Home /News /andhra-pradesh /

EAST GODAVARI RAKSHA BANDHAN SPECIAL ONE BROTHER IN WHO MADE THE IDOL OF THE SISTER IN KAKINADA NGS

Raksha Bandhan: అన్న ప్రేమకు నిదర్శనం ఇది.. విధి మనుషులనే విడదీస్తుంది.. బంధాన్ని కాదు

అన్నా చెల్లి బంధానికి నిదర్శనం ఇది

అన్నా చెల్లి బంధానికి నిదర్శనం ఇది

Raksha Bandhan: రాఖీ పండుగ వచ్చింది అంటే.. అన్నా చెల్లి సంబరాలు చేసుకునే వారు.. రోజంతా కలిసే వేడుకలు చేసుకునే వారు.. కానీ అనూహ్యంగా ఆ అందమైన బంధంపై విధి కన్ను కుట్టింది. అయితే మనుషులను విధి అయితే వీడతీసింది కానీ.. తమ బంధాన్ని మాత్రం కాదు అంటున్నాడు అన్నయ్య.. అందుకు ఏం చేసాడో చూడండి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Raksha Bandhan: ఆ అన్నా చెల్లిది విడదీయలేని బంధం.. రోజూ ఎలా ఉన్నా.. ముఖ్యంగా రాఖీ పండగ (Raksha Bandhan) వ‌చ్చిందంటే ఆ ఇంటిలోని వారంద‌రికి నిజ‌మైన పండ‌గ. అన్నా చెల్లి (Brother and Sister).. ఇద్దరూ ఒక చోట‌కి చేరి ఆనందంగా గ‌డిపేవారు. ఇతర పండుగుల సంగతి ఎలా ఉన్నా.. వారు రక్షా బంధన్ ను మాత్రమే పెద్ద పండుగగా చేసుకునే వారు.. అలా ప్రతి ఏడాది రక్షా బంధన్ ను.. ఎంతో అనందంగా జరుపుకునే వారి ఆనందంపై విధి కన్ను కుట్టింది. అనూహ్య ఘ‌ట‌న వారిని ర‌క్షా బంధ‌న్ నుండి వీడ‌దీసింది. ఊహించని ప్ర‌మాదం (Accident) లో చెల్లి చ‌నిపోయింది. ఆమె దూరమై 7 నెల‌లు కావ‌స్తోంది. అప్పటి నుంచి ఆ ఇంటిలో ఆనందమే దూరమైంది.. అప్పటి వరకు ఉన్న సంతోషాలన్నీ మాయమైపోయాయి. దీంతో దిగ‌మింగుకోలేని బాధ‌, చెల్లి దూర‌మైంద‌న్న ఆవేద‌నతో ఆ కుటుంబం కోలుకోలేక‌పోయింది. ఆ బాధ వెంటాడుతున్న సమయంలోనే.. అన్న-చెల్లెల బంధాన్ని గుర్తు చేసే రక్షాబంధ‌న్ పండుగ వ‌చ్చింది. ఎప్పటిలా రాఖీ కట్టేందుకు కళ్ల ముందు చెల్లి లేదు.. అతడి కళ్ల ముందు ఆ బాధే కనిపిస్తోంది. దీంతో ఆ బాధ‌ను దిగ‌మింగుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించారు. చెల్లి మళ్లీ ఇంటిలో ప్ర‌త్య‌క్ష‌మైతే.. ఇంట్లో సంతోషం ఉంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో ఏం చేశారంటే..?

  కాకినాడ జిల్లా శంఖ‌వ‌రం మండ‌లం క‌త్తిపూడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల మ‌ణి చాలా యాక్టివ్ గా ఉండేది. ఏడు నెల‌ల క్రితం ప్ర‌మాదంలో మృతి చెందింది. ఆమె వివాహితురాలు. భ‌ర్త.. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో కుంగిపోయిన అన్న‌ శివ‌, త‌మ్ముడు రాజా, అక్క వ‌ర‌ల‌క్ష్మీల‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. చ‌నిపోయిన మ‌ణి విగ్ర‌హాన్ని త‌యారు చేయించారు.

  అలా రూపొందించిన విగ్రహంతో గ్రామ‌మంతా ర్యాలీ చేసి పండుగ చేశారు. అక్క వ‌ర‌ల‌క్ష్మీతో అన్నయ్య తమ్ముడు రాఖి క‌ట్టించుకోవ‌డ‌మే కాకుండా, ఆమె ద్వారా మరో సోదరి ప్ర‌తిమ‌ రూపంతోనూ రాఖీ క‌ట్టించుకున్నారు. ప్ర‌తీయేటా విగ్ర‌హం ద‌గ్గ‌రే రాఖీ వేడుక‌లు చేస్తామ‌న్నారు మృతురాలు మ‌ణి సోద‌రులు.  ఇదీ చదవండి : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికారం ఏ పార్టీది? ఎవరికి ఎన్నిఅసెంబ్లీ సీట్లు

  రక్షాబంధన్ కు ఉండే ప్రత్యేక అది.. అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని.. విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు.

  ఇదీ చదవండి : అక్కాచెల్లెళ్లకు లోకేష్ కానుక ఇదే.. కారు కొనాలంటే బ్రాహ్మణి ఫైనాన్స్ చేయాలా..

  ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. అనడానికి ఈ అన్నా చెల్లెల్లే బంధమే ఒక ఉదహరన.. కేవలం చెల్లి రూపాన్ని విగ్రహం రూపంలో తయారు చేయడమే కాదు.. మరే ఆడపడుచుకూ ఇలాంటి కష్టం రాకూడదంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వాహనం నడిపేటప్పడు చున్నీ లేద చీర వెనకాల చక్రం కింద పడకుండా చూసుకోవాలని.. తమ చెల్లి లాంటి ప్రమాదం మరే ఆడపడుచుకూ జరగకూడదంటూ.. ఫ్లెక్సీలో రాశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Kakinada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు