Home /News /andhra-pradesh /

EAST GODAVARI REBEL STAR KRISHNAM RAJU STATUE MADE BY KONASEEMA SCULPTURE FULL DETAILS HERE PRN KKD NJ

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుకు ప్రాణం పోసిన శిల్పి..! రాజసం ఉట్టిపడేలా విగ్రహ తయారీ..!

కోనసీమలో

కోనసీమలో సిద్ధమైన కృష్ణంరాజు విగ్రహం

కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు (Krishnam Raju) మరణించి 11 రోజులు అయిన సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు నివాళులర్పించారు. సజీవరూపం నిత్యం తమ కళ్ల ముందు ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు కుటుంబసభ్యులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Amalapuram, India
    P.Ramesh, News18, Kakinada కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు (Krishnam Raju) మరణించి 11 రోజులు అయిన సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు నివాళులర్పించారు. సజీవరూపం నిత్యం తమ కళ్ల ముందు ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు కుటుంబసభ్యులు. ఇంతకీ కృష్ణంరాజు విగ్రహానికి ప్రాణం పోసిన శిల్పి ఎవరో తెలుసా..! సినీ న‌టులకున్న క్రేజ్ అంటే మాములుగా ఉండ‌దు. నేటి త‌రం నటుల‌కంటే పాత త‌రం న‌టుల‌కున్న అభిమానుల సంఖ్య కోకొల్లలు. అలాంటి వారిలో ఇటీవల కాలం చేసిన రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఒక‌రు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో ఎంతో అనుబంధం ఉన్న ఆయ‌న, ఇదే ప్రాంతంలో ఎన్నో సినిమాలు తీశారు. ఆయ‌న న‌ట‌నే ఓ అద్భుతం. అందుకే ఆయ‌న చ‌నిపోయినా ఇక్కడి వాళ్లు ఆయ‌నతో ఉన్న జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు. కృష్ణంరాజు చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న ద‌శ‌దిన క‌ర్మకు ఓ విగ్రహాన్ని త‌యారు చేయాల‌ని కుటుంబ‌స‌భ్యులు కోరార‌ట‌.. అందులోనూ ఆయ‌న జీవం ఉట్టిపడేలా విగ్రహం త‌యారు చేయాలంటే.. విగ్రహాలు చేయడంలో అందె వేసిన శిల్పి అయ్యి ఉండాలి. అలాంటి శిల్పకారుడి కోసం వెతుకుతున్న వాళ్లకు కోనసీమ జిల్లాలో వడియార్‌ సంగతి తెలిసింది. వెంటనే అతన్ని అప్రోచ్‌ అయ్యి తమకు కావల్సిన విధంగా విగ్రహాన్ని తీర్చిదిద్దే భాద్యతలను అప్పగించారు.

    ఇది చదవండి: కృష్ణంరాజు రాజకీయ వారసుడు అతడేనా.. ప్రభాస్ పొలిటికల్ ఇంట్రీ ఇస్తాడా..?

    ఎంతో ఫేమ‌స్ నటుడు, రాజకీయాల‌తో సంబంధాలు వెర‌సి కృష్ణంరాజు గాంభిర్యం, ఆయ‌న ముఖంలో తేజ‌స్సు ఇలా ఎక్కడా త‌గ్గకుండా విగ్రహం ఉండాల‌నేది ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కోరిక‌. కొత్తపేట‌కు చెందిన శిల్పి వ‌డియార్‌. ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు త‌యారు చేసిన ఘ‌న‌త ఈయనది. అందుకే కృష్ణంరాజు విగ్రహాం త‌యారీ ప‌నుల‌ను ఈయ‌న‌కు అప్పగించారు. ఆరు రోజుల‌ పాటు శ్రమించిన వ‌డియార్ ఫైబ‌ర్‌తో కృష్ణంరాజు విగ్రహాన్ని త‌యారు చేశారు. అనంతరం రంగులు అద్ది సజీవ రూపం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.

    ఇది చదవండి: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

    కృష్ణంరాజును బ‌తికి ఉన్నట్లే ఉందని ఆ విగ్రహాన్ని చూసిన అభిమానులు చెబుతున్నారు. ఆయ‌న తేజ‌స్సు, అందం ఇవ‌న్ని ఏ మాత్రం చెదరకోడదని..చాలా జాగ్రత్తగా ఈ విగ్రహాన్ని రూపుదిద్దిన‌ట్లు వ‌డ‌యార్ చెప్పుకొచ్చారు. జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన కృష్ణంరాజు విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు పంపించారు. ఆ విగ్రహానికే ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళురర్పించారు. కృష్ణంరాజు స్వగ్రామం మొగల్తూరులో జ‌రిగే సంస్మరణ సభ కార్యక్రమానికి సంబంధించి, అక్కడకు పంపించేందుకు కూడా మ‌రో విగ్రహాన్ని త‌యారు చేస్తున్నట్లు శిల్పి వ‌డియార్ వివ‌రించారు. కృష్ణంరాజు మరణాన్ని ప్రభాస్, అతని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. అభిమానులే కుంగిపోతే.., కుటుంబసభ్యులకు కోలుకోడానికి మరింత సమయం పడుతుంది. అయితే.., ఇప్పుడు కృష్ణంరాజు కుటుంబసభ్యులు అందరూ సెప్టెంబర్ 28న మొగల్తూరుకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ కృష్ణంరాజు సంస్మరణ సభను నిర్వహించబోతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kakinada, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు