EAST GODAVARI SENSATIONAL FACTS REVEALED IN MOTHER AND DAUGHTER DEATH CASE IN KONASEEMA DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Konaseema Woman: ప్రియుడి కోసం అతడి భార్య, అత్తను చంపేసింది.. కోనసీమలో సంచలనం.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు
మృతులు మంగాదేవి, జ్యోతి
మనిషిలోని కామం, క్రోదం ఎంతటికైనా తెగించేలా చేస్తాయి. కొన్నిసార్లు అసలైన వారికంటే కొసరుగా వచ్చిన వారే బలవుతుంటారు. భాగస్వామి చేసిన తప్పులకు కట్టుకున్నవారు బలవుతుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కోనసీమ జిల్లా (Konaseema District) లో జరిగింది.
ఓ జంట మధ్య వివాహబంధం కాకుండా మరే బంధం ఏర్పడినా అది నేరానికే దారితీస్తుంది. జీవితాన్ని అత్యంత దారుణంగా మారుతుంది. మనిషిలోని కామం, క్రోదం ఎంతటికైనా తెగించేలా చేస్తాయి. కొన్నిసార్లు అసలైన వారికంటే కొసరుగా వచ్చిన వారే బలవుతుంటారు. భాగస్వామి చేసిన తప్పులకు కట్టుకున్నవారు బలవుతుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కోనసీమ జిల్లా (Konaseema District) లో జరిగింది. పెళ్లికి ముందు భర్త పెట్టుకున్న సంబంధం ఓ అమాయకురాలిని బలితీసుంది. వివరాల్లోకి వెళ్తే అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈనెల 2న తల్లీకూతుళ్లు సజీవన దహనమయ్యారు. తొలుత ఇది అగ్నిప్రమాదంగా భావించినా పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్న కొద్దీ ఒక్కొక్కరి ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది.
అసలేం జరిగిందంటే.. కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన మేడిశెట్టి సురేష్ కు అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఐతే కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్న సురేష్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నాగలక్ష్మిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె.. సురేష్ ను తన భార్య నుంచి విడదీసి తనవైపు తిప్పుకోవాలని భావించింది. ఇందుకోసం ఎన్నో పన్నాగాలు పన్నింది.
జ్యోతికి అక్రమ సంబంధం ఉందంటూ సురేష్ ఇంటివద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు ఆమె సవతి కూతుళ్లు సహకరించేవారు. ఆ ఉత్తరాలు చవిదిన సురేష్.. అవేవీ నమ్మకుండా భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఇక ఎంత ప్రయత్నించినా సురేష్.. భార్యను వదిలి రాకపోయేసరికి నాగలక్ష్మి మరోస్కెచ్ వేసింది. జ్యోతిని చంపేస్తే ప్రియుడు మళ్లీ తన దగ్గరకి వస్తాడని భావించింది.
ఈ క్రమంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. ఈనెల 2న రాత్రి తన తల్లితో కలిసి నిద్రిస్తుండగా.. అక్కడికెళ్లిన నాగలక్ష్మి.. తన సవతి కూతుళ్లయిన సౌజన్య, దివ్య, హరితలను తీసుకెళ్లి.. జ్యోతి, ఆమె తల్లిపై పెట్రోల్ పోయాలని చెప్పింది. వారు ఆమె చెప్పినట్లే చేయగా.. వెంటనే ఇంటికి నిప్పంటించింది. ఇంట్లో మంటలు చెలరేగడంతో జ్యోతి తండ్రి నిద్రలేచి మంటలార్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే తల్లీకూతుళ్లిద్దరూ సజీవ దహనమయ్యారు.
ఐతే తొలుత ఇది ప్రమాదమని భావించినా.. హత్య కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నాగలక్ష్మితో పాటు ఆమెకు సహకరించిన హరిత, దివ్య, సౌజన్యలను అదుపులోకి తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెళ్లికి ముందు భర్త నడిపిన వ్యవహారానికి అన్యాయంగా భార్యతో పాటు ఆమె తల్లికూడా బలైపోయిందంటూ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.