హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

1998 డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అలర్ట్.. జాబ్స్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే..!

1998 డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అలర్ట్.. జాబ్స్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే..!

కొనసాగుతున్న డీఎస్సీ కౌన్సెలింగ్

కొనసాగుతున్న డీఎస్సీ కౌన్సెలింగ్

డీఎస్సీ (District Selection Committe)కి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వం ఎక్క‌డా కొత్త పోస్టుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఇటీవ‌ల కాలంలో టెట్‌ (Teacher Eligibility Test) రాసిన అభ్య‌ర్థులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P Ramesh, News18, Kakinada

  డీఎస్సీ (District Selection Committe)కి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వం ఎక్క‌డా కొత్త పోస్టుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఇటీవ‌ల కాలంలో టెట్‌ (Teacher Eligibility Test) రాసిన అభ్య‌ర్థులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ డీఎస్సీ ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డంతో నిరుద్యోగుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం 1998 డీఎస్సీలో గ‌తంలో సెలెక్ట్ అయ్యి పోస్టురాని వారు అప్ప‌టి నుండి ఎదురుచూపులు చూస్తునే ఉన్నారు. దీనిపై కోర్టు కేసులు ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం 1998 డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న పోస్టులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అక్క‌డి నుండి మొద‌లైన ఇంట‌ర్వ్యూలు నేటికి కొన‌సాగుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీ జ‌రిగింది. తాజాగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ప‌లు జిల్లాల్లో ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

  ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో 1998 డీఎస్సీలో ఎస్జీటీ పోస్టుల‌కు ఆన్‌లైన్ ద్వారా ఎంపికైన వారు ధృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు హాజ‌రుకావాల‌న్నారు. ఇందుకోసం 560 మంది జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఈనెల 6,7వ తేదిల్లో ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను కాకినాడ‌లోని పీ.ఆర్‌. ప్ర‌భుత్వ బాలికోన్న‌త పాఠ‌శాల‌లో ఏర్పాటు చేశారు. పైన ప్ర‌క‌టించిన తేదిల్లో ఉద‌యం 9 గంట‌ల నుండి ధృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌న్నారు.

  ఇది చదవండి: ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికేట్‌లు పెట్టారు..! అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు..!

  షెడ్యూల్ఇదీ..

  1 నుండి 300 వ‌ర‌కూ అభ్య‌ర్థులు 6వ తేదిన ( హాల్ టిక్కెట్ నెం.4100047 నుండి 4102488 వ‌ర‌కూ) గ‌ల వారు హాజ‌రుకావాలి.సీరియ‌ల్ నెం.301 నుండి 560 వ‌ర‌కూ గ‌ల వారు, 7వ తేదిన హాల్‌టిక్కెట్ నెం.4102489-4105490 వ‌ర‌కూ) హాజ‌రుకావాల్సి ఉంటుంది. వీరి వెంట ఆన్‌లైన్ తీసుకున్ కాపీని స‌బ్మిట్ చేయాలి.

  ఇది చదవండి: అనాథలకు ఆపద్భాందవుడు..! ఈ యువకుడు చేస్తున్న పనికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!

  అభ్యర్థులు సబ్ మిట్ చెయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..!

  1998 డీఎస్సీలో సెలెక్ట్ అయ్యి, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థులు సెల‌క్ష‌న్ ప్రోసిజ‌ర్‌లో స‌ర్టిఫికెట్స్ వెరిఫికేష‌న్ కోసం వెంట తీసుకెళ్లాల్సిన ప‌త్రాలను అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు. వాటిలో ఆధార్‌కార్డు, డీఎస్సీ ఇంట‌ర్వ్యూ లెట‌ర్, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు-3, ఆన్ లైన్ రిఫ‌రెన్స్ నెం జిరాక్స్ కాపీ, హాల్‌టిక్కెట్ కాపీ, కుల‌ధృవీక‌ర‌ణ ప‌త్రం(ఎస్టీ,ఎస్సీ,బీసీ), అకాడ‌మిక్ స‌ర్టిఫికెట్‌(టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ, పీజీ, ఆపైన‌), ప్రొఫెష‌న‌ల్ క్వాలిఫికేష‌న్‌(డి.ఎడ్‌, బి.ఎడ్‌), నివాస‌ధృవ‌ప‌త్రం, ఏజెన్సీ ప్రాంత వాసులైతే అక్క‌డి నివాస‌ప‌త్రం,ఎక్క‌డైనా ప‌నిచేసిన అనుభ‌వం స‌ర్టిఫికెట్‌ల జిరాక్స్‌ల‌ను ఒక్కొక్క‌టి మూడు చొప్ప‌న కాపీల‌ను తీసుకెళ్లాలి. అభ్య‌ర్థుల‌కు ఏమైనా సందేహాలుంటే www.deoeg.org వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

  ఇది చదవండి: ఆ జిల్లాలో ఆర్టీసీ బస్సెక్కాలంటేనే హడలిపోతున్న జనం.. అంతగా భయపెట్టిన విషయం ఏంటంటే..!

  హాజ‌రుశాతంపై అనుమాన‌మే

  దాదాపుగా 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత 1998 డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు పోస్టింగ్‌లు రావ‌డంతో హాజ‌రుశాతం పూర్తిగా ఉంటుందా అనేది స్ప‌ష్ట‌తలేదు. దాదాపు ఇందులో చాలా మంది అభ్య‌ర్థులు ఇత‌ర ఉద్యోగాల్లో స్థిర‌ప‌డిపోయారు. కొంత మంది ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాక‌పోవ‌డంతో ఇందులో సెలెక్ట్ అయిన వారు కొంత మంది తెలంగాణా వాసులు కూడా ఉన్నారు. పోస్టుల సంఖ్య‌ను బ‌ట్టి ఇక్క‌డ వారికే అవ‌కాశం ఉన్న‌ట్లైయితే, జిల్లాల వారిగా ఇంట‌ర్వ్యూలు జ‌రుగుతున్నందున తెలంగాణా నుండి రాసిన వారికి అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌చ్చు.

  వీరిలో కొంత మంది అభ్య‌ర్థులు మృతిచెందారు కూడా. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్ర‌క్రియ ముగిసేనాటికి ఏం మార్పులు తీసుకొస్తార‌నేది కూడా వేచి చూడాలి. మ‌రోప‌క్క కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నియామ‌కాలు జ‌ర‌ప‌డంతో చాలా మంది అభ్య‌ర్థులు డీఎస్సీ ఎంపిక‌పై ఆస‌క్తి క‌న‌బ‌రచ‌డం లేద‌ని అంటున్నారు. మొత్తం మీద సుదీర్ఘ కాల‌పు నిరీక్ష‌ణ‌కు కొత్త‌మార్గం చూప‌డం టీచింగ్ ఫీల్డ్‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారికి మాత్రం స‌దావ‌కాశ‌మ‌నే చెప్పాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, East godavari, Local News

  ఉత్తమ కథలు