Home /News /andhra-pradesh /

EAST GODAVARI PUBLIC OPPOSING LATERITE MINING IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN KKD NJ

ఉద్రిక్తల నడుమ ప్రజాభిప్రాయసేకరణ..! మైనింగ్ లీజుపై గ్రామస్తుల నినాదాలు, నిరసనలు..!

ప్రత్తిపాడు

ప్రత్తిపాడు లైటరేట్ మైనింగ్ పై వ్యతిరేకత

తూర్పు గోదావ‌రి జిల్లా (East Godavari District) కాకినాడ (Kakinada) స‌మీపంలో ప్రత్తిపాడు మండ‌లం చింత‌లూరు గ్రామంలో మైనింగ్ లీజులుపై అధికారులు త‌ల‌పెట్టిన ప్రజాభిప్రాయసేక‌ర‌ణ‌.. నినాదాలు, నిర‌స‌న‌ల మధ్య జ‌రిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India
  P.Ramesh, News18, Kakinada అక్కడ గ్రామస్తులంతా ఐకమత్యంతో ఒక‌ట‌య్యారు. త‌మ గ్రామానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఎదురొడ్డారు. ఇక్కడ ఉన్న సహజసంపదను తీసుకెళ్తున్నారని తమ గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఆందోళ‌నకు దిగారు. దీంతో అధికారులు సైతం వెనక్కి తగ్గి పర్యావరణానికి గానీ, వాళ్ల గ్రామాలకు గానీ హాని కలిగించమని హామీలు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావ‌రి జిల్లా (East Godavari District) కాకినాడ (Kakinada) స‌మీపంలో ప్రత్తిపాడు మండ‌లం చింత‌లూరు గ్రామంలో మైనింగ్ లీజులుపై అధికారులు త‌ల‌పెట్టిన ప్రజాభిప్రాయసేక‌ర‌ణ‌.. నినాదాలు, నిర‌స‌న‌ల మధ్య జ‌రిగింది. ఒక ప‌క్క సీఎం లిబ‌రేష‌న్ సభ్యులు, వారిని క‌ట్టడి చేసేందుకు మ‌రోప‌క్క పోలీసులు మోహ‌రించ‌డంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. చింత‌లూరులో స‌ర్వే నెం 1లో 54.58 హెక్టారుల్లో లేట్‌రైట్ త‌వ్వకాల‌కు హైద‌రాబాద్‌ (Hyderabad) కు చెందిన మార్లిన్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సంస్థతో పాటు స్వర్ణభార‌తి ఎంట‌ర్ ప్రైజెస్‌లు 20 సంవ‌త్సరాలు త‌వ్వకునేందుకు లీజుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. ఈ సంద‌ర్బంగా కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్టర్ ఇలాక్కియ స‌మ‌క్షంలో కాలుష్య నియంత్ర మండ‌లి, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ నిర్వహించారు.

  ఇది చదవండి: మందు బాబుల గుండె పగిలే దృశ్యాలు..! మద్యం బాటిళ్లను రోడ్డురోలర్‌తో తొక్కించిన పోలీసులు..!

  ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు త‌మ బాధ‌ల‌ను చెప్పుకున్నారు. ఎవ‌రొచ్చినా లేట‌రైట్ త‌వ్వకుంటూ పోవ‌డం త‌ప్పితే త‌మ గ్రామానికి న్యాయం చేయ‌డం లేద‌ని, అభివృద్ధికి ఆమడ దూరంలో తమ గ్రామం ఉందంటూ నిర‌స‌న తెలిపారు. యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని మండిపడ్డారు.

  ఇది చదవండి: శ్మశానాల కబ్జా వెనక ఆ ఎమ్మెల్యే హస్తముందా..? కబ్జారాయుళ్లు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం..!

  గ్రామంలో విలువైన స‌హ‌జ సంప‌ద‌ను దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. క‌నీసం పంచాయ‌తీ అనుమ‌తులు తీసుకోకుండా లీజులు తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. జాయింట్ క‌లెక్టర్ ఇలాక్కియ గ్రామ‌స్తుల ఇబ్బందుల‌ను విన్నారు. దీనిపై తాము సానుకూలంగా ఉన్నామ‌ని ప్రజ‌ల ఇబ్బందులు తొలగిస్తామ‌ని హామి ఇచ్చారు. గ‌తంలోనూ గ‌లీజు వ్యవ‌హారం..! ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న లీజు వ్యవ‌హారాల్లో స్థానికులే బ‌ల‌వుతున్నారు. వేల ట‌న్నుల కొద్ది మైనింగ్ తీసుకుపోతున్న ప్రైవేటు కాంట్రాక్టర్లు, లీజు పూర్తయిన త‌ర్వాత గ్రామాల‌ను బూడిద చేస్తున్నారు. అప్పటికే రోడ్లు, వాతావ‌ర‌ణం పూర్తిగా పాడ‌వ‌డ‌టంతో దానికి త‌గ్గట్టుగా తిరిగి వానిని పునఃవ్యవ‌స్థీక‌ర‌ణ చేయ‌లేక‌పోవ‌డంతో ఆయా గ్రామాల ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంత కాలం కింద‌టే ఇలాంటి వ్యవ‌హారంలో తీవ్ర ఆందోళ‌నలు చేప‌ట్టిన గ్రామస్తులు, తాజాగా కొత్త లీజు దారులతో పోరాటాల‌కు సిద్ధప‌డ‌టం త‌ప్పితే ఫ‌లితం అనేది వేయినోళ్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే అధికారులు ఇచ్చిన హామీలు ఎంత మేర‌కు వీరు ప‌ర్యావ‌ర‌ణం ప్రభావితం కాకుండా ప‌రిస‌ర గ్రామాల అభివృద్ధిపై మాట నిల‌బెట్టుకుంటార‌నేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News

  తదుపరి వార్తలు