Home /News /andhra-pradesh /

EAST GODAVARI POLICE TAKE NEW INITIATIVE TO PROTECT WOMEN IN THE NIGHT FULL DETAILS HERE PRN

Women Safety in AP: మహిళలకు పోలీసుల శుభవార్త... రాత్రిళ్లు ఉచిత ప్రయాణం... ఎక్కడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిశ యాప్ (Disha App) ద్వారా సమస్యలో ఉన్న మహిళలను నిముషాల్లో రక్షిస్తున్న పోలీసు శాఖ (AP Police) మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిశ యాప్ (Disha App) ద్వారా సమస్యలో ఉన్న మహిళలను నిముషాల్లో రక్షిస్తున్న పోలీసు శాఖ (AP Police) మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. కాకపోతే ఈ సర్వీస్ కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో పోలీసులు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఉద్యోగినులు, విద్యార్థినులు, ఇతర మహిళలు రాత్రి సమయాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాడనికి ఇబ్బందులు ఎదురైతే ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

    ఈ సర్వీస్ కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మహిళలు 94949 33233 లేదా 94907 63498 నంబర్లకు ఫోన్ చేసి ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

    ఇది చదవండి: ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో తెలుగు జవాన్ మృతి.. చిత్తూరు జిల్లాలో విషాదఛాయలు


    ప్రతి వాహనంలో డ్రైవర్ తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ ఉంటారు. అలాగే వాహనం కదలికలను జీపీఎస్ ద్వారా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. కంట్రోల్ రూమ్ ఇన్ స్పెక్టర్.. వాహనల కదలికలు, సేవలను నేరుగా మానిటర్ చేస్తారు.

    ఇది చదవండి: ఆ గ్రామంలోని వారికి ప్రభుత్వ పథకాలు కట్.. అధికారుల ఆదేశాలు.. కారణం ఇదే..!


    ప్రస్తుతం కాకినాడ సిటీలో మాత్రమే ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో జిల్లాలోని అన్ని పట్టణాలకు విస్తరిస్తామని ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు రాత్రి సమయంలో మాత్రమే ఎక్కువ జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

    ఇది చదవండి: కేంద్రాన్ని ఇరుకునపెట్టే పనిలో జగన్.. ఇకపై ఆ నినాదంతో ముందుకు.. అండగా థర్డ్ ఫ్రంట్..?


    ఇదిలా ఉంటే రాష్ట్రప్రభుత్వం దిశా యాప్ ద్వారా మహిళల రక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సమస్యల్లో ఉన్నప్పుడుగానీ, ప్రమాదమని భావించినప్పుడుగానీ యాప్ ఓపెన్ చేసి బట్ నొక్కడం లేదా.. ఫోన్ ను షేక్ చేసినా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుతుంది. ఇటీవల ఢిల్లీలో ఓ ఆటోవాల చేతిలో చిక్కుకున్న యువతిని.. ఏపీ పోలీసులు దిశ యాప్ ద్వారా రక్షించారు. అలాగే ఇప్పటికి వేలాది మందిని దిశా యాప్ ద్వారా రక్షించినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. ఇప్పుడు రాత్రిళ్లు మహిళలకు అండగా ఉండేందుకు ప్రత్యేక వాహన సర్వీసును ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Disha App, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు