హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kakinada: రైలు పట్టాలపై సినిమాటిక్ సీన్.. నిజంగా నువ్వు దేవుడు సామీ

Kakinada: రైలు పట్టాలపై సినిమాటిక్ సీన్.. నిజంగా నువ్వు దేవుడు సామీ

X
కాకినాడ

కాకినాడ జిల్లాలో తల్లీబిడ్డలను కాపాడిన రైల్వే కీ మ్యాన్

Kakinada: క‌న్నీళ్ల దుఃఖంతో చావుకు ద‌గ్గ‌ర‌య్యింది. కానీ వారికి భూమి మీద నూకలున్నాయి. పిల్ల‌లు అదృష్ట‌వంతులు. ప్రాణాలు నిలిచాయి అదేలా జ‌రిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada | East Godavari | Andhra Pradesh

P Ramesh, News18, Kakinada

పాపం వారికి ఏం క‌ష్టం వ‌చ్చిందో తెలీదు కానీ నిండు ప్రాణాలు తీసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. క‌నీసం లోకం అంటే తెలియ‌ని చిన్నారుల‌ను వెంట పెట్టుకున్న ఆ తల్లి వారితో కలిసి బలవన్మరణానికి పాల్పడేందుకు సిద్ధమైంది. క‌న్నీళ్ల దుఃఖంతో చావుకు ద‌గ్గ‌ర‌య్యింది. కానీ వారికి భూమి మీద నూకలున్నాయి. పిల్ల‌లు అదృష్ట‌వంతులు. ప్రాణాలు నిలిచాయి అదేలా జ‌రిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. కాకినాడ జిల్లా (Kakinada District) లో గొల్ల‌ప్రోలు మండ‌లంలో ఓ గ్రామానికి చెందిన వివాహిత, త‌న భ‌ర్త‌తో ఉన్న విభేదాల‌తో కాపురానికి వెళ్ల‌లేదు. ఇద్ద‌రు మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొద్దికాలం క్రితం పెద్ద‌లు ఇరువురికి స‌ర్థి చెప్పి ఇంటికి పంపించారు.

మ‌ర‌లా ఏమైందో ఏమో ఆమె తిరిగి అమ్మ‌గారింటికి పిల్ల‌ల‌తో బ‌య‌లుదేరింది. మార్గ మ‌ధ్య‌లో దుర్గాడ రైల్వేగేటు వ‌ద్ద ఆటో దిగి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌తో క‌లిసి ట్రాక్ మీదకు వ‌చ్చేసింది. అదే స‌మ‌యంలో వేగంగా రైలు విశాఖప‌ట్నం (Visakhapatnam) నుండి పిఠాపురం వైపు వ‌స్తోంది. పిల్ల‌ల‌ను చేత ప‌ట్టుకుని ట్రాక్ పై ప‌రుగెడుతున్న త‌ల్లిని గ‌మ‌నించిన పిడుము వెంక‌టేశ్వ‌ర్లు అనే రైల్వే కీ మ్యాన్ వారిని వెంబ‌డించాడు. అనుమానం వ‌చ్చి ఆరాతీయ‌గా చిన్నారులు జ‌రిగిన విష‌యాన్ని చెప్ప‌డంతో షాక్ తిన్నాడు. వెంట‌నే ట్రాక్ పై నుండి పిల్ల‌ల‌ను, త‌ల్లిని త‌ప్పించి, 100 కిఫోన్ చేయ‌డంతో పోలీసులు వ‌చ్చారు. త‌ల్లిని ఓదార్చి కౌన్సిలింగ్ నిమిత్తం కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ కు త‌ర‌లించారు.

ఇది చదవండి: బెజవాడలో బ్లడ్ మాఫియా.. వాట్సాప్ మెసేజ్ తో టోకరా

దుర్గాడ రైల్వేగేటు వ‌ద్ద కీ మ్యాన్‌గా ప‌నిచేస్తున్న పిడుము వెంక‌టేశ్వ‌ర్లు అనే ఉద్యోగిని చేసిన ప‌నికి స్థానికులు, పోలీసులు అభినంద‌న‌లు తెలిపారు. రైల్వే ప‌ట్టాల‌పై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌డ్డ ఆమె దుర్గాడ రైల్వేగేటు వ‌ద్ద ప‌ట్టాల‌పై విశాఖ నుండి విజ‌య‌వాడ వైపు వెళుతున్న సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్తుండ‌టాన్ని గ‌మ‌నించిన రైల్వే కీ మ్యాన్ వెంక‌టేశ్వ‌ర్లు వెంట‌నే వారిని అడ్డుకుని ప‌ట్టాల‌పై నుండి త‌ప్పించాడు. వాస్తవానికి కీమ్యాన్ ట్రాక్ చేక్ చేక్ చేసే ప‌ని మాత్ర‌మే చేయాలి. ఎవ‌రు ఎటు వెళ్లినా అత‌డు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ మాన‌వ‌తా ధృక్ప‌దంతో వారిని కాపాడాడు.కీ మ్యాన్ చూపిన చొర‌వ‌కు రైల్వే స‌హ ఉద్యోగులు సైతం శ‌భాష్ అంటున్నారు.

ఆత్మ‌హత్య‌కు సిద్ధ‌ప‌డ్డ మ‌హిళ వెంట ఉన్న చిన్న పిల్ల‌లు ధీన చూపులు కీమ్యా ను ‌ను క‌దిలించాయి. అత‌డు పిల్ల‌ల‌ను, త‌ల్లిని మీరెవ‌రు, ఇక్క‌డకు ఎందుకొచ్చార‌ని ప్ర‌శ్నించ‌గా, ఆమె స‌మాధానం దాట‌వేసింది. అయితే చిన్న‌పిల్ల‌లు మాత్రం మేం చ‌నిపోతున్నాం. మా నాన్నతో అమ్మ‌కు గొడ‌వ అని చెప్ప‌డంతో కీ మ్యాన్ వెంట‌నే షాక్ తిన్నాడు. వారిని వారించి ట్రాక్ పై నుండి త‌ప్పించాడు. మ‌న‌కెందుకులే అని కీ మ్యాన్ త‌న దారిన పోతే నిండు ప్రాణాలు గాలిలో క‌లిసిపోయేవి. వెంట‌నే అత‌డు డ‌య‌ల్ 100కి కాల్ చేయ‌డం, నిమిషాల్లో పోలీసులు అక్క‌డ‌కు చేర‌కోవ‌డం చ‌క చ‌కా జ‌రిగిపోయాయి.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Kakinada, Local News

ఉత్తమ కథలు