(Ramesh, News18, East Godavari)
సమాజంలో చాలా మంది వారి వ్యక్తిగత విధానం ప్రకారంగా చూస్తే అవార్డుల కోసం గాని, ప్రచారం కోసం గాని పట్టించుకోరు. వారు అనుకున్నది చేయాలనే తపన తప్పితే పబ్లిసిటీ చాలా దూరంగా ఉంటారు. కానీ అనూహ్యంగా వారికంటూ ఓ అవార్డు వస్తే అది ఎంత గొప్పదో, ఏలా ఉంటుందో కూడా తెలియదు.
పెద్దలు అవార్డు ఇచ్చారు మనం తీసుకున్నామంతే. ఇలా చాలా మంది వారి వ్యక్తిగత జీవితంలో గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారిలో ఇటీవల పద్మ అవార్డు పొందిన సంకురాత్రి ఫౌండేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్. ఆయనకు పద్మ అవార్డు ఇంత గొప్పగా ఉంటుందా అనేది తీసుకునే వరకు తెలియదంటే నమ్మరు.
తనకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని కాకినాడ నగర ప్రజలకు అంకితం చేస్తున్నట్లు కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించి కాకినాడ చేరుకున్న నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖులు ఆయనకు భారీగా స్వాగతం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అచ్చంపేట సెంటర్ నుండి ఏపీఎస్పీ భానుగుడి మీదుగా శ్రీనగర్ లో ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రి వరకు భారీ ఎత్తున ర్యాలీతో ఆయనను ఊరేగించారు. భానుగుడి కిరణ్ కంటి ఆసుపత్రిలో ఆయన భార్య, పిల్లల చిత్రపటాలకు నివాళులర్పించారు.
అంతకు ముందు సివిలియన్ సొసైటీ ఆధ్వర్యంలో 200 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జేఎన్‌టియు ఉపకులపతి ప్రసాద్ రాజు నేతృత్వంలో వర్సిటీ అధ్యాపకులు, అధికారులు చంద్రశేఖర్‌ను ఘనంగా సత్కరించారు. సందర్భంగా సెయింట్ ఆంటోనీ విద్యార్థిని విద్యార్థులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.
అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు లభించిన ఈ అత్యుత్తమ గౌరవాన్ని కాకినాడ నగర ప్రజలకు, కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యరకు సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇది 32 ఏళ్ల కృషి వల్ల వచ్చిన అవార్డుగా ఆయన కొనియాడారు.
పద్మశ్రీ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మేయర్, కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్ లతోపాటు పెద్ద ఎత్తున నగర ప్రముఖులు, కిరణ్ కంటి ఆసుపత్రి మెడికల్ డైరక్టర్ డాక్టర్ అవినాష్ మహీంద్రకర్, శివరామకృష్ణ, శాంత, విజయలక్ష్మీ, షర్మిల తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News