P Ramesh, News18, Kakinada
మానవుని జీవితం….నీటి మీద బుడగవంటింది. పుట్టింది మెుదలు మరణించే వరుకు అవిశ్రాంతగా నిత్యం ఏదో సాధించాలని తపనతో పరుగెడుతుంటాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కరువైంది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మనశాంతి. ఇలా ప్రతి ఒక్కరికి తమ తమ సమస్యలతో నిత్యం బాధపడుతుంటారు. కుటుంబం, ఉద్యోగం.., అంటూ మనిషి తన సగ జీవితాన్ని ఖర్చు చేసినా.., ఆనందాన్ని ఏ మాత్రం పొందలేక పోతున్నాడు. కారణం.. తన గురించి తాను ఆలోచించుకునేంత బిజీ లైఫ్ మరియుఆధ్యాత్మికత కొరవడటం…ఈ కారణంగా మనిషి అటు కుటుంబానికి, ఇటు సమాజానికి దూరమై ఒంటరిగా జీవితాన్ని ముగిస్తున్నాడు. ఖచ్చితంగా ఇటువంటి సందర్భంలోనే చాలా మంది ఆధ్యాత్మికతను,ప్రశాంతను కోరుకుంటారు.
మరికొంతమంది కుటుంబ బాంధవ్యాలను వదిలి దేశ సంచార యాత్ర చేస్తుంటారు. ఇలాంటి ఏకసంచారుల కోసం మన పూర్వీకులు కొన్ని మఠాలను ఏర్పాటు చేసేవారు.అలా రూపుదిద్దుకున్నదే రామకృష్ణ మిషన్.దీనినే రామకృష్ణ మఠంగా కూడా పిలుస్తారు.మే 1, 1897 పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బేలూరు కేంద్రంగా ఈ సంస్థ స్థాపించబడింది.రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకుడైన రామకృష్ణ పరమహంస చేసే బోధనలకు ఈ పీఠం మూలం.
స్వామి వివేకానంద అడుగుజాడల్లో
రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద మార్గదర్శకాలతో నడిచే రామకృష్ణ మిషన్ లో అంతా ఆధ్యాత్మిక భావనలే ఉంటాయి. సన్యాసులకు ముఖ్య కేంద్రంగా చెప్పుకునే ఇక్కడ ప్రాంతంలో ప్రశాంతత దొరుకుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్నటువంటి రామకృష్ణ మఠం చాలా అద్భుతం మైన ఓ ప్రశాంతత గల ప్రాంతమని చెప్పాలి. కోరుకొండ రోడ్డులో గల ఈ మఠంలో పూల తోట నిర్వహణ, జంతువుల పెంపకం జరుగుతుంది.
ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు
వీటితోపాటు విద్యార్థులకు విద్య , నిత్యం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇక్కడ కేంద్రంలో రామకృష్ణ పరమహంస విగ్రహం వద్ద నిత్యం ధ్యానం చేసుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ వాతావరణం ప్రశాంతతకు చిరునామాగా ఉంటుంది.మనసు బాగోలేనప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి సేద తీరుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Rajahmundry