హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

East Godavari: అక్కడ ఎక్కడ తవ్వినా ఉప్పునీరే..! పంటపొలాలు కూడా ఉప్పుమేటలవుతున్నాయి..! కారణం ఏంటంటే?

East Godavari: అక్కడ ఎక్కడ తవ్వినా ఉప్పునీరే..! పంటపొలాలు కూడా ఉప్పుమేటలవుతున్నాయి..! కారణం ఏంటంటే?

అక్కడ

అక్కడ ఎక్కడ చూసినా ఉప్పు నీరే

East Godavari: ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో వ‌ర‌ద‌లు వణికిస్తే.. ఊహించ‌ని స్థాయిలో స‌ముద్ర కెర‌టాలు అక్కడ వాసుల్ని మరింత అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ముఖ్యంగా సుదీర్ఘతీర ప్రాంతాల్లో ఈ ప‌రిస్థితి నిత్యకృత్యం అవుతోంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా ఉప్పు నీరే వస్తుండడం కలవర పెడుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  P Ramesh, News18, Kakinada

  ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో వ‌ర‌ద‌లు వణికిస్తే.. ఊహించ‌ని స్థాయిలో స‌ముద్ర కెర‌టాలు (Sea Wave) అక్కడ వాసుల్ని మరింత అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ముఖ్యంగా సుదీర్ఘతీర ప్రాంతాల్లో ఈ ప‌రిస్థితి నిత్యకృత్యం అవుతోంది. పాత ఉమ్మడి జిల్లా ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా (Konaseema District) లో తీరం విరుచుకుప‌డుతోంది. ఒక‌సారి స‌ముద్రం వెనక్కి వెళ్లి భ‌య‌కంపితుల‌ను చేస్తే, మ‌రోసారి ఊహించ‌ని విధంగా కెరటాలు దూసుకొస్తున్నాయి. ఈ ప్రభావంతో స‌ముద్రపునీరు నేరుగా పంట పొలాల్లోకి వ‌చ్చేస్తుంది. సోడియం ప్రభావ‌పు నీటితో పంట‌లు నాశ‌న‌మ‌వుతున్నాయి. పొలాల‌తోపాటు అక్కడ ప్రాంతంలో ఉన్న మంచినీటి చెరువులు పూర్తిగా ఉప్పునీటి చెరువుల‌గా మారిపోతున్నాయి. ఇసుక‌లోకి ఇంకుతున్న నీటితో అక్కడ బావులు త‌వ్వితే చాలు ఉప్పునీరు వ‌స్తోంది. స్థానిక ప్రజ‌లు మంచినీరు తాగాలంటే చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌క్క ప్రాంతాల నుండి మంచినీటిని తెచ్చుకోవాల్సి వ‌స్తోంది.

  రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంతర్వేది, కేశవదాసుపాలెం, అంతర్వేదికర గ్రామాల్లోని తీర ప్రాంతంలో సముద్రం పోటు ఉదృతంగా ఉండటంతో కెరటాలు ఎగసిపడి ఉప్పునీరు సరుగుడు తోటల్లోకి దూసుకొస్తుంది. స‌రుగుడు తోట‌ల్లో ఇసుక పేరుకుపోయి, అంత‌ర పంట‌లు వేయ‌డానికి కూడా వీలు కావ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రోప‌క్క ఆప్రాంత రైతులు పోటు నీరు రాకుండా ఇసుకతో అడ్డుకట్టలు వేస్తున్నారు.

  త‌వ్వకాలతోనే పెను ముప్పు..!

  స‌ముద్రతీరంలోని ఉండే పెద్ద పెద్ద ఇసుక దిబ్బల‌ను త‌వ్వుకుపోవ‌డంతో నేరుగా స‌ముద్రపునీరు పొలాల్లోకి చేరుతుంది. చిన్నపంట‌ కాలువ‌ల్లోకి ఉప్పు నీరు చేర‌డంతో ఆ నీటిని పంట‌ల‌కు ఉప‌యోగించ‌డంతో పంటలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వడం లేదు. ఆర్థికంగా రైతులు తీవ్రంగా న‌ష్టపోతున్నారు. పెట్టుబ‌డి పెట్టిన‌ప్పటికీ పంట‌లు పండ‌టం లేదు.

  ఇదీ చదవండి : ఏడాదికోసారి మాత్రమే దర్శన భాగ్యం..! అందుకే అస్సలు మిస్‌ కావద్దు..!

  కేవ‌లం ఉప్పునీరు ఎక్కువ‌గా రావ‌డంతో ఎరువులు వేసినా పంట ఫ‌లితాన్ని ఇవ్వడం లేద‌ని చెబుతున్నారు. నేరుగా ఉప్పునీరు నురుగ‌తో పాటు చేరి పొలాల్లో వెళ్లడంతో అక్కడ ఉప్పుమేట‌లు కూడా వేయ‌డంతో పొలాలు బీడుగా మారిపోతున్నాయి. ఉప్పు మేట‌లు వేయ‌డంతో మొక్కలు పెలుసు బారీ పోయి పంట ఎండిపోయిన స్థితికి వ‌చ్చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో పంట చుట్టు నీరు చేరిపోయి అలాగే ఉండిపోవ‌డంతో నీరున్నా పంట ఎదుగుద‌ల లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు రైతులు.

  ఇదీ చదవండి : ఆ ఆలయంలో కొబ్బరికాయ కొట్టకూడదు..? ఏం చేస్తారో తెలుసా..?

  శాశ్వత ర‌క్షణ చ‌ర్యలేవి..!

  స‌ముద్రపునీరు ముంచుకొస్తుంటే శాశ్వత ర‌క్షణ చ‌ర్యలు తీసుకోవ‌డంలో మినిమేషాలు లెక్కిస్తున్నారు అధికారులు. ఎన్నిసార్లు స్థానికులు చెప్పినా ప‌ట్టింపు లేదు. క‌నీసం ఇసుక దిబ్బల‌ను కూల్చే వారిపైనా చ‌ర్యలు తీసుకోవ‌డం లేదు. స్థానికంగా ఉండే రాజ‌కీయ నేత‌ల ప్రాబ‌ల్యంతో ఇక్కడ ఇసుక దందాను క‌ట్టడి చేయ‌లేక‌పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇసుక‌ను య‌థేచ్ఛగా త‌ర‌లింపు చేయ‌డంతో ఇక్కడ త‌వ్వకాల‌కు పూర్తిగా స్థానిక నాయ‌కులే మ‌ద్ధతిస్తున్నట్లుగా క‌నిపిస్తోంది.

  ఇదీ చదవండి : కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు , బాలయ్య.. అమరావతికి అమ్మవారి అండ..

  అధికారులు స్పందించి ఉప్పునీటి వేగాన్ని ఆప‌క‌పోతే భ‌విష్యత్తులో ప‌రిస‌ర ప్రాంతాలన్ని ఉప్పునీటికి బ‌లికాక త‌ప్పద‌ని గోదావరి వాసులు ఆందోళన చెందుతున్నారు. మ‌రి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Local News

  ఉత్తమ కథలు