హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KA Paul: కేఏ పాల్ కు అనుచురుల షాక్.. అప్పు తిరిగి చెల్లించలేదని కార్లు సీజ్

KA Paul: కేఏ పాల్ కు అనుచురుల షాక్.. అప్పు తిరిగి చెల్లించలేదని కార్లు సీజ్

కేఎల్ పాల్

కేఎల్ పాల్

KA Paul: తన దగ్గర బోలెడు ఆస్తులు ఉన్నాయని.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాధి నేతలు వచ్చి సాయం చేయమంటే రెడీగా ఉన్నాను అంటూ పదే పదే ఆఫర్లు ఇచ్చే .. కేఏ పాల్ కు ఆయన అనుచరులు షాక్ ఇచ్చారు.. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ కార్లు సీజ్ చేశారు..

ఇంకా చదవండి ...

  KA Paul:  తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ (KA Paul) గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. మతాధిపతిగా ఆయన ఫేమస్ (Famous) అయినా.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి.. సోషల్ మీడియాలో మీమ్స్ కు.. ట్రోల్స్ కు కేరాఫ్ గా నిలుస్తున్నారు.  ఈ మధ్య పదే పదే ఆయన అందరికీ ఆఫర్లు కురిపిస్తూ వస్తున్నారు. ఇటు ఆంద్రప్రదేశ్  (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి.. అటు తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) కు.. ఆఫర్లు ఇచ్చారు కూడా.. తనదగ్గర భారీగా ఆస్తులు ఉన్నాయని.. ఇద్దరు సీఎంలలో  ఎవరు వచ్చి సాయం చేయమన్నా తను అందుకు రెడీగా ఉన్నాను అన్నారు. కరోరా కాలంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అటు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కూడా ఆ మధ్య ఆఫర్ చేశారు.. జనసేనను తన ప్రజాశాంతి పార్టీలో కలిపిస్తే పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తాను అంటూ కామెంట్లు కూడా చేశారు. భారీగా నగదు ప్రోత్సాహకం కూడా ప్రకటించారు..  ఇలాంటి ఆఫర్లు ఎన్నో ఆయన దగ్గర ఉన్నాయి. దీంతో పాల్ ఆస్తుల విలువ ఎంత అన్నది ఎప్పుడూ చర్చనీయాంశమే.. అలాంటి ఆయనకు ఆయన అనుచరులే షాక్ ఇచ్చారు..

  కేఏ పాల్ కు చెందిన రెండు కార్లను అనుచరుడు రత్నాకర్ సీజ్ చేశారు.. అది కూడా తాను కేఎ పాల్ కు భారీగా డబ్బు అప్పుగా ఇచ్చానని.. కానీ ఇప్పటి వరకు ఆ అప్పు తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాకీ తీర్చమని అడిగితే.. బెదిరిస్తున్నారు అన్నది రత్నాకర్ వాదన.. అందుకే ఆ డబ్బు వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో పాల్  కు చెందిన రెండు కార్లను  అతడు సీజ్ చేశాడు.

  ప్రస్తుతం కేఏ పాల్ కాకినాడ టూర్ లో ఉన్నారు. అయితే తన కార్లను హోటల్ లో పార్కింగ్ చేస్తుంటే.. వద్దని.. మన ప్లేస్ లో కార్లు పార్కింగ్ చేద్దామని రత్నాకర్ ఒప్పించాడు. దీంతో రత్నాకర్ మాట ప్రకారం.. సీబీఎం కాంపౌడ్ లో కార్లను పార్క్ చేశారు..  ఆ వెంటనే అక్కడి గేల్లకు తాళాలు వేసి రత్నాకర్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడు ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదు.

  ఇదీ చదవండి : ఏపీలో మహిళలకు శుభవార్త.. రేపు వారి ఖాతాలో 15 వేలు జమ.. నగదు రాకపోతే ఇలా చేయండి

  దీంతో కార్లు తీసుకుందామని వెళ్లిన కేఏపాల్ అనుచరులకు షాక్ తప్పలేదు. అక్కడి నుంచి కార్లు తీసుకెళ్లేందుకు కాలేజ్ సిబ్బంది ఒప్పుకోలేదు. రత్నాకర్ చెబితేేనే ఆ తాళలు ఓపెన్ చేస్తామని  చెబుతున్నారు. దీంతో పాల్ అనుచరులు కాలేజ్ సెక్యూరిటీ  సిబ్బంది వాగ్వాదానికి దిగారు. కారణం ఏదైనా పాల్ మాత్రం మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కారు. తన దగ్గర అంత డబ్బు ఉందని.. అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పుకునే పాల్.. సొంత అనుచరుడి దగ్గర అప్పు తీసుకొని.. తీర్చకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై పాల్ ఎలా స్పందిస్తారో చూడాలి..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Ka paul, Kakinada

  ఉత్తమ కథలు