kakinada: సిగ్గుచేటు ఈ రోజుల్లో కూడా కులబహిష్కరణ..! కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న మహిళ..!

Kakinada: సిగ్గుచేటు ఈ రోజుల్లో కూడా కులబహిష్కరణ..! కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న మహిళ..!

కాకినాడ జిల్లాలో కుటుంబంపై కులబహిష్కరణ

కాకినాడ జిల్లాలో కుటుంబంపై కులబహిష్కరణ

కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి చెందిన ములుగు రామలక్ష్మి.., తనను కుల బహిష్కరణకు గురిచేస్తున్నారని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  తనను కుల బహిష్కరణకు గురిచేస్తున్నారని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ కాకినాడ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి చెందిన ములుగు రామలక్ష్మి.., తనను కుల బహిష్కరణకు గురిచేస్తున్నారని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా కానీ పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకపోగా.., కనీసం పట్టించుకోలేదని బాధిత మహిళ కాకినాడ స్పందన లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయమని కోరుకుంటుంది. రామలక్ష్మి గత 30 సంవత్సరాల నుండి వేరే కులస్తుడితో కాపురం ఉంటుంది. కక్ష సాధింపు చర్యలు ఆమె కులస్తులైన సగరులు వేధిస్తున్నారని వాపోయింది. నాలుగు రోజుల క్రితం జరిమానాగా రూ. 4000 విధించారని చెల్లించాలని అయినా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన చెందింది.

  తనను కులం నుండి వెలివేసారని.., ఎవరితో నైనా మాట్లాడితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారని.. తనకు తగిన న్యాయం చేయాలని కన్నీరుమున్నీరైంది. కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా వెళ్లకూడదంటున్నారని.. తమ కులస్తులతోపాటు వేరే కులస్తుల ఇళ్లకు కూడా వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని బాధపడింది.

  ఇది చదవండి: పెద్దాపురంలో తయారయ్యే ఆ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే.. ఆహా ఏమిరుచి అనాల్సిందే..!

  గత 15 రోజుల నుండి ఈ మానసిక వేదన పొందుతున్నారని అవమానాలతో కృంగిపోతున్నానని చెబుతోంది. ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని అందుకే కాకినాడలో స్పందనలో ఫిర్యాదు చేశానంటోంది రామలక్ష్మి. తనకు న్యాయం చేయాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటుంది. అయితే ఆమెకు చెందిన సామాజిక వర్గంలో కొందరు ములుగు రామలక్ష్మి ఆరోపణలు అవాస్తమనీ ఖండిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Local News

  ఉత్తమ కథలు