P Ramesh, News18, Kakinada
ఉదయం లేస్తే ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేం ఇది నిజం. అందుకే ప్రతి దానికి కాలమే సమాధానం చెబుతుందని అంటారు. కొన్ని సంఘటనలు సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. ఊహించని విపత్తులు తీసుకొస్తుంటాయి. దీనికి కారణం ఎవరిని ఆరా తీస్తే కొండను తవ్వి ఎలుకను పట్టారా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. తెలిసి తెలియని పనులు వల్ల చాలామంది కొన్ని విషయాల్లో ఇరుక్కు పోతుంటారు. ఎంత జాగ్రత్త వహించినా కొన్ని ప్రమాదాలు తప్పించాలంటే ఎవరి తరం కాదు. అయితే మంచో చెడ్డ మొత్తం మీద భవిష్యత్తుకు ఓ ప్రమాద హెచ్చరికగా సూచికగా మారుతుంటాయి కొన్ని సంఘటనలు.
తాజాగా జరిగిన ఈ ఘటన కోనసీమ జిల్లా (Konaseema District) తో పాటు యావత్తు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంసృష్టించింది. ఒకేసారి 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకులోనై నరకం చూసారు. రెండు గంటలపాటు ఊపిరాడని ఈ ఘటన కోనసీమ జిల్లాను వణికించింది. ఓ పాఠశాలలో జరిగిన ఈ ఉదంతం అధికారులను ముచ్చమట్టలు పట్టించింది. చివరకు రెండు గంటల హడావుడి అనంతరం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులలో ఒక ప్రైవేట్ పాఠశాల చెందిన 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరికి ఊపిరాడక వెలువలాడుతున్న 40 మంది చిన్నారులను పాఠశాల సిబ్బంది. హటాహుటిన సమీపంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన 11మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు .అక్కడ ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
బండారులంక విజ్ డమ్ యూపీ స్కూల్ కుచెందిన విద్యార్థులు ఈ సంఘటనలో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల పక్కన పాన్షాప్ ముసుగులో అనధికారికంగా మద్యం బెల్ట్ షాపును నిర్వహిస్తున్నారు. అక్కడ వారు పడేసిన ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ మద్యం బాటిల్స్, ఖాళీ వాటర్ బాటిల్స్, ఇతరత్రా ప్లాస్టిక్ కవర్లు అన్నింటిని ఆషాప్ నిర్వాహకుడు దగ్ధం చేశాడు. దీంతో భారీ ఎత్తున దుర్వాసనతో కూడిన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
ప్రక్కనే పాఠశాలలో మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థులకు ఈ పొగ వెళ్లడంతో ఊపిరాడక ఆస్వస్థతకుగురైనారు. వీరంతా 12 ఏళ్ల లోపు చిన్నారులే. పాఠశాల సిబ్బంది సకాలంలో విద్యార్థులను ఆస్పత్రికి తరలించడం ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో బాధ్యులైన కారకులను వెంటనే అరెస్ట్ చేసి విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసులను విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.