Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను రోడ్డు ప్రమాదాలు (Road Accidnets) భయపెడుతున్నాయి. ఇటీవల నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎంత అవగాహన కల్పిస్తున్నారు.. ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) కఠినంగా అమలు చేస్తున్నారు.. కొన్ని చోట్ల అధికారులు, పాలకుల నిర్లక్షం.. మరికొన్ని చోట్ల మానవ తప్పిదాలతో ప్రమాదాలు భయపెడుతూనే ఉన్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా (Parvatipuram Manyam District) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. కొమరాడ మీదుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఆరుగురూ చనిపోయారు.
వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చోళ్లపదం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటోలో ఉన్న ప్రయాణికులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
లారీ వస్తున్న వేగానికి ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొమరాడ మండలం అంటివాస గ్రామానికి చెందిన వారంతా అదే మండలానికి చెందిన తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లారు. తరువాత వారందరూ తిరిగి ఆటోలో వస్తున్నారు.
ఇదీ చదవండి : మీసం మెలేస్తూ నారా లోకేష్ సవాల్.. నడి రోడ్డుపై ఊరేగిస్తామంటూ మాస్ వార్నింగ్
ప్రమాదానికి అతి వేగమే కారణం అంటున్నారు. వివాహ వేడుక నుంచి వస్తున్న మార్గం మధ్యలో విశాఖ నుంచి రాయ్ గఢ్ వెళ్తోన్న లారీ అతి వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో తునాతునకలైంది. ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథిమికంగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ తోపాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి : గవర్నర్ కు సీఎం జగన్ పాదాభివందనం.. నేడు ఏపీకి కొత్త గవర్నర్
కేవలం లారీనే కాదు ఆటో కూడా అతి వేగంగానే వెళ్తున్నట్టు గుర్తించారు. డ్రైవర్లు అతి వేగం, నిర్లక్ష్యంతోపాటు ఇరువైపులా తప్పు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Road accident, Visakhapatnam