హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తూర్పుగోదావరి జిల్లాలోని ఒకే ఒక్క రైల్వే జంక్షన్..!‌ వంతెన కూలి మూడేళ్లయ్యింది.. ! కానీ, ఇప్పటికీ..!

తూర్పుగోదావరి జిల్లాలోని ఒకే ఒక్క రైల్వే జంక్షన్..!‌ వంతెన కూలి మూడేళ్లయ్యింది.. ! కానీ, ఇప్పటికీ..!

మూడేళ్లుగా

మూడేళ్లుగా పురోగతికి నోచుకోని సామర్లకోట వంతెన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు (AP Welfare Scheme) మాటేమో కానీ, అభివృద్ధి ప‌నుల విష‌యంలో మాత్రం నత్తనడకన సాగుతున్నట్లుగా ఉంది ప‌రిస్థితి. ఇందుకు ఉదాహర‌ణే కాకినాడ జిల్లా (Kakinada District) లోని సామ‌ర్లకోట వంతెన ప‌రిస్థితి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P Ramesh, News18, Kakinada

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు (AP Welfare Scheme) మాటేమో కానీ, అభివృద్ధి ప‌నుల విష‌యంలో మాత్రం నత్తనడకన సాగుతున్నట్లుగా ఉంది ప‌రిస్థితి. ఇందుకు ఉదాహర‌ణే కాకినాడ జిల్లా (Kakinada District) లోని సామ‌ర్లకోట వంతెన ప‌రిస్థితి. మూడేళ్లుగా గ‌డిచిపోయి ముచ్చట‌గా నాల్గవ ఏడాదిలోకి చేరింది వంతెన క‌థ‌. తూర్పుగోదావ‌రి జిల్లాలో సామ‌ర్లకోట ఒక్కటే రైల్వే జంక్షన్. కాకినాడ నుండి విశాఖ‌ప‌ట్నం, అటు నుండి విజ‌య‌వాడ మీదుగా రాజ‌మండ్రి నుండి విశాఖ వెళ్లే రైళ్లన్ని దాదాపుగా సామ‌ర్లకోట‌లోనే ఆపుతారు. ముఖ్యంగా సామ‌ర్లకోట‌-పిఠాపురం మీదుగా వంద‌లాది గ్రామాల ప్రజ‌లకు మార్గం ఈ ఒక్క వంతెన మార్గమే. బ్రిటీష్ కాలం నుండి ఏలేరు న‌దిపై ఉన్న ఈ వంతెన నుండి గ‌తంలో మ‌హారాజులు కూడా ప్రయాణం చేసేవార‌ట‌. అలాంటి వంతెన‌కు కాలం చెల్లిపోవ‌డంతో దాదాపుగా మూడేళ్లు పూర్తయ్యింది. కాని ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఇక్కడ ప‌నుల గురించి మాత్రం ప‌ట్టించుకోలేదు.

  నిధులే పెద్ద స‌మ‌స్య..!

  సామ‌ర్లకోట వంతెన‌కు దాదాపుగా రూ.2 కోట్లు కేటాయించారు. అయితే క‌రోనా ప్రభావంతో కొంత కాలం ప‌నులు ఆపేశారు. ప‌నులు ద‌క్కించుకున్న కాంట్రాక్టరు కూడా మ‌ధ్యలో ప‌ని వ‌దిలిపెట్టారు. మ‌ర‌లా కొత్త కాంట్రాక్టర్‌ను వెతికేట‌ప్పటికీ పుణ్య కాలం కాస్త అయ్యిపోతుంద‌న్న విమ‌ర్శలొస్తున్నాయి. ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు స‌కాలంలో బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య ఏర్పడింద‌ని అంటున్నారు.

  ఇది చదవండి: నేలకూలే చెట్లకు ప్రాణం పోస్తున్నారు.. ఏకంగా బండరాళ్లతో వారధి కట్టేస్తున్నారు

  ఆ వంతెన మీదుగా రైతులు ధాన్యం తీసుకెళ్లాలి. వ్యాపారులు నిత్యం వెళ్లాలి ఉండటంతో కొంత కాలం కింద వారంతా డ‌బ్బులు వేసుకుని తాత్కాలికంగా వంతెన‌ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం కూలిపోయిన వంతెన ప‌క్కనే మ‌ట్టివేసుకుని రోడ్డు మార్గంలా త‌యారు చేశారు. అయితే చిన్నపాటి వాహ‌నాలు, రైతులు న‌డిచేందుకు మాత్రమే ఆ మార్గం ఉప‌యోగ‌ప‌డుతోంది. వ‌ర్షం వ‌స్తే మాత్రం ఆ మార్గం గుండా వెళ్లేందుకు కూడా అవ‌కాశం లేదు. తాజాగా ఇటీవ‌ల కాలంలో ప‌నులు పునఃప్రారంభ‌మ‌యిన‌ప్పటికీ అవి ఎప్పుడు పూర్తవుతాయ‌నేది స్పష్టత లేదు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Local News

  ఉత్తమ కథలు